MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Divvala Madhuri ఇచ్చిన సర్‌ప్రైజ్‌లు బయటపెట్టిన దువ్వాడ శ్రీనివాస్‌.. ఆ విషయంలో స్వీట్‌ వార్నింగ్‌

Divvala Madhuri ఇచ్చిన సర్‌ప్రైజ్‌లు బయటపెట్టిన దువ్వాడ శ్రీనివాస్‌.. ఆ విషయంలో స్వీట్‌ వార్నింగ్‌

దివ్వెల మాధురిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దువ్వాడ శ్రీనివాస్‌. ఆమె తనతో ఉంటే ఎప్పుడూ సర్‌ప్రైజ్‌గానే ఉంటుందని, తాను పడిపోయినప్పుడు తన వెంటే ఉందని తెలిపారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 22 2026, 12:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
క్రేజీ కపుల్‌గా రాణిస్తోన్న దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి
Image Credit : instagram/divvala madhuri

క్రేజీ కపుల్‌గా రాణిస్తోన్న దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి

దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్‌ జోడీ సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరు ఆదర్శ జంటగా నిలుస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరిద్దరి గురించి చాలా కాలంగా చర్చ నడుస్తోంది. తరచూ ఈ ఇద్దరు యూట్యూబ్‌ ఇంటర్వ్యూలిస్తూ  వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఈ జంట ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమని చాటుకున్నారు. దివ్వెల మాధురిపై శ్రీనివాస్‌ చేసిన కామెంట్‌ వైరల్‌ అవుతుంది. దెబ్బకి మాధురి కన్నీళ్లు పెట్టుకుంది.

25
దివ్వెల మాధురిసర్‌ప్రైజ్‌లపై దువ్వాడ శ్రీనివాస్‌ కామెంట్‌
Image Credit : instagram/@madhuri_srinivasduvvada

దివ్వెల మాధురిసర్‌ప్రైజ్‌లపై దువ్వాడ శ్రీనివాస్‌ కామెంట్‌

లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాధురి గురించి శ్రీనివాస్‌ మాట్లాడుతూ, తను తరచూ సర్‌ప్రైజ్‌ చేస్తుందని తెలిపారు. బ్రాస్లెట్, వాచ్‌లు, కార్లు ఇలాంటి గిఫ్ట్ లు ఇస్తుందని, నిత్యం ఏదో రకంగా సర్‌ప్రైజ్‌ చేస్తుందని తెలిపారు. అంతేకాదు ఇవ్వన్నీ ఇవ్వడం కాదు, మాధురి తన లైఫ్‌లోకి రావడమే పెద్ద సర్‌ప్రైజ్‌ అని తెలిపారు శ్రీనివాస్‌. ఆమె తనతో ఉండటమనేదే తనకు సర్‌ప్రైజ్‌ అనిపిస్తుందని వెల్లడించారు. మాధురి తనతో ఉంటే ప్రతి నిమిషం తాను గొప్పగానే ఫీలవుతానని తెలిపారు. నేను ఎక్కడైతే పడిపోయానో, అక్కడి నుంచే లేవాలని చెప్పి, ఎంతో అండగా నిలిచి,  అన్ని రకాలుగా అండదండలు అందించిందని చెప్పారు. తాను మళ్లీ గొప్ప స్థాయికి రావాలని ప్రతి నిమిషం కోరుకుంటుందని, అదే తనకు గ్రేట్‌ సర్‌ప్రైజ్‌ అని చెప్పారు శ్రీనివాస్‌.

Related Articles

Related image1
Anchor Suma Remuneration: యాంకర్‌ సుమ ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలిస్తే మతిపోవాల్సిందే.. స్టార్‌ హీరోల రేంజ్‌
Related image2
MSG 100 Days: మన శంకర వర ప్రసాద్‌ గారు టోటల్‌ కలెక్షన్లు.. కూతురు సుస్మిత లైఫ్‌ సెట్‌ చేసిన చిరంజీవి
35
దివ్వెల మాధురి కన్నీళ్లు
Image Credit : instagram/@madhuri_srinivasduvvada

దివ్వెల మాధురి కన్నీళ్లు

శ్రీనివాస్‌ మాటలకు మాధురి ఎమోషనల్‌ అయ్యింది. ఇంటర్వ్యూలోనే ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సందర్భంగా మాధురికి మరో హామీ ఇచ్చారు శ్రీనివాస్‌. ఆయన కట్టేకాలే వరకు నవ్వే నాతో ఉంటావని, నీనే నీతో ఉంటానని, ఇందులో తేడా లేదని, మనల్ని ఎవరూ టచ్‌ చేయలేరని స్పష్టం చేశారు. బతికున్నంత వరకు కలిసే ఉంటామని చెప్పారు. దీనికి కూడా మాధురి ఎమోషనల్‌ అయ్యింది.

45
దివ్వెల మాధురికి శ్రీనివాస్‌ స్వీట్‌ వార్నింగ్‌
Image Credit : madhuri_srinivasduvvada/Instagram

దివ్వెల మాధురికి శ్రీనివాస్‌ స్వీట్‌ వార్నింగ్‌

ఈ సందర్భంగా మాధురికి స్వీట్‌ వార్నింగ్‌  ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్‌. ఆమె కోపంలో కంట్రోల్‌ తప్పుతుందని, ఆలోచించకుండ మాట్లాడుతుందని, ఎక్స్ ట్రీమ్‌కి వెళ్లిపోతుందని తెలిపారు. ఇలాంటి సమయంలోనే మనిషి కంట్రోల్‌గా ఉండాలని, ఆగి ఆలోచించాలని తెలిపారు. అందరితోనూ బాగుండాలని, ఎవరినీ హర్ట్ చేయోద్దని వెల్లడించారు. కోపంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. అలాంటివి మానుకోవాలని తెలిపారు శ్రీనివాస్‌. ఐడ్రీమ్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు దువ్వాడ శ్రీనివాస్‌.

55
ఎమ్మెల్సీగా శ్రీనివాస్‌, వ్యాపారవేత్తగా మాధురి బిజీ
Image Credit : own

ఎమ్మెల్సీగా శ్రీనివాస్‌, వ్యాపారవేత్తగా మాధురి బిజీ

దువ్వాడ శ్రీనివాస్‌ ప్రస్తుతం వైసీపీ నాయకుడిగా, ఎంఎల్‌సీగా పనిచేస్తున్నారు. ఆయన రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. వైఎస్‌ జగన్‌ని ఎంతో ఆరాధిస్తుంటారు. అలాగే మాధురి సోషల్‌ మీడియా ద్వారా పాపులర్‌ అయ్యింది. శ్రీనివాస్ ని పెళ్లి చేసుకుని సంచలనంగా మారింది. బిగ్‌ బాస్‌ తెలుగు 9లోకి వెళ్లొచ్చి సెలబ్రిటీగా మారిపోయింది. మరోవైపు విజయవంతంగా బట్టల వ్యాపారం చేస్తోంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఆంధ్ర ప్రదేశ్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Upcoming Movies: 7 సినిమాల రిలీజ్ డేట్స్ వచ్చేశాయ్.. బాలీవుడ్, సౌత్ సినిమాల జాతర
Recommended image2
Anchor Suma Remuneration: యాంకర్‌ సుమ ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలిస్తే మతిపోవాల్సిందే.. స్టార్‌ హీరోల రేంజ్‌
Recommended image3
Tanikella Bharani: 'శివ' మూవీలో అసలు కథ ఉందా అని అడిగా.? అప్పుడు RGV చెప్పింది ఇదే
Related Stories
Recommended image1
Anchor Suma Remuneration: యాంకర్‌ సుమ ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలిస్తే మతిపోవాల్సిందే.. స్టార్‌ హీరోల రేంజ్‌
Recommended image2
MSG 100 Days: మన శంకర వర ప్రసాద్‌ గారు టోటల్‌ కలెక్షన్లు.. కూతురు సుస్మిత లైఫ్‌ సెట్‌ చేసిన చిరంజీవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved