- Home
- Entertainment
- మొన్న హరిహర వీరమల్లు, నిన్న వార్ 2..దెబ్బ పడింది అందుకే, విశ్వంభర మూవీకి వార్నింగ్ బెల్
మొన్న హరిహర వీరమల్లు, నిన్న వార్ 2..దెబ్బ పడింది అందుకే, విశ్వంభర మూవీకి వార్నింగ్ బెల్
ఇటీవల విడుదలైన చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ అనేవి పెద్ద తలనొప్పి వ్యవహారంలా మారిపోయాయి. విజువల్ ఎఫెక్ట్స్ సరిగ్గా లేకుంటే సినిమా రిజల్ట్ తారుమారు అయిపోతోంది.

గ్రాఫిక్స్ తో మాయాజాలం
ఒకప్పుడు విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ అంటే హాలీవుడ్ చిత్రాలు మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా ఇండియన్ సినిమా దర్శకులు ముఖ్యంగా తెలుగు దర్శకులు అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో సినిమాలు చేస్తున్నారు. రాజమౌళి, నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ లాంటి దర్శకులు గ్రాఫిక్స్ తో మాయాజాలం సృష్టిస్తున్నారు. అయితే కొందరు దర్శకులు మాత్రం అనుకున్న స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ రాబట్టడంలో ఫెయిల్ అవుతున్నారు.
KNOW
హరిహర వీరమల్లు మూవీకి దెబ్బ పడింది అందుకే
గతంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రంలో గ్రాఫిక్స్ పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఆ మూవీ పరాజయం చెందడానికి చెత్త గ్రాఫిక్స్ కూడా ఒక కారణం. ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం కూడా గ్రాఫిక్స్ విషయంలో ట్రోలింగ్ ఎదుర్కొంది. ఈ మూవీ కథ బావున్నప్పటికీ గ్రాఫిక్స్ క్వాలిటీ పరమ చెత్తగా ఉందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
వార్ 2 పై ట్రోలింగ్
గురువారం రోజు విడుదలైన ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల వార్ 2 చిత్రానిది కూడా అదే పరిస్థితి. ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్, ఎన్టీఆర్ ని చూపించిన విధానం ప్రేక్షకులని ఆకట్టుకోవడం లేదు. ఈ మూవీలో ఎన్టీఆర్ లుక్స్, గ్రాఫిక్స్ పై ట్రోలింగ్ జరుగుతోంది. విజువల్ ఎఫెక్ట్స్ సరిగ్గా లేకుంటే సినిమాపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో ఈ చిత్రాలే ఉదాహరణ.
అందరి దృష్టి చిరంజీవి విశ్వంభరపైనే..
ఇప్పుడు ఫోకస్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రంపై మళ్లింది. ఈ చిత్రంలో 70 శాతం విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు గతంలోనే తెలిపారు. ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయినప్పుడు ట్రోలింగ్ జరిగింది.గ్రాఫిక్స్ కారణంగా టీజర్ కి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ వల్లే ఈ చిత్రం ఆలస్యం అవుతోందని టాక్ కూడా వినిస్తోంది.
విశ్వంభర చిత్రానికి వార్నింగ్ బెల్
ఈ తరుణంలో విశ్వంభర మూవీ గ్రాఫిక్స్ అవుట్ పుట్, క్వాలిటీ విషయంలో మెగా అభిమానులు టెన్షన్ పడుతున్నారు. హరిహర వీరమల్లు, వార్ 2 చిత్రాలు ఎదుర్కొంటున్న విమర్శలు విశ్వంభర చిత్రానికి వార్నింగ్ బెల్ లాంటివి అని అంటున్నారు. మరి దర్శకుడు వశిష్ఠ గ్రాఫిక్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ? ఏ మేరకు క్వాలిటీ విజువల్స్ రాబట్టి విజయం సాధిస్తారు అనేది వేచి చూడాలి.