- Home
- Entertainment
- సీతారామం నుంచి లక్కీ భాస్కర్ వరకు, ఓటీటీలో దుల్కర్ సల్మాన్ టాప్ 5 మూవీస్ ఏంటో తెలుసా?
సీతారామం నుంచి లక్కీ భాస్కర్ వరకు, ఓటీటీలో దుల్కర్ సల్మాన్ టాప్ 5 మూవీస్ ఏంటో తెలుసా?
యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన సినిమాల్లో ఓటీటీలో చూడదగ్గ టాప్ 5 బెస్ట్ మూవీస్ ఏంటో తెలుసా?

దుల్కర్ సల్మాన్ టాప్ 5 ఓటీటీ సినిమాలు
దక్షిణ భారత సినిమాలో ప్రముఖ నటులలో ఒకరైన దుల్కర్ సల్మాన్ తమిళం, మలయాళం, తెలుగు , హిందీ భాషల్లో అనేక చిత్రాలలో నటించారు. సెకండ్ షో చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన దుల్కర్ సల్మాన్ మలయాళంతో పాటు తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో కూడా రాణిస్తున్నారు. రీసెంట్ గా ఆయన లక్కీ భాస్కర్ సినిమాతో హిట్ కొట్టాడు.
ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు దుల్కర్. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటించిన లోక చాప్టర్ వన్: చంద్ర, కాంత, ఆకాశం లో ఓ తార సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. అద్భుతమైన కంటెంట్ తో ఎన్నో హిట్ సినిమాలు చేసిన దుల్కర్ సల్మాన్ కెరీర్లో, ఓటీటీలో చూడదగ్గ టాప్ 5 మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
సీతారామం
2022లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా సీతా రామం. 1960ల నాటి ప్రేమకథ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ భారత సైనిక అధికారి లెఫ్టినెంట్ రామ్‌గా నటించారు. ఈ సినిమాలో సీత పాత్రలో నటించిన మృణాల్ ఠాకూర్ నుండి ఉత్తరం రావడంతో ఆమెను వెతుక్కుంటూ బయలుదేరుతారు. ఆ తర్వాత జరిగే సంఘటనలే సినిమా కథ. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
లక్కీ భాస్కర్
తెలుగు యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, రాంకీ, మీనాక్షి చౌదరి తదితరులు నటించిన సినిమా లక్కీ భాస్కర్. బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేసే దుల్కర్, రాంకీ ద్వారా ఊహించని విధంగా కోటీశ్వరుడు అవుతాడు. అతనికి ఎలా డబ్బు వచ్చింది, బ్యాంకులో డబ్బు దుర్వినియోగం చేశాడా లేదా అనేది కథ. దుల్కర్ సల్మాన్ అద్భుతమైన పాత్రలో జీవించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.
బెంగళూరు డేస్
దుల్కర్ సల్మాన్ రేసర్‌గా డిఫరెంట్ గెటప్ లో కనిపించిన సినిమా బెంగళూర్ డేస్. లవ్ ఫ్రెండ్షిప్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎటర్టైన్మెంట్ తో పాటు సెంటిమెంట్ తో ఆకట్టుకుంది. అంజలీమీనన్ డైరెక్ట్ చేసిన ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయ్యింది. ఇక ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.
కనులు కనులను దోచాయంటే
దుల్కర్ సల్మాన్, రితు వర్మ, రక్షన్ తదితరులు నటించిన చిత్రం కణుమ్ కణుమ్ కొల్లైయాడితల్. తెలుగులో ఈసినిమా కనులు కనులను దోచాయంటే టైటిల్ తో రిలీజ్ అయ్యింది. గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ మూవీ, ఆన్‌లైన్ మోసాలు, దొంగతనాల నేపథ్యంలో రూపొందింది. తెలుగు,తమిళ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
చార్లీ
మార్టిన్ ప్రక్కట్ డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్, పార్వతి, అపర్ణ గోపీనాథ్, నెడుముడి వేణు తదితరులు నటించిన చిత్రం చార్లీ. ఓ రహస్య వ్యక్తి జీవితాన్ని ఆధారంగా తీసుకున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ విభిన్న పాత్రలో నటించి తన నటనా ప్రతిభను చాటుకున్నారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో చూడవచ్చు.
కురూప్
దర్శకుడు శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, శోభితా ధూళిపాళ్ల, ఇంద్రజిత్ సుకుమారన్, విజయ రాఘవన్ తదితరులు నటించిన సినిమా కురూప్. 35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 78 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.