మహేష్ బాబు ఫైనల్ లుక్ లీక్, సింహంలా జూలు విదుల్చుతున్న సూపర్ స్టార్
SSMB 29 : సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ మూవీ షూటింగ్ చాలా సీక్రేట్ గా కొనసాగుతున్న వేళ.. మహేష్ బాబు ఫైనల్ లుక్ తాజాగా లీక్ అయ్యింది. సింహంలా జూలు విప్పిన మహేష్ బాబును చూసి ఫ్యాన్స్ కు రోమాలు నిక్కబోడుచుకుంటున్నాయి మరి.

SSMB 29 : సూపర్ స్టార్ మహేష్ బాబు ఫైనల్ లుక్ బయటకు లీక్ అయ్యింది. రాజమౌళి సినిమా కోసం మహేష్ ఎలా కనిపిస్తాడబ్బా అని ఎదరుచూసిన ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి ట్రీట్ ఇచ్చాడు మహేష్ బాబు. ఈ సినిమా కోసం నాలుగైదు లుక్స్ ట్రై చేసి.. ఆ లుక్స్ లో కనిపించిన మహేష్ బాబు. ఫైనల్ లుక్ ను మాత్రం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డాడు. కాని ఆకలిమీద ఉన్న అభిమానులు ఊరు కోరు కదా.. ఎలాగోలా మహేష్ కొత్త అవతారం ఎలా ఉంటుందో బయటకు వచ్చేలా చేశారు.
Also Read: 100 కోట్లు ఇచ్చినా ఆ హీరో పక్కన నటించను, గోల్డెన్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన నయనతార, ఇంతకీ ఎవరా హీరో?
రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా నుంచి మహేష్ బాబు లుక్ లీక్ అయ్యింది. జిమ్ లో మహేష్ బాబు వర్కౌట్ చేస్తున్న టైమ్ లో సీక్రేట్ గా తీసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ లుక్ లో మహేష్ బాబును చూసి షాక్ అవుతున్నారు అభిమానులు. ఆయన హెయిర్ స్టైల్.. బాడీ అంతా షాకింగ్ ట్రాన్స్ ఫర్మేషన్ కనిపిస్తుంది.
ముఖ్యంగా హెయిర్ స్టైల్ అయితే అచ్చం సింహంలా కనిపిస్తుంది. సింహానికి జూలు ఎలా ఉంటుందో అలా ఉంది. జూలు విదిల్చిన సింహంలా.. మహేష్ బాబు అటు ఇటు నడుస్తూ.. సినిమాను ముందే ఊహించుకుని దిల్ ఖుష్ అవుతున్నారు ఫ్యాన్స్. ఈ వీడియోను ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు
Also Read: బిగ్ బాస్ తెలుగు నుంచి నాగార్జున ఔట్, కొత్త హోస్ట్ గా పరిశీలనలో ఇద్దరు స్టార్ హీరోలు?
NanaPatekar to play a key role in Mahesh Babu-Rajamouli film in telugu
రాజమౌళి పవర్ ఫుల్ కథ, పాన్ వరల్డ్ మేకింగ్ కు.. మహేష్ బాబు సింహంలాంటి లుక్ తోడైతే.. హాలీవుడ్ బాక్సాఫీస్ లు కూడా బ్లాస్ట్ అవ్వడం ఖాయం అని అంటున్నారు ఫ్యాన్స్. మొత్తానికి మహేష్ ను ఈ లుక్ లో చూసిన ఫ్యాన్స్ కు కడుపునిండిపోయింది. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
ఇప్పటికే ఇవేమి బయటకు రానివ్వకుండా చాలా సీక్రేట్ గా షూటింగ్ స్టార్ట్ చేశారట టీమ్. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. షూటింగ్ నుంచి చిన్న క్లిప్ కూడా బయటకు పోకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశాడట జక్కన్న. మూడు అంచెలుగా సెక్యూరిటీ కూడా పెట్టాడట.
Also Read: శోభన్ బాబు అత్తా అని ముద్దుగా పిలుచుకునే హీరోయిన్ ఎవరో తెలుసా?
దాదాపు 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో.. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈసినిమాలో మహేష్ బాబు జోడీగా హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. అమెజాన్ అడవులకు సబంధించిన ట్రైబల్ స్టోరీతో.. అడ్వెంచర్ మూవీగా రూపొందుతోందట ఈసినిమా. ఇప్పుడు రంగంలోకి దిగిని రాజమౌళి టీమ్.. ఈసినిమాను 2027 లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక స్క్రీన్ పైన మహేష్ బాబు ఎలా కనిపించబోతున్నాడో చూడాలి. రాజమౌళి మహేష్ బాబు ఫుల్ లుక్స్ బయటకు రాకుండా.. అప్డేట్స్ ను ఎలా ఇస్తాడో కూడా చూడాలి.
Also Read: 53 ఏళ్ళ బ్యాచిలర్ హీరోయన్,5 ఏళ్లుగా టాలీవుడ్ పై అలిగిన ముదురు భామ ఎవరో తెలుసా?
Also Read:20 ఏళ్ళుగా రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్న స్టార్ హీరో, ఎవరో తెలుసా?