షారుఖ్ ఖాన్ రెస్టారెంట్ లో కల్తీ ఫుడ్ ఆరోపణలు, స్పందించని బాద్ షా భార్య గౌరీ ఖాన్
స్టార్ సెలబ్రిటీలు సినిమాలతో పాటు పలు రకాల బిజినెస్ లు కూడా చేస్తుంటారు. అందులో ముఖ్యంగా ప్రతీ ఒక్క సెలబ్రిటీ రెస్టారెంట్ బిజినెస్ లో కి దిగడం సహజం. బాలీవుడ్ ప్రముఖులతో షారుఖ్ ఖాన్ ఫ్యామిలీకి కూడా రెస్టారెంట్ బిజినెస్ లు ఉన్నాయి. అయితే తాజాగా షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నడిపిస్తున్న రెస్టారెంట్ లో కల్తీ ఆహారం ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది.

YouTuber claims fake paneer served at Gauri Khan restaurant
సినిమా ప్రముఖులతో పాటు, క్రికెటర్లు, ఇతర రంగాల స్టార్స్ రెస్టారెంట్స్ బిజినెస్ చేస్తున్నారు. సెలబ్రిటీల హోటల్స్‌లో కాస్ట్లీ ఐటమ్స్ తో భారీ స్థాయిలో మెయింటెన్స్ ఉంటుంది. ఫుడ్ కూడా చాలా క్వాలిటీగా ఉండటంతో.. రెట్లు అదిరిపోతుంటాయి. అయితే రీసెంట్ గా ఓ ఫేమస్ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్..సెలబ్రిటీల రెస్టారెంట్లపై ఓ ప్రత్యేక వీడియో చేశాడు. స్టార్స్ తమ కస్టమర్లకు క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారా లేదా కల్తీ ఆహార పదార్థాలు ఇస్తున్నారా? అని తెలుసుకునేందుకు ఆయా రెస్టారెంట్లకు వెళ్లాడు.
Gauri Khan, Sarthak Sachdeva
అయితే చాలామంది సెలబ్రిటీల రెస్టారెంట్లకు వెళ్ళిన అతనికి.. షారుఖ్ ఖాన్ భార్య నిర్వహిస్తున్న హోటల్‌కు వెళ్లగా.. అక్కడ ఫేక్ పనీర్ ఇస్తున్నట్లు తేలింది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సార్థక్ సచ్‌దేవా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఇతను ఏం చేశాడంటే.. స్టార్ సెలబ్రిటీలు తమ హోటల్స్‌లో వాడుతున్న పనీర్‌పై అయోడిన్ టింక్చర్ టెస్ట్ చేశాడు.
Also Read: ఆలియా భట్ కంటే ముందు, రణ్ బీర్ డేటింగ్ చేసిన 5 గురు స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?
Virat Kohli Restaurant
అతని పరిశోధనలోభాగంగా.. విరాట్ కోహ్లీకి చెందిన ‘వన్ 8 కమ్యూన్, శిల్పా శెట్టికి చెందిన ‘బాస్టియన్’, బాబీ డియోల్ కు చెందిన ‘సమ్‌ప్లేస్ ఎల్స్’ షారుఖ్ ఖాన్ భార్య గౌరీఖాన్ నడిపిస్తున్నటువంటి ‘టోరీ’ రెస్టారెంట్లకు వెళ్లాడు. ఆయా రెస్టారెంట్లలో వాడుతున్న పనీర్‌పై టెస్ట్ చేశాడు. అయితే, అందరు సెలబ్రిటీలు అందిస్తున్న పనీర్‌పై అయోడిన్ టింక్చర్ చేయగా.. ఎలాంటి తేడాలు కనిపించలేదు. కాని గౌరీ ఖాన్ టోరీ రెస్టారెంట్‌లో పనీర్‌ను పరీక్షించగా అది ఫేక్ అని తేలిందంటు ఆయన తెలిపాడు.
Also Read: బాలయ్య, చిరంజీవిలా నాకు కూడా గుడి కట్టండి, సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
గౌరీ ఖాన్ హోటల్‌లో అతను ఆర్డర్ ఇచ్చిన పనీర్‌పై అయోడిన్ టింక్చర్ టెస్ట్ చేయగా.. నల్లగా మారడంతో అది ఫేక్ పన్నీరు అంటున్నాడు సార్దక్. దీనిపై టోరీ రెస్టారెంట్ స్పందించింది. అయోడిన్ టింక్చర్ టెస్ట్ స్టార్చ్ ఉనికిని మాత్రమే చూపిస్తుందని.. వంటకంలో సోయా ఆధారిత పదార్థాలు ఉన్నందున వల్లే అలాంటి రియాక్షన్ వచ్చిందని, ఫేక్ కాదని అంటోంది.
నిజానికి పనీర్‌తో సహా ఆహార పదార్థాల్లో స్టార్చ్‌ను గుర్తించేందుకు అయోడిన్ టింక్చర్ టెస్ట్ చేస్తుంటారు. సహజంగా తయారు చేసిన పనీర్‌లో స్టార్చ్ ఉండకూడదని.. పనీర్‌తో స్టార్చ్ కలిసినప్పుడు అయోడిన్ నీలం-నలుపు రంగులోకి మారితే అది కల్తీ అయినట్టు అంటున్నారు. అయితే, తాము అందించే పనీర్ నాణ్యమైందని రెస్టారెంట్ నిర్వాహకులు అంటున్నారు. కాని దీనిపై షారుఖ్ ఖాన్ భార్య గౌరీఖాన్ మాత్రం స్పందించలేదు.