- Home
- Entertainment
- Balakrishna: బాలకృష్ణకి నచ్చిన జూ. ఎన్టీఆర్ 2 సినిమాలు ఏంటో తెలుసా ? అభిమానులకు పూనకాలు తెప్పించిన మాట అదే
Balakrishna: బాలకృష్ణకి నచ్చిన జూ. ఎన్టీఆర్ 2 సినిమాలు ఏంటో తెలుసా ? అభిమానులకు పూనకాలు తెప్పించిన మాట అదే
నందమూరి బాలకృష్ణ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల గురించి మాట్లాడింది చాలా తక్కువ. రెండు సినిమాల విషయంలో బాలయ్య తారక్ ని ప్రశంసించారు. ఆ రెండు చిత్రాలు ఏవో ఈ కథనంలో తెలుసుకోండి.

బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ మధ్య గ్యాప్
నందమూరి బాలకృష్ణ ఎలాంటి సందర్భంలో అయినా తన మనసులో అభిప్రాయాలని నిర్భయంగా చెబుతుంటారు. బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో బాలయ్య గురించి, నందమూరి ఫ్యామిలీ గురించి అనేక విషయాలు వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణకి.. జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం చాలా కాలంగా సాగుతూనే ఉంది.
2 సినిమాలపై బాలయ్య ప్రశంసలు
జూనియర్ ఎన్టీఆర్ సినిమా కార్యక్రమాలకు బాలయ్య హాజరైంది చాలా తక్కువ. అతి కొద్ది సందర్భాల్లో మాత్రమే బాలయ్య తారక్ గురించి మాట్లాడారు. బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్ నటించే సినిమాలపై ఎలాంటి అభిప్రాయం ఉంటుంది అని తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతుంటారు. బాలయ్య మాత్రం తారక్ నటించిన రెండు సినిమాలని మాత్రమే అభినందించారు. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
తారక్ కి ఫోన్ చేసిన బాలయ్య
బాలయ్య మొదటగా తారక్ ని అంభినందించింది ఆది సినిమా విషయంలో. ఆది రిలీజై సూపర్ హిట్ అయ్యాక.. బాలయ్య ప్రసాద్ ల్యాబ్స్ లో ఆ సినిమాని ప్రత్యేకంగా వీక్షించారు. ఈ విషయాన్ని నిర్మాత బెల్లంకొండ సురేష్ తెలిపారు. సినిమా చూసిన వెంటనే బాలయ్య.. జూనియర్ ఎన్టీఆర్ కి ఫోన్ కలపండి అని అన్నారు. బాలయ్య ఎన్టీఆర్ తో మాట్లాడుతూ 'బాగా చేశావురా, బ్రహ్మాండంగా ఉంది.. టాప్ పెర్ఫార్మెన్స్' అని అభినందించినట్లు బెల్లంకొండ సురేష్ పేర్కొన్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ అల్లరి రాముడు షూటింగ్ లో ఉన్నారు.
మా ఇద్దరికి మాత్రమే సాధ్యం
ఆ తర్వాత బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ ని బహిరంగంగా అరవింద సమేత చిత్రం విషయంలో అభినందించారు. ఈ చిత్ర విజయోత్సవ వేడుకకు బాలయ్య చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ.. నేను, జూనియర్ ఎన్టీఆర్ చేసే సినిమాలు ఇంకెవరికీ సాధ్యం కాదు అని అన్నారు. అది చాలా గొప్ప ప్రశంస అని చెప్పొచ్చు. ఆ మాటతో నందమూరి ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోయారు.
నందమూరి ఫ్యామిలీ మల్టీస్టారర్
జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ కాంబినేషన్ లో నందమూరి ఫ్యాన్స్ ఓ చిత్రం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. దీనితో నందమూరి కళ్యాణ్ రామ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను, తారక్, బాబాయ్ కలిసి నటించాలి అంటే అంత గొప్ప కథ అవసరం అవుతుంది. కథ సమస్య అని కళ్యాణ్ రామ్ అన్నారు. ఫ్యాన్స్ కి నచ్చేలా అద్భుతమైన కథ దొరకడం అంత సులభం కాదని కళ్యాణ్ రామ్ తెలిపారు.

