- Home
- Entertainment
- ముసలి, రోగిష్టి పాత్ర చేయను, హీరోకి ఫోన్ చేసి క్లారిటీ ఇచ్చిన శోభన్ బాబు, గోల్డెన్ ఆఫర్ వదులుకున్న సోగ్గాడు.
ముసలి, రోగిష్టి పాత్ర చేయను, హీరోకి ఫోన్ చేసి క్లారిటీ ఇచ్చిన శోభన్ బాబు, గోల్డెన్ ఆఫర్ వదులుకున్న సోగ్గాడు.
60 ఏళ్లకే సినిమాల నుంచి రిటైర్ అయ్యారు శోభన్ బాబు. ఎవరు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఆయన చేయలేదు. ఈక్రమంలోనే ఓ మాజీ హీరో, స్టార్ నటుడు బ్లాంక్ చెక్ పంపించి ఓ పాత్ర చేయాలని కబురు పెట్టారట. శోభన్ బాబు ఈ విషయంలో ఎలా స్పందించారో తెలుసా? ఇంతకీ ఏంటా సినిమా?

అందాల నటుడు, సోగ్గాడు శోభన్ బాబు
నటభూషన్, అందాల నటుడు, సోగ్గాడు శోభన్ బాబు. ఇండస్ట్రీ అంతా ఒక ఎత్తు అయితే, శోభాన్ బాబు మాత్రం ఒక వైపు. ఆయన పద్దతులు, జీవన విధానం, హెల్దీ లైఫ్ స్టైల్, ఆర్ధిక క్రమశిక్షణ, టైమ్ సెన్స్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే, శోభన్ బాబు జీవితం అంతా చాలా పద్దతిగా, క్రమశిక్షణతో గడిపారు. అంతే కాదు ఆయన సినిమాల్లో సంపాదించిన డబ్బును బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ లో భారీగా ఆస్తులు కూడా సంపాదించాడు.
తన ఫ్యామిలీలో ఎవరినీ సినిమాల వైపు రాకుండా చూసుకున్నారు శోభన్ బాబు. ఏ విషయంలో అయినా ఒక్క సారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాడు శోభన్ బాబు. ఎవరు చెప్పినా ఆ నిర్ణయంతో మార్పు ఉండదు. నటించకూడదు అని ఒక్క సారి నిర్ణయం తీసుకున్న శోభన్ బాబు, ఆతరువాత ఎవరు వచ్చి అడిగినా అదే మాటకు కట్టుబడి ఉన్నారు. కోట్లు ఇస్తామన్న ఆయన సినిమాలు చేయలేదు.
అతడు సినిమా మిస్ అయిన శోభన్ బాబు
అంతే కాదు ఎన్ని మీడియా సంస్థలు వెళ్లినా ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు అందాల నటుడు. తన ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. తనను అందాల నటుడిగా, సోగ్గాడిగా ఆదరించిన తన అభిమానులు తండ్రి, తాత పాత్రల్లో తనను చూడలేరని శోభన్ బాబు నమ్మేవారు.
అందుకే 60 ఏళ్లు దాటిన తరువాత నటించకూడదు అని ఫిక్స్ అయ్యి ఉన్నారు. దాంతో ఎంత మంది స్టార్స్ వచ్చి బ్రతిమిలాడినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈక్రమంలోనే అతడు సినిమాకోసం శోభన్ బాబును ఎలాగైనా తీసుకోవాలని ప్రయత్నం చేశారు నిర్మాత, నటుడు మురళీ మోహన్. అతడు సినిమాలో మహేష్ బాబు తాత పాత్రను శోభన్ బాబుతో చేయిస్తే బాగుంటుంది అనుకున్నారు మురళీ మోహన్.
ఈ విషయాన్ని రీసెంట్ గా వెల్లడించారు స్టార్ నటుడు. అతడు సినిమాను రీరిలీజ్ చేస్తున్నసందర్భంగా ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు మరళీమోహాన్. అందులో ఆయనకు ఓ ప్రశ్న ఎదురయ్యింది. అతడు సినిమాలో నాజర్ పాత్ర కోసం శోభన్ బాబును తీసుకోవాలి అనుకున్నాట కదా అని మీడియా ప్రతినిధి అడిగారు.
శోభన్ బాబకు బ్లాంక్ చెక్ పంపించిన మురళీ మోహాన్
దానికి మురళీమోహన్ సమాధానం చెపుతూ ఇలా అన్నారు. '' అవును అతడు సినిమా కథ విన్న తరువాత అందులో నాజర్ పాత్ర శోభన్ బాబు చేస్తే బాగుంటుంది అనిపించింది. ఆయన అయితే ఆ పాత్రకు బాగుంటుంది, సినిమా ఇమేజ్ కూడా పెరుగుతుంది. కథకు చాలా ముఖ్యమైన పాత్ర అది. కాని అప్పటికే శోభన్ బాబు సినిమాలు మానేశారు. చేస్తే హీరోగానే చేయాలి.. క్యారెక్టర్ రోల్స్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యి ఉన్నారు.
అయితే ఈ పాత్ర కోసం శోభన్ బాబు ను అనుకున్నప్పుడు ఈ విషయం డైరెక్టర్ త్రివిక్రమ్ తో చెపితే.. చాలా బాగుంటుంది, ఆయన ఒప్పుకుంటే కావలసింది ఏముంది అని అని అన్నారు. అయితే నేను అడగటానికి మొహమాటపడి నా మేకప్ మెన్ రామును చెన్నై పంపించాను. ఓ బ్లాంక్ చెక్ ఇచ్చి రెమ్యునరేషన్ సమస్య కాదు, మీ ఇష్టం మంచి పాత్ర అని చెప్పమన్నాను'' అని మురళీ మోహన్ అన్నారు.
మురళీమోహన్ కు ఫోన్ చేసి శోభన్ బాబు ఏమన్నారంటే?
మురళీ మోహన్ మాట్లాడుతూ.. ''నేను బ్లాంక్ చెక్ పంపించగానే ఆయన వెంటనే నాకు ఫోన్ చేసి మాట్లాడారు. సారి మురళీమోహన్ గారు, మీ మాట కాదంటున్నాను. ఈ పాత్ర నేను చేయలేను అని అన్నారు. శోభన్ బాబు అంటే నా అభిమానులకు హీరోగానే గుర్తుండిపోవాలి. అందగాడు, సోగ్గాడు అనే మాట అలా నిలబడుతుంది.
అంతే కాదు నేను క్యారెక్టర్ రోల్స్, తాత, తండ్రి రోల్స్ చేస్తే నా అభిమానులు తట్టుకోలేరు. హీరోగా నన్ను చూసిన ఫ్యాన్స్, ముసలి, రోగిస్టి పాత్రల్లో చూడలేరు, నేను చేయలేను. అది మంచి పాత్ర అయితేనే మీరు నా దగ్గరకు పంపిస్తారు. నాకు తెలుసు, సినిమాకు కీ రోల్ కాబట్టి నన్ను అడిగి ఉంటారు. కాని నేను ఈ పాత్ర చేయలేను అని చెప్పారు.
గతంలో నా బ్యానర్ లో సూపర్ హిట్ సినిమాలు శోభన్ బాబు చేశారు. కాని అతడు సినిమా మాత్రం ఆయన తో చేయించాలని అనుకన్నాను కాని కుదరలేదు'' అని అన్నారు మురళీ మోహన్. ఈ క్యారెక్టర్ చేయమని బ్లాంక్ చెక్ ఇచ్చి, టీమ్ ను చెన్నై పంపించారట మురళీ మోహన్. కాని శోభన్ బాబు మాత్రం సున్నితంగా ఈ పాత్రనురిజెక్ట్ చేశారట. వెంటనే మరళీ మోహన్ కు ఫోన్ చేసి క్లారిటీ కూడా ఇచ్చారట.
రీ రిలీజ్ కు రెడీగా మహేష్ బాబు అతడు సినిమా
నిర్మాతగా మురళీ మోహన్ అద్భుతమైన సినిమాలు చేశారు. మరీ ముఖ్యంగా ఆయన నిర్మించిన అతడు సినిమా టాలీవుడ్ లో సెన్సేషన్ అయ్యింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో 2005లో వచ్చిన 'అతడు' సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ సినిమాను జయభేరి ఆర్ట్స్ బ్యానర్ పై మురళీమోహన్ నిర్మించారు. ఈసినిమాకు ఎంత క్రేజ్ ఉందంటే.. ఇప్పటికీ టీవీలో ఈ సినిమా ప్లే అయితే అలా చూస్తుండిపోతుంటారు అభిమానులు.
అతడు సినిమాకు టీవీ టీఆర్పీలు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. ఇక అతడు సినిమా 1500 సార్లు టీవీలో ప్లే అయ్యి రికార్డ్ కూడా క్రీయేట్ చేసింది. ఇన్ని రికార్డు లు ఉన్న ఈసినిమా రీరిలీజ్ కు రెడీ అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుండగా, స్టార్ హీరోలు నటించిన హిట్ సినిమాలను వరుసగా రీరిలీజ్ చేస్తున్నారు. ఈక్రమంలో అతడు మూవీని కూడా కొత్త హంగులతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఆగస్టు 9న అతడు రీ రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో, మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు.