MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • థియేటర్ లోనే చేతులెత్తి మొక్కిన చాగంటి.. మహావతార్ నరసింహ మూవీ చూసి ఏమన్నారో తెలుసా

థియేటర్ లోనే చేతులెత్తి మొక్కిన చాగంటి.. మహావతార్ నరసింహ మూవీ చూసి ఏమన్నారో తెలుసా

ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు మహావతార్ నరసింహ చిత్రాన్ని వీక్షించారు. ఈ మూవీ చూస్తున్నప్పుడు ఆయన భక్తి భావంతో చేతులెత్తి మొక్కారు. 

2 Min read
Tirumala Dornala
Published : Aug 15 2025, 06:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దూసుకుపోతున్న మహావతార్ నరసింహ 
Image Credit : X/Geetha Arts

దూసుకుపోతున్న మహావతార్ నరసింహ 

 ఇటీవల విడుదలైన మహావతార్ నరసింహ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తోంది. సైలెంట్ గా థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం నరసింహ గర్జనతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. యానిమేటెడ్ చిత్రం అయినప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కన్నడ భాషలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ తెలుగు లో డబ్ చేసి రిలీజ్ చేశారు. 40 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియా మొత్తం 200 కోట్లకి పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. 

25
అల్లు అరవింద్ తో కలిసి మూవీ చూసిన చాగంటి
Image Credit : X/Geetha Arts

అల్లు అరవింద్ తో కలిసి మూవీ చూసిన చాగంటి

అశ్విన్ కుమార్ దర్శకత్వంలో మహావతార్ నరసింహ చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని తాజాగా ప్రముఖ పంచాంగ కర్త చాగంటి కోటేశ్వరరావు వీక్షించారు. అల్లు అరవింద్ తో కలిసి చాగంటి ఈ చిత్రాన్ని చూడడం జరిగింది. థియేటర్ లో మూవీ చూస్తూ చాగంటి చేతులెత్తి మొక్కారు. మూవీ చూసిన అనంతరం సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు. 

Chaganti Koteswara Rao garu and K.I. Vara Prasad Reddy garu share their thoughts on #MahavatarNarsimha, applauding the team for delivering a truly divine experience. 
They also encourage audiences of all ages to witness it. ❤️‍🔥

Witness the divine saga at theatres near you. 🔥… pic.twitter.com/r9zkBuMgHA

— Mahavatar Narsimha (@MahavatarTales) August 15, 2025

Related Articles

Related image1
ఒకే ఏడాది 7 సార్లు పోటీ పడ్డ కృష్ణ, చిరంజీవి..అడ్రస్ లేకుండా పోయిన సినిమాలు, పైచేయి ఎవరిదో తెలుసా
Related image2
నందమూరి వంశంలో ఆ హీరోని తొక్కేసింది ఎవరు ? చిరంజీవితో కూడా నటించాడు.. అప్పట్లో జరిగింది ఇదే
35
నరసింహ అవతారం చాలా ప్రత్యేకం
Image Credit : X/Geetha Arts

నరసింహ అవతారం చాలా ప్రత్యేకం

చాగంటి మాట్లాడుతూ మహావతార్ నరసింహ చిత్రాన్ని వీక్షించాను. మహావిష్ణవు అవతారాలలో నరసింహ అవతారానికి చాలా ప్రత్యేకత ఉంది. నరసింహ అవతారంలో ఉగ్రరూపం మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఆ అవతారంలో విచక్షణ, ఆలోచన, దయ కూడా ఉన్నాయి అని చాగంటి అన్నారు. ఇది యానిమేషన్ చిత్రం అయినప్పటికీ ప్రహ్లాదుడిని, హిరణ్యకశ్యపుడిని, నరసింహ అవతారాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్లే అనిపించింది. 

45
పురాణాలకు దూరంగా లేదు
Image Credit : X/Geetha Arts

పురాణాలకు దూరంగా లేదు

నిజంగా నరసింహ దర్శనం కలిగినంత ఆనందం కలిగింది. ఈ చిత్రంలో ఎక్కడా కూడా పురాణాలకు అతిగా దూరం జరగకుండా కథని రూపొందించారు. ఇది కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ చిత్రం అని చాగంటి ప్రశంసించారు. 

55
చాగంటి ప్రశంసలు
Image Credit : X/Hombale films

చాగంటి ప్రశంసలు

ఇప్పటికే ఈ చిత్రం సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇలాంటి టైంలో చాగంటి లాంటి ప్రవచన కర్త ఈ మూవీ బావుందని చెప్పడం, ప్రశంసలు కురిపించడం మహావతార్ నరసింహ చిత్ర యూనిట్ కి జోష్ నింపే అంశం అని చెప్పొచ్చు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved