- Home
- Entertainment
- ఆ చంద్రుడు లేనిదే ఈ సూర్యుడు లేడు, స్టేజ్ పైనే కన్నీరు పెట్టిన రచ్చ రవి, జబర్థస్త్ లో ఎమోషనల్ మూమెంట్
ఆ చంద్రుడు లేనిదే ఈ సూర్యుడు లేడు, స్టేజ్ పైనే కన్నీరు పెట్టిన రచ్చ రవి, జబర్థస్త్ లో ఎమోషనల్ మూమెంట్
జబర్థస్త్ లో నవ్వులు పూయిస్తూ.. కడుపుబ్బా నవ్విస్తుంటాడు రచ్చ రవి, చమ్మకు చంద్రాతో కలిసి వందల స్క్కిట్లు చేసిన రవి ఎమోషనల్ అవ్వడం ఎప్పుడైనా చూశారా? కాని ఈసారి స్టేజ్ పై గతాన్ని గుర్తు చేసుకుని అందరి చేత కన్నీళ్లు పెట్టించాడు రవి.

టాలీవుడ్ కు కమెడియన్లను అందించిన జబర్ధస్త్
మారుమూల దాగిఉన్న టాలెంట్ ను బయటకు తీసుకువచ్చిన కామెడీ షో జబర్దస్త్. ఊళ్లో సరదాగా ఫ్రెండ్స్ తో పంచ్ లు వేసుకుంటూ, కామెడీ చేసేవారికి కూడా బుల్లితెరపై లైఫ్ ఇచ్చిన షో జబర్థస్త్. పుష్కరానికి పైగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతున్న జబర్ధస్త్ వల్ల వదలమంది ఆర్టిస్ట్ లు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. . 2013లో ప్రారంభమైన ఈషో వల్ల ఇప్పటి వరకు ఎంతో మంది ఆర్టిస్టులు సెలబ్రెటీలుగా మారారు.
అంతే కాదు ఇప్పటికీ కొత్త ఆర్టిస్ట్ లను ఇండస్ట్రీకి అందిస్తూనే ఉంది జబర్ధస్త్ . జబర్ధస్త్ వల్ల స్టార్ కమెడియన్స్ గా మారినవారిలో కమెడియన్ రచ్చ రవి కూడా ఒకరు. చమ్మకు చంద్ర టీమ్ ద్వారా జబర్దస్త్ కు పరిచయం అయిన రవి, రకరకాల గెటప్పులతో, తెలంగాణ యాసలో డైలాగ్స్ తో అదరగొట్టాడు. మరీ ముఖ్యంగా లేడీ గెటప్ లో, అచ్చమైన తెలంగాణ భాషల్ రవి డైలాగ్స్ ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి.
KNOW
జబర్థస్త్ కమెడియన్స్ వెనుక విషాద కథలు
అయితే జబర్థస్త్ లో నటించిన ప్రతీ కమెడియన్ వెనుకు ఏదో ఒక విషాద కథ ఉండటం తెలిసిందే. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఫేస్ చేసి, ఎన్నో బాధలను దిగమిగి జబర్ధస్త్ స్టైజ్ పై నవ్వులు పూయించారు కమెడియన్లు. అందులో కొంత మంది అనారోగ్యంతో మరణించిన వారు కూడా ఉన్నాయి. ఈక్రమంలోనే తాజాగా జబర్దస్త్ కామెడీ షో 12 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా పుష్కరోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేశారు టీమ్.
ఈ ఈవెంట్ ను ప్రత్యేకమైన ఎపిసోడ్ గా టెలికాస్ట్ చేశారు. ఈ సందర్భంగా పాత ఆర్టిస్ట్ తో పాటు జడ్జీగా వ్యవహరించిన నాగ బాబు కూడా ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఈక్రమంలోనే రచ్చి రవి కూడా హాజరై ఎమెషనల్ కామెంట్స్ తో అక్కడ ఉన్నవారందరిని ఏడిపించేశారు.
వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న రచ్చ రవి
జబర్దస్త్ కామెడీ షో స్టార్ట్ అయ్యి 12 ఏళ్లు పూర్తయిన సంరద్భంలో నిర్వాహకులు గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ షో ప్రారంభం నుంచి ఉన్న స్టార్ కామెడీ ఆర్టిస్ట్ లు అయిన రాకెట్ రాఘవ, వేణు వండర్స్, అదిరే అభి, చమ్మక్ చంద్ర, చలాకీ చంటీ, గెటప్ శ్రీను, రచ్చ రవి వంటి వారు సందడి చేశారు. వీరితో పాటు జబర్థస్త్ మాజీ జడ్జ్ నాగ బాబు, యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రచ్చ రవి ఎమోషనల్ అయ్యాడు.
ఈ సందర్భంగా రచ్చ రవి ఎమోషనల్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ.. నేను అన్నం తినేప్పుడు ప్రతి రోజూ గుర్తుకు వచ్చే వ్యక్తి చమ్మక్ చంద్ర అన్న. ఆ చంద్రుడు లేనిది ఈ స్యూరుడు లేడు. నా జీవితాన్ని నిలబెట్టింది చంద్రన్న అంటూ రచ్చరవి ఒక్క సారిగా ఎమోషనల్ అయ్యాడు. దాంతో అక్కడ వాతావరణం ఒకేసారి మారిపోయింది. రవి కామెంట్స్ తో అందరు ఎమోషనల్ అయ్యారు
. ప్రతీ ఒక్కరు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇన్నేళ్ల కెరీర్ లో రవి ఇంత ఎమోషనల్ అవ్వడం ఇదే తొలిసారి. అయితే వెంటనే చమ్మక్ చంద్ర మైక్ తీసుకుని మళ్లీ పరిస్థితిని మర్చేశారు. చంద్ర మాట్లాడుతూ. '' నేను ఎప్పుడో వీడికి డైలాగ్స్ గుర్తు పెట్టుకోవడం కోరసం రెండు టాబ్లెట్స్ ఇచ్చాను. వాటి వల్ల ఇలా అయిపోతాడు అనుకోలేదు అని చంద్ర అనగానే వెంటనే అందరు ఒక్క సారిగా నవ్వారు.
అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రవి
వరంగల్ జిల్లా హన్మకొండలో పుట్టి పెరిగిన రచ్చ రవి, ఎన్నోపనులు చేస్తూ.. హైదరాబాద్ చేరాడు. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ తండ్రి దగ్గర సహాయకుడిగా పనిచేసిన రవి, కొంత మంది దర్శకులు దగ్గర రకరకాల పనులు చేశారు. అంతే కాదు డైరెక్టర్ అవ్వాలన్న ఆశతో కొన్ని సీరియల్స్ కు కూడా వర్క్ చేశాడు రవి. పుత్తడి బొమ్మ, శిఖరం వంటి సీరియల్స్ కు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాడు.
ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోలో నటించేందుకు చమ్మక్ చంద్ర నిర్వహించిన ఆడిషన్ లో సెలక్ట్ అయ్యాడు రవి. జబర్దస్త్ వేదికపై చమ్మక్ చంద్రతో కలిసి ఎన్నో స్కిట్లలో నటించారు. తెలంగాణ యాస, భాషతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
వరుస సినిమాలతో బిజీ బిజీగా రచ్చ రవి.
రచ్చ రవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కొన్ని సినిమాల్లో ఫుల్ లెన్త్ రోల్స్ చేస్తున్న రవి.. కొన్నిసినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేస్తున్నాడు. అయితే కమెడియన్ గా స్టార్ డమ్ మాత్రం సంపాదించుకోలేకపోయాడు రవి. వెయ్యి అబద్దాలు సినిమాతో స్టార్ట్ అయిన రవి కెరర్.. ఆతరువాత పరుగులలు పెట్టింది.
ధనలక్ష్మి తలుపు తడితే, కిస్మత్, ఖైదీ నెం.150, శతమానం భవతి, రాజా ది గ్రేట్, నేనే రాజు నేనే మంత్రి, నీది నాదీ ఒకే కథ, గద్దలకొండ గణేష్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, రెడ్, క్రాక్, ఎఫ్3, లైగర్, వాల్తేరు వీరయ్య, భగవంత్ కేసరి, గేమ్ ఛేంజర్..రీసెంట్ గా రాం రాఘవం, బాపు, శ్రీశ్రీశ్రీ రాజావారు వంటి సినిమాలతో టాలీవుడ్ లో తన మార్క్ చూపించుకుంటున్నాడు.