- Home
- Entertainment
- Dhurandhar Review: ధురంధర్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. రణ్‌వీర్ సింగ్ సినిమాలో హైలైట్స్ ఇవే
Dhurandhar Review: ధురంధర్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. రణ్‌వీర్ సింగ్ సినిమాలో హైలైట్స్ ఇవే
Dhurandhar Review: `ధురంధర్` సినిమా థియేటర్లలో అద్భుతమైన ఆరంభాన్ని పొందింది. రణ్ వీర్ సింగ్ దేశభక్తి, యాక్షన్‌తో నిండిన పాత్ర ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రియాక్షన్ వస్తోంది.

ధురంధర్ మూవీకి ట్విట్టర్ రివ్యూ
రణ్ వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ నటించిన లేటేస్ట్ మూవీ `ధురంధర్`. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి ఎలాంటి స్పందన ఉందో తెలుసుకుందాం.
మేజర్ మోహిత్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ విశ్వరూపం
మేజర్ మోహిత్ పాత్రలో రణ్ వీర్ సింగ్ తన కెరీర్‌లోనే అత్యంత ఇంటెన్సిటితో కూడిన నటనను ప్రదర్శించారు. ప్రతి సన్నివేశంలో ధైర్యం, భావోద్వేగం, శక్తిని నింపారు. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. యాక్షన్, దేశభక్తి, కథనం అన్నీ అద్భుతంగా ఉన్నాయని కొనియాడుతున్నారు.
ధురంధర్ కథ ఇదే
సినిమాలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నాల నటనకు ప్రత్యేక ప్రశంసలు లభించాయి. వారి పాత్రలు కథకు మరింత బలాన్ని చేకూర్చాయని విమర్శకులు అంటున్నారు. ఈ సినిమా కథ ఒక పెద్ద ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నాశనం చేయడానికి ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో చేపట్టిన ఒక రహస్య మిషన్ చుట్టూ తిరుగుతుంది.
హైలైట్స్ ఇవే
'ధురంధర్' సినిమా మాస్, క్లాస్ ప్రేక్షకులను ఒకేలా ఆకట్టుకుంటుంది. యాక్షన్, ఎమోషన్స్, గ్రిప్పింగ్ స్టోరీతో ఇది ఒక పవర్ఫుల్ థియేటర్ అనుభవాన్ని ఇస్తుంది. మ్యూజిక్, ముఖ్యంగా శాశ్వత్ సచ్‌దేవ్ బిజీఎం అదిరిపోయింది. అదే సినిమాకి హైలైట్‌గా నిలిచింది. యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. రణ్ వీర్ సింగ్ మరో హిట్ కొట్టినట్టే అంటున్నారు.

