MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • మయసభలో ఆది పినిశెట్టి నటనకి దేవకట్టా ఫిదా.. అది వారసత్వంగా వచ్చింది కాదు అంటూ ప్రశంసలు

మయసభలో ఆది పినిశెట్టి నటనకి దేవకట్టా ఫిదా.. అది వారసత్వంగా వచ్చింది కాదు అంటూ ప్రశంసలు

ఆది పినిశెట్టి తండ్రి రవిరాజా పినిశెట్టి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోలతో పనిచేసిన లెజెండ్రీ దర్శకుడు. అయినప్పటికీ ఆది పినిశెట్టికి నటనా ప్రతిభ వారసత్వంగా రాలేదని.. తనకి తానుగా సంపాదించుకున్నారు అని దేవకట్టా ప్రశంసించారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 15 2025, 11:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Aadhi Pinisetty
Image Credit : Instagram/Aadhi Pinisetty

Aadhi Pinisetty

ఆది పినిశెట్టి తన నటనా ప్రయాణాన్ని 2006లో వచ్చిన ఒక వి చిత్రమ్ సినిమాతో మొదలుపెట్టాడు. 2009లో తమిళంలో వచ్చిన ఈరమ్తో గుర్తింపు తెచ్చుకున్నారు. సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం, మృగం, మరగత నాణయం వంటి చిత్రాల్లో అద్భుతమైన నటనతో హీరో, విలన్ లేదా సపోర్టింగ్ పాత్ర ఏదైనా ఒకే స్థాయి నైపుణ్యంతో చేయగల వెర్సటైల్ నటుడిగా తన ముద్ర వేశాడు. “నిన్ను కోరి” లో ఆదిని నేను మొట్ట మొదట గమనించాను. ఆయన డిక్షన్, పాత్రకు తాను తెచ్చిన హుందా తనం నన్ను ఆకట్టుకున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
KKN పాత్రలో ఆది పినిశెట్టి
Image Credit : Sony Liv

KKN పాత్రలో ఆది పినిశెట్టి

మయసభ OTT ఫార్మాట్‌కి మారిన వెంటనే, లీడ్ పాత్రలలో నా మనసుకి తట్టిన మొదటి పేరు ‘ఆది పినిశెట్టి’ ఏ సందేహం లేకుండా. స్క్రిప్ట్ పంపి, ఎనిమిది గంటల జూమ్ కాల్‌లో మొత్తం కథ నరేట్ చేశాను. రెండు లీడ్ పాత్రల్లో ఏదైనా చేయడానికి ఆయనను సిద్ధంగా ఉంచాను. చైతన్య రావును ఫైనల్ చేసిన తర్వాత, తాను MSR పాత్రకు సహజంగా ఉంటాడని భావించి, ఆదిని KKN పాత్ర చేయమని రిక్వెస్ట్ చేశాను.

Related Articles

Related image1
మొన్న హరిహర వీరమల్లు, నిన్న వార్ 2..దెబ్బ పడింది అందుకే, విశ్వంభర మూవీకి వార్నింగ్ బెల్
Related image2
థియేటర్ లోనే చేతులెత్తి మొక్కిన చాగంటి.. మహావతార్ నరసింహ మూవీ చూసి ఏమన్నారో తెలుసా
35
ఛాలెంజింగ్ రోల్
Image Credit : Youtube/Sony Liv

ఛాలెంజింగ్ రోల్

అక్కడ నుంచి ఆదితో పని చేయడం ఒక ఆనందయాత్ర. KKN కారెక్టర్ ఎన్నో పరిమితులు, లేయర్స్ తో నిండిన ఛాలెంజింగ్ రోల్. నత్తి, ఆర్థిక పరిమితులతో పోరాడుతూ, అపరిమితమైన అపరిమైన లక్ష్యాలతో కూడిన పాత్ర. ప్రతి సమస్యని ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఎదుర్కునే నాయకత్వ లక్షణం ఉన్న పాత్ర. ఆది KKN పాత్రను ఒక మరాథాన్‌లా తీసుకున్నాడు—ఆ కాలపు రాజకీయ వాతావరణాన్ని గ్రహించి, తన బాడీ లాంగ్వేజ్‌ను దిద్దుకుంటూ, డైలాగ్‌లతోనే కాదు, మాటల మధ్య నిశ్శబ్దంతో కూడా ఎంతో లైఫ్ తీసుకొచ్చాడు.

45
నత్తిని అతి జాగ్రత్తగా ప్రదర్శిస్తూ..
Image Credit : Youtube/Sony Liv

నత్తిని అతి జాగ్రత్తగా ప్రదర్శిస్తూ..

స్కూల్ పిల్లాడిలా స్క్రిప్ట్ రీడింగ్స్‌లో పాల్గొనడం, నత్తిని అతి జాగ్రత్తగా ప్రదర్శిస్తూ, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ అపారమైన డెడికేషన్ తో ఒక రియల్ లైఫ్ లెజెండ్‌తో పోల్చుకునే KKN పాత్రను అప్రోచ్ చేశారు. ఆదిలో ఎప్పుడూ కనిపించే ఆ చిరునవ్వు, అమాయకపు కళ్లు, చైతన్య రావుతో తనకు నిజ జీవితంలో ఉన్న స్నేహం ఈ షోకు గొప్ప ఆస్తిగా మారింది. అతను ఇంప్రూవైజ్ చేసిన చిన్న చిన్న హావభావాలు షోలో అనేక అద్భుతమైన మోమెంట్స్‌ను సృష్టించాయి.

55
ఎన్నో ఉదాహరణల నుంచి ఈ రెండూ పంచుకుంటున్నాను
Image Credit : Youtube/Sony Liv

ఎన్నో ఉదాహరణల నుంచి ఈ రెండూ పంచుకుంటున్నాను

మూడో ఎపిసోడ్‌లో బస్సులో MSR చేతిని చాచి పలకరించే ముందు తన రక్తమయమైన చేతిని చూసే దృశ్యం—ఒక శక్తివంతమైన ట్రైలర్ షాట్‌కి మారింది.

నామినేషన్ పేపర్లను తీసుకుంటున్నప్పుడు CBRకు బదులివ్వడంలో, అతని స్టైల్లోనే సమాధానం ముగించే విధంగా డైలాగ్ ఎక్స్టెండ్ చెయ్యడం—ఆ హీరోయిక్ మోమెంట్‌ని ఇంకో ఎత్తుకు తీసుకెళ్ళింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic 8 Days Collections: నెగటివ్‌ టాక్ తోనూ యష్‌ మూవీకి ఊహించని కలెక్షన్లు.. టాక్సిక్‌ కి ఇంకా ఎంత రావాలంటే?
Recommended image2
Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు
Recommended image3
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
మొన్న హరిహర వీరమల్లు, నిన్న వార్ 2..దెబ్బ పడింది అందుకే, విశ్వంభర మూవీకి వార్నింగ్ బెల్
Recommended image2
థియేటర్ లోనే చేతులెత్తి మొక్కిన చాగంటి.. మహావతార్ నరసింహ మూవీ చూసి ఏమన్నారో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved