- Home
- Entertainment
- తనతో 23 హిట్ సినిమాలు చేసిన డైరెక్టర్ ను అవమానించిన మెగాస్టార్, చిరంజీవిని స్టార్ హీరోను చేసిన దర్శకుడెవరు
తనతో 23 హిట్ సినిమాలు చేసిన డైరెక్టర్ ను అవమానించిన మెగాస్టార్, చిరంజీవిని స్టార్ హీరోను చేసిన దర్శకుడెవరు
మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో స్వతహాగా ఎదిగిని వ్యక్తి. ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా.. స్వయంకృషితో హీరో అయ్యాడు చిరంజీవి. చిన్న చిన్న పాత్రలతో స్టార్ట్ అయ్యి.. హీరోగా, సుప్రీమ్ హీరోగా, మెగాస్టార్ గా టాలీవుడ్ ను ఏలుతున్నాడు. ప్రస్తుతం తెలుగు సినీపరిశ్రమకు పెద్దన్నలా అన్ని విషయాల్లో అండగా ఉంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలు ఫేస్ చేశారు మెగాస్టార్.

అయితే కొన్ని సినిమాలు, కొంత మంది దర్శకులు మెగాస్టార్ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడ్డారు. ఒకరకంగా వారి సినిమాల వల్లే ఆయన ఈ స్థాయిలో ఉన్నారు. చిరంజీవితో వరుసగా హిట్ సినిమాలు చేసిన స్టార్ డైరెక్టర్ ఒకరు ఉన్నారు. ఆయన మెగాస్టార్ తో 23 మూడు సినిమాలు చేశారు. అందులో అన్ని హిట్ సినిమాలే.. కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే మరికొన్ని మోస్తర్ హిట్స్ అయ్యాయి.
Also Read: మహేష్ బాబు మిస్ అయ్యాడు, రామ్ చరణ్ హిట్ కొట్టాడు, ఏ సినిమానో తెలుసా?
చిరంజీవికి మాస్ ఇమేజ్ తో పాటు, స్టార్ హీరో స్టేటస్ వచ్చింది. ఆ దర్శకుడి వల్లే. కాని చిరంజీవి మాత్రం ఆ దర్శకుడిని అవమానించారట. కనీస మర్యద కూడా ఇవ్వలేదట. ఈ విషయాన్ని ఆదర్శకుడే ఓ ఇంటర్యూలో వెల్లడించారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఆయన ఎవరో కాదు కోదండరామిరెడ్డి. చిరంజీవితో ఆయన చేసిన సినిమాలన్నీ దాదాపు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.
Also Read: శ్రీదేవికి , చిరంజీవికి మధ్య గొడవ, మధ్యలో ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా? అసలేం జరిగింది.
చిరంజీవి హీరోగా అభిలాషతో మొదలై.. ఖైదీ, ఛాలెంజ్ , రుస్తూం, దొంగ, విజేత, కిరాకతకుడు, రాక్షసుడు, వేట, రక్త సింధూరం ఇలా బ్లాక్ బస్టర్ సినిమాలతో చిరంజీవికి స్టార్ హీరోగా లైఫ్ ఇచ్చారు కోదండరామిరెడ్డి. అయితే ఎక్కడ ప్రాబ్లమ్ జరిగిందో ఏమో కాని.. వీరి మధ్య మాత్రం ప్రస్తుతం అంతగా సఖ్యత లేదు. చిరంజీవి కూడా తన కెరీర్ ను నిలబెట్టిన దర్శకుడిగా కోదండరామిరెడ్డి ప్రస్తావన ఎక్కడా తీసుకువచ్చినట్టు కనిపించలేదు.
అంతే కాదు ఓ సందర్భంలో చిరంజీవిని స్టార్ గా నిలబెట్టి, లైఫ్ ఇచ్చిన దర్శకులు ఎవరు అంటే కోదండ రామిరెడ్డి పేరు చెప్పలేదు. ఆయన పేరు చెప్పకుండా ఇతర దర్శకుల పేర్లు చెప్పారు చిరంజీవి. ఈ విషయం తనను ఎంతో బాధించిందని కోదండరామిరెడ్డి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఎవరేమనకున్న చిరంజీవి అలా చేయడం కరెక్ట్ కాదు అని ఆయన అన్నారు. ఈరకంగా మెగాస్టార్ కోదండరామిరెడ్డిని అవమానించారని కొంత మంది నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇండస్ట్రీలో నిలబెట్టిన దర్శకుడిని ఇలా అవమానించడం కరెక్ట్ కాదు అంటున్నారు.
Chiranjeevi
69 ఏళ్ళ వయస్సులో కూడా మెగాస్టార్ చిరంజీవి హీరోగా దూసుకుపోతున్నారు. కుర్ర హీరోలకు కూడా పోటీ ఇస్తూ.. సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వశిష్ట్ డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈసినిమా తరువాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మూవీ చేయబోతున్నారు. ఈసనిమాకు సబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది.