అఖండ 2 మూవీ ఫస్ట్ రివ్యూ, క్లైమాక్స్ లో పూనకాలే, బాలయ్య విశ్వరూపం.. మైనస్ ఏంటంటే?
Akhanda 2 Movie First Review: `అఖండ 2` సినిమా మరో మూడు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చింది. మరి ఇందులో హైలైట్స్, మైనస్‌లు ఏంటంటే?

డిసెంబర్ 5న బాలయ్య `అఖండ 2` విడుదల
నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం `అఖండ 2` చిత్రం రూపొందింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మరో మూడు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో ఆది పినిశెట్టి విలన్‌గా నటించారు. సంయుక్త హీరోయిన్‌గా చేసింది. పూర్ణ, హర్షాలి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఈ నెల 5న విడుదల కాబోతుంది. బాలయ్య నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ విడుదల చేస్తున్నారు. శివతత్వానికి సంబంధించిన కథాంశంతో రూపొందిన మూవీ కావడంతో దీన్ని చాలా భారీగా రిలీజ్ చేస్తున్నారు. నార్త్ ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.
`అఖండ 2` సెన్సార్ రిపోర్ట్
`అఖండ 2` సినిమా విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో ఇది సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ నుంచి యు ఏ సర్టిఫికేట్‌ని పొందింది. ఇది రెండు గంటల 44 నిమిషాలు నిడివి ఉండబోతుందట. ఇటీవల భారీ సినిమాల నిడివి మూడు గంటలు దాటుతున్న నేపథ్యంలో ఈ సినిమా నిడివి చాలా డీసెంట్‌గానే ఉందని చెప్పొచ్చు. సెన్సార్ టాక్ కూడా పాజిటివ్‌గా వినిపిస్తోంది. బొమ్మ బ్లాక్ బస్టర్ రియాక్షన్ కనిపించిందని టీమ్ చెబుతుంది. ఇక ఈ చిత్రానికి టికెట్ రేట్లు పెంచారు. ఆంధ్ర ప్రదేశ్‌లో సింగిల్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్ ల్లో వంద రూపాయలు పెంచారు.
`అఖండ 2` ఫస్ట్ రివ్యూ
ఈ క్రమంలో `అఖండ 2` కి సంబంధించిన ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది. సినిమా ఎలా ఉంటుందో తెలిసిపోయింది. బాలయ్య ఎంట్రీ సీన్ అదిరిపోతుందట. అందులోనూ అఘోర ఎంట్రీ వాహ్ అనేలా ఉంటుందంటున్నారు. ఇంటర్వెల్ ఫైరింగ్ అని, సెకండాఫ్ అదిరిపోయిందని, ప్రీ క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుందని, క్లైమాక్స్ పిచ్చెక్కించేలా ఉంటుందట. అయితే హనుమాన్ ఎంట్రీ సీన్లు మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. సినిమాకి మెయిన్ హైలైట్ కూడా ఇదే అని, ఆ సమయంలో థియేటర్లు ఊగిపోవాల్సిందే అంటున్నారు.
`అఖండ 2`లో హైలైట్స్
సినిమాలో యాక్షన్ సీన్లు మెయిన్‌గా ఉంటాయట. అయితే బాలయ్య మార్క్ డైలాగులు ఆకట్టుకుంటాయని, అభిమానులు ఊగిపోయేలా ఉంటాయని అంటున్నారు. మదర్ సెంటిమెంట్, కూతురు సెంటిమెంట్ కూడా మరో స్పెషల్ ఎట్రాక్షన్‌గా చెబుతున్నారు. యాక్షన్‌తోపాటు ఫ్యామిలీ ఎలిమెంట్లు కూడా సమపాళ్లలో ఉంటాయని, ఒకదాని తర్వాత మరోటి రోలర్ కోస్టర్‌లా వస్తుంటాయని, ఆడియెన్స్ చూపు తిప్పుకోకుండా ఎంగేజ్ చేసేలా బోయపాటి ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు.
`అఖండ 2`లో మైనస్ ఏంటంటే
అయితే ఇందులో ఒకటి మాత్రం నెగటివ్‌గా మారబోతుందని అంటున్నారు, అదే హిందూ ధర్మం, సనాతన ధర్మం అంటూ క్లాస్ పీకడాలు, లెక్చర్లు ఇవ్వడమనేది కాస్త ఓవర్ డోస్‌లో ఉంటుందని, థియేటర్లలో ఆయా సీన్లు ఆడియెన్స్ ని అసంతృప్తికి గుర్తిచేస్తాయని, ఓవర్ అనే ఫీలింగ్ తెప్పిస్తాయని అంటున్నారు. కొన్ని లాజిక్ లెస్ సీన్లు ఉంటాయని, రొటీన్ సీన్లు ఉండబోతున్నాయని అంటున్నారు. కానీ బాలయ్య మాత్రం ఈ చిత్రంలో తన విశ్వరూపం, ఉగ్రరూపం చూపిస్తారని, ఆయన కెరీర్ బెస్ట్ పర్‌ఫెర్మెన్స్ ఇవ్వబోతున్నారని చెబుతున్నారు. మూడు డిఫరెంట్ గెటప్స్ లో ఆయన కనిపించే తీరు ఆకట్టుకుంటుందని, దీంతోపాటు సినిమాలో ఒకటి రెండు ఊహించని సర్‌ప్రైజ్‌లు కూడా ఉండబోతున్నాయని టాక్. మొత్తంగా సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

