MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • అఖండ 2 ఆర్టిస్ట్ ల పారితోషికాలు.. బడ్జెట్‌, బిజినెస్‌ లెక్కలు.. నిర్మాతలు సేఫ్‌, కానీ బాలయ్యపై పెద్ద రిస్క్

అఖండ 2 ఆర్టిస్ట్ ల పారితోషికాలు.. బడ్జెట్‌, బిజినెస్‌ లెక్కలు.. నిర్మాతలు సేఫ్‌, కానీ బాలయ్యపై పెద్ద రిస్క్

బాలకృష్ణ నటించిన `అఖండ 2` సినిమా థియేటర్లో సందడి చేయడానికి ఇంకా రెండు రోజులే ఉంది. ఈ క్రమంలో ఇందులో నటించిన ఆర్టిస్ట్ ల పారితోషికాలు, సినిమా బడ్జెట్‌, ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ లెక్కలు తెలుసుకుందాం. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Dec 03 2025, 02:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
`అఖండ 2`పై భారీ అంచనాలు
Image Credit : Asianet News

`అఖండ 2`పై భారీ అంచనాలు

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో నాల్గో మూవీగా `అఖండ 2` రూపొందింది. గతంలో `సింహం`, `లెజెండ్‌`, `అఖండ` చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇవి పెద్ద హిట్‌ అయ్యాయి. పదేళ్లలో బాలయ్యకి మూడు హిట్లు ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను అనే చెప్పాలి. అందుకే వీరి కాంబోలో వస్తోన్న నాల్గో సినిమా `అఖండ 2 తాండవం`పై భారీ అంచనాలున్నాయి. ఇందులో ఆది పినిశెట్టి విలన్‌గా నటించారు. సంయుక్త హీరోయిన్‌గా చేసింది. పూర్ణ, హర్షాలి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఈ నెల 5న విడుదల కాబోతుంది. 14 రీల్స్ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. బాలయ్య నటించిన తొలి పాన్‌ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం. శివతత్వానికి సంబంధించిన కథాంశంతో రూపొందిన మూవీ కావడంతో దీన్ని  భారీగా రిలీజ్‌ చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
`అఖండ 2` సెన్సార్‌ రిపోర్ట్.. హైలైట్స్ ఇవే
Image Credit : stockPhoto

`అఖండ 2` సెన్సార్‌ రిపోర్ట్.. హైలైట్స్ ఇవే

`అఖండ 2` ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకుని యు /ఏ సర్టిఫికేట్‌ని పొందింది. ఇది రెండు గంటల 44 నిమిషాలు నిడివి ఉండబోతుందట. ఇటీవల పెద్ద హీరోల సినిమాల నిడివి మూడు గంటలు దాటుతున్న నేపథ్యంలో ఈ సినిమా నిడివి చాలా డీసెంట్‌గానే ఉందని చెప్పొచ్చు. సెన్సార్‌ నుంచి పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. మరోవైపు టీమ్‌ నుంచి కూడా పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. ఇందులో కొన్ని ఎపిసోడ్లు హైలైట్‌గా ఉంటాయని, అవే సినిమాకి బ్యాక్‌ బోన్‌ అంటున్నారు. హీరో ఎంట్రీ సీన్లు, యాక్షన్‌ ఎపిసోడ్లు, ఇంటర్వెల్ బ్యాంగ్‌, ఫ్యామిలీ ఎమోషన్‌ సీన్లు, క్లైమాక్స్, ముఖ్యంగా ఆకాశంలో హనుమంతుడు కనిపించే సీన్ అదిరిపోతుందంటున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్‌ కూడా కనిపిస్తారని సమాచారం. దీంతో ఇవన్నీ సినిమాపై అంచనాలు పెంచాయి.

Related Articles

Related image1
అఖండ 2 మూవీ ఫస్ట్ రివ్యూ, క్లైమాక్స్ లో పూనకాలే, బాలయ్య విశ్వరూపం.. మైనస్‌ ఏంటంటే?
Related image2
నా గుండె కోస్తే వచ్చేది బాలకృష్ణ బాబాయ్‌.. ఆయన తర్వాతే ఎవరైనా.. ఎన్టీఆర్‌ ఊహించని కామెంట్స్
35
`అఖండ 2` ఆర్టిస్ట్ ల పారితోషిక వివరాలు
Image Credit : Asianet News

`అఖండ 2` ఆర్టిస్ట్ ల పారితోషిక వివరాలు

ఈ క్రమంలో `అఖండ2`లో నటించిన ఆర్టిస్ట్ ల పారితోషిక వివరాలు ఆసక్తికరంగా మారాయి. ఈ చిత్రానికి బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం తీసుకున్నారని అంటున్నారు. ఆయనకు ఏకంగా రూ.40కోట్ల పారితోషికం ఇచ్చారట. గత చిత్రాలతో పోల్చితే డబుల్‌ చేసినట్టు సమాచారం. అలాగే దర్శకుడు బోయపాటికి రూ.35కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్టు సమాచారం. వీరితోపాటు హీరోయిన్‌ సంయుక్తకి రెండు కోట్ల వరకు ఇచ్చారని, కీలక పాత్రల్లో నటించిన హర్షాలి, పూర్ణలకు యాభై లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఆదిపినిశెట్టికి కోటి రూపాయలు ఇచ్చారట. థమన్‌ పారితోషికం రూ.15-20కోట్ల మధ్య ఉంటుందని టాక్‌. ఇదిలా ఉంటే ఈ సినిమాకి మరో షాకింగ్‌ పారితోషికం వినిపిస్తోంది.  బాలయ్య రూ.72కోట్లు తీసుకున్నారని, బోయపాటి రూ.45కోట్లు తీసుకున్నట్టు కొన్ని ఆన్‌ లైన్‌ మీడియాసంస్థలు చెబుతున్నాయి. కానీ ఇది వాస్తవానికి దూరంగా ఉంది.

45
`అఖండ 2` బిజినెస్‌ లెక్కలు
Image Credit : Asianet News

`అఖండ 2` బిజినెస్‌ లెక్కలు

ఇక `అఖండ 2` బడ్జెట్‌ వివరాలు చూస్తే, ఈ సినిమాకి రెండు వందల కోట్ల పారితోషికం అయ్యిందట. కాకపోతే బిజినెస్‌ గట్టిగానే జరిగిందంటున్నారు. ఈ చిత్ర ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ సొంతం చేసుకుందట. అందుకు గానూ రూ.85కోట్లు చెల్లించినట్టు సమాచారం. అన్ని భాషలు కలిపి శాటిలైట్‌ రైట్స్ రూ.60కోట్లు అని టాక్. థియేట్రికల్‌ రైట్స్ చూస్తే రూ.115కోట్లు అని సమాచారం. తెలుగు స్టేట్స్ లో రూ.88కోట్లు, ఓవర్సీస్‌ రూ.15కోట్లు, రెస్ట్ ఆఫ్‌ ఇండియా రూ.11కోట్లు అని సమాచారం. ఇందులోనూ నైజాంలో రూ.23.50కోట్లు, సీడెడ్లో రూ.22 కోట్లు, ఉత్తర ఆంధ్రలో రూ.11.50కోట్లు, ఈస్ట్ గోదావరి రూ.7.50కోట్లు, వెస్ట్ గోదావరి రూ.5.50కోట్లు, గుంటూరు రూ.8.50కోట్లు, కృష్ణ రూ.5.75, నెల్లూర్‌ రూ.4 కోట్లకి అమ్ముడు పోయిందని ట్రేడ్‌ వర్గాల సమాచారం.

55
`అఖండ 2` బాక్సాఫీసు టార్గెట్‌
Image Credit : Asianet News

`అఖండ 2` బాక్సాఫీసు టార్గెట్‌

ఈ లెక్కన `అఖండ 2` రిలీజ్‌కి ముందే సేఫ్‌లోకి వచ్చింది. ఎందుకంటే ఈ చిత్రానికి థియేట్రికల్‌, నాన్‌ థియేట్రికల్‌ కలిపి దాదాపు రూ.260కోట్ల వరకు వచ్చింది. సినిమాకి పెట్టిన ఖర్చు సుమారు రూ.200కోట్లు. నిర్మాతలు రిలీజ్‌కి ముందే సేఫ్‌గా ఉన్నారు. కానీ ఇంతటి భారీ రికవరీ బాలయ్య మూవీకి సాధ్యమేనా అనేది పెద్ద డౌట్‌. ఎందుకంటే ఆయన గత చిత్రాల్లో ఏదీ రెండు వందల కోట్ల వసూళ్లని దాటలేదు. ఇప్పుడు `అఖండ 2` బ్రేక్‌ ఈవెన్ కావాలంటే రెండు వందల 50 కోట్లకుపైగా వసూళ్లని రాబట్టాలి. అది పాజిబుల్‌ అవుతుందా? అనే సందేహం కలుగుతుంది. బాలకృష్ణ మీద ఇది పెద్ద రిస్కే అంటున్నారు. కాకపోతే కంటెంట్‌ మీద నమ్మకంతో ఉన్నారు. ఈ మధ్య కాలంలో దేవుడి రిలేటెడ్‌ కంటెంట్‌ తో వచ్చిన సినిమాలు బాగా ఆడుతున్నాయి. అందులో భాగంగానే `అఖండ 2` కూడా దుమ్ములేపుతుందని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pavan Sadineni: ప్రేమ పేరుతో మోసం.. టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని అరెస్టు..
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫైనల్‌ సెలబ్రిటీ కంటెస్టెంట్లు వీరే.. గ్లామర్‌, కామెడీకి కొదవ లేదు
Recommended image3
Toxic: టాక్సిక్ మూవీ ఎఫెక్ట్, గీతూ మోహన్ దాస్ పై ట్రోలింగ్.. దిల్ రాజు మనసులో అనుకున్న మాటలే నిజమయ్యాయా ?
Related Stories
Recommended image1
అఖండ 2 మూవీ ఫస్ట్ రివ్యూ, క్లైమాక్స్ లో పూనకాలే, బాలయ్య విశ్వరూపం.. మైనస్‌ ఏంటంటే?
Recommended image2
నా గుండె కోస్తే వచ్చేది బాలకృష్ణ బాబాయ్‌.. ఆయన తర్వాతే ఎవరైనా.. ఎన్టీఆర్‌ ఊహించని కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved