- Home
- Entertainment
- Chiranjeevi : దాసరి స్థానం మెగాస్టార్ దే, ఇండస్ట్రీ పెద్ద ఎవరో తేల్చేసిన మా మాజీ అధ్యక్షుడు
Chiranjeevi : దాసరి స్థానం మెగాస్టార్ దే, ఇండస్ట్రీ పెద్ద ఎవరో తేల్చేసిన మా మాజీ అధ్యక్షుడు
Chiranjeevi : ఒకప్పుడు టాలీవుడ్ కు పెద్దగా దాసరి నారాయణ రావు ఉండేవారు. ఏ సమస్య వచ్చినా ముందుండి టాలీవుడ్ ను కాపాడేవారు. మరి ఆయన మరణం తరువాతఆ స్థానం ఎవరిది? టాలీవుడ్ ను ముందుండి నడిపించే పెద్ద దిక్కు ఎవరు?

ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా దాసరి
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఒకప్పుడు దాసరి నారాయణ రావు ఉండేవారు. ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా.. ఆయన దగ్గరికే అందరు పరిగెత్తేవారు. ఎంత పెద్ద సమస్య అయినా.. చిటికెలో పరిష్కరించడం దాసరికే సాధ్యం అయ్యింది. ఆయన మాటకు ఇండస్ట్రీలో అందరు అంత విలువ ఇచ్చేవారు. అంతే కాదు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న 24 శాఖలపై దాసరికి పట్టు ఉండేది. ఆయన ద్వారా ఇండస్ట్రీలోకి వందల్లో నటులు, టెక్నీషియన్స్ ఎంట్రీ ఇచ్చారు. అందుకే అందరు దాసరిని గురువుగారు అని పిలిచేవారు. ప్రతీరోజు ఆయన ఇంట్లో వందమందికి పైగా భోజనం చేసేవారు.. న్యూ ఇయర్ రోజు దాసరి చేతుల మీదుగా వంద నోటు తీసుకోవడం సెంటిమెంట్ గా ఫీల్ అయ్యేవారు. ఇలా దాసరి నారాయణరావు టాలీవుడ్ కు అన్నిరకాలుగా పెద్దదిక్కులా ఉండేవారు.
దాసరి తరువాత రంగంలోకి చిరంజీవి
దాసరి మరణం తర్వాత ఇండస్ట్రీ సమస్యలను తీర్చడానికి పెద్ద దిక్కులేకుండా పోయింది. సమస్యల పరిష్కారం చేసేది ఎవరు అని అంతా ఆలోచనలో పడ్డారు. ఆయన ప్లేస్ ఎవరూ తీసుకోలేదు కూడా. అయితే కరోనా టైమ్ లో మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చి, టాలీవుడ్ కు అండగా నిలబడ్డారు. ప్రత్యేకంగా ఫండ్ ను ఏర్పాటు చేసి.. చిన్న చిన్న ఆర్టిస్ట్ లను ఆర్ధికంగా ఆదుకున్నారు. దాంతో పాటు ఇండస్ట్రీ సమస్యలపై ప్రభుత్వాలతో చర్చించారు కూడా. కానీ ఆ సమయంలోనే చిరంజీవిపై కొంత మంది విమర్శలు చేయడంతో.. ఆయన చాలా బాధపడ్డారు. అందరు మెగాస్టార్ ను ఇండస్ట్రీ పెద్దగా ఉండాలని అడగినా.. ఈ విమర్శల కారణంగా తాను ఇండస్ట్రీకి పెద్దగా కాదు.. బిడ్డాగా ఉంటానని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇండస్ట్రీకి ఏదైనా సపోర్ట్ కావాలంటే తాను ఎప్పుడు ముందు ఉంటాన్నారు. అన్నట్టుగానే టాలీవుడ్ కష్టాలలో పడ్డ ప్రతీసారి.. చిరంజీవి ముందుండి నడిపిస్తున్నారు. సీఎంలతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి సహాయం చేస్తున్నారు.
మా మాజీ ప్రెసిడెంట్ కామెంట్స్
ఇండస్ట్రీలో ఎవరు వ్యతిరేకించినా.. టాలీవుడ్ పెద్దన్నచిరంజీవే అని ఆయన అభిమానులు.. ఇండస్ట్రీలో చాలామంది అభిప్రాయ పడుతున్నారు. తాజాగా ఈ విషయంపై సీనియర్ నటుడు మా మాజీ ప్రెసిడెంట్ శివాజీ రాజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి శివాజీ రాజా మాట్లాడుతూ.. ''దాసరి గారి తర్వాత అంత మంచితనం, ఓపిక, అందరికి సర్ది చెప్పే గుణం, చిరంజీవికి ఉంది. నేను ఎక్కడ నుంచి వచ్చాను అనే విషయం తెలిసిన వ్యక్తి, పది మందికి సాయం చేద్దాం అనుకునే వ్యక్తి చిరంజీవి. ఆయనకు ఇంకొకరు ప్రత్యామ్నాయం లేరు. కానీ చిరంజీవి పేరు కూడా రికమండ్ చేయడానికి లేకుండా కొంత మంది చేస్తున్నారు. ఎవరైనా ఇండస్ట్రీలో కష్టపడి పనిచేస్తే వాళ్ళ మీదకు రాళ్లు వేస్తారు, బురద వేస్తారు. వీళ్ళు ఎలాగు పనిచేయరు, చేసేవాళ్లను కూడా చేయనివ్వరు. ఇవన్నీ చూసి తట్టుకెలేకే చిరంజీవి కూడా పక్కకు తప్పుకున్నారు.'' అని శివాజీ రాజా అన్నారు. ఎవరు ఏమన్నా.. దాసరి తరువాత ఫిల్మ్ ఇండస్ట్రీకి చిరంజీవే.. ఇంకొకరు లేరు.. అని శివాజీ క్లారిటీ ఇచ్చారు.
చాలా సమస్యలు పరిష్కరించిన మెగాస్టార్
ప్రస్తుతం తెలుగు పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా.. చిరంజీవి దగ్గరకే పరిగెడుతున్నారు. ఈమధ్య కాలంలో ఆయన కొన్ని వివాదాలను కూడా పరిష్కరించారు. టికెట్ రేట్లు, బెనిఫిట్ షోస్ లాంటి సమస్యలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, సీఎంల దగ్గరకు చిరంజీవి నేరుగా తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఐబొమ్మ వివాదంపై కూడా చిరంజీవి నాయకత్వంలోనే పోలీసులతో చర్చలు జరిగాయి. అంతే కాదు రీసెంట్ గా సినిమా కార్మికుల వేతనాలకు సబంధించిన సమస్యను కూడా చిరంజీవి పరిష్కరించారు. వారితో నేరుగా చర్చించి అండగా నిలబడ్డారు. ఇలా ఏ ప్రాబ్లమ్ ఉన్నా తాను ఉన్నాను అన్న భరోసా ఇచ్చారు చిరు. ఇవే కాదు నిర్మాతుల, దర్శకుల, ఆర్టిస్టు లమధ్య వివాదాలు, చిన్న చిన్న సమస్యలు కూడా చిరంజీవి దగ్గరకే వెళ్తున్నాయి. అఫీషియల్ గా మెగాస్టార్ టాలీవుడ్ పెద్దగా లేకపోయినా.. సమస్యల పరిష్కారంలో మాత్రం ముందుంటున్నారు. అందుకే చాలామంది టాలీవుడ్ జనాలు దాసరి తరువాత స్థానం చిరంజీవిదే అని చెప్పేస్తున్నారు.

