- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode Dec 5: తల్లిని చంపేందుకు ప్రయత్నించిన వల్లీ, అడ్డంగా బుక్ చేసిన నర్మద
Illu Illalu Pillalu Today Episode Dec 5: తల్లిని చంపేందుకు ప్రయత్నించిన వల్లీ, అడ్డంగా బుక్ చేసిన నర్మద
Illu Illalu Pillalu Today Episode Dec 5: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో శ్రీ వల్లి మళ్ళీ తన చెడు బుద్ధిని చూపిస్తుంది. తల్లి వల్ల తనకు ఇబ్బందులు వచ్చాయని ఆమె మెడ పట్టుకుంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూడండి.

తల్లిదండ్రులు తిట్టిన వల్లీ
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్లో రామరాజు ఇంట్లో పూజ ఘనంగా జరుగుతుంది. పంతులు పూజ పూర్తయ్యాక భార్యలందరూ భర్తల కాళ్లకు మొక్కమని చెబుతారు. అందరూ అలాగే చేసినా ప్రేమ మాత్రం చేయదు. ఇక ధీరజ్ బలవంతంగా ఆమె చేత తన కాళ్ళ మీద పడేలా చేస్తాడు.ఇక ఇక్కడి నుంచి సీన్.. భాగ్యం, ఇడ్లీ బాబాయ్ ఇంటికి మారుతుంది. తల్లిదండ్రుల దగ్గరికి శ్రీవల్లి వచ్చి కూర్చుంటుంది. వారిపై ఎండిన ఆకులన్నీ వేసి భాగ్యాన్ని తిడుతుంది. నర్మద, ప్రేమ చేతిలో తాను ఇరుక్కుపోయానని, దానికి నువ్వే కారణం అని తల్లిని అంటుంది. భాగ్యం మాట్లాడుతూ ప్రేమ నగలు కొట్టేసింది నువ్వేనని తిరుపతి, నర్మద, ప్రేమలకు తప్ప మరి ఎవరికీ తెలియదు కదా ఎందుకు భయం? అని అంటుంది.
భాగ్యాన్ని చంపేస్తానన్న వల్లీ
భాగ్యం మాటలు విన్న వల్లికి చాలా కోపం వస్తుంది. తల్లి పీక పట్టుకొని పిసికేసేందుకు ప్రయత్నిస్తుంది. ‘తల్లిని చంపిన పాపం నాకు రాకూడదని వదిలేస్తున్నాను.. మీరు లేనిపోని అబద్ధాలు ఆడి నన్ను ఆ ఇంటికి కోడల్ని చేశారు. దిక్కుమాలిన సలహాలు ఇచ్చి నా జుట్టు ఆ ప్రేమ, నర్మద చేతుల్లో ఇరుక్కునేలా చేశారు. నాకు పెళ్లయింది అన్నమాటే కానీ నా భర్తతో నేను సంతోషంగా ఉన్నది లేదు. ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ తోనే అక్కడ బతుకుతున్నాను. మీరు నేను చదువుకున్నానని అబద్ధం చెప్పారు. అది ఎక్కడ బయట పడుతుందో అని కూడా భయం గా ఉంది. నా ముఖానికి తెలుగు రాదు పైగా ఇంగ్లీష్ మీడియం అని చెప్పారు. ఆ నగల్ని బయటికి తీయమని చెప్పి నా చేత పాతి పెట్టిన నగలను బయటికి తీయించావ్. నా చేతులతోనే నర్మద, ప్రేమలకు నేను దొరికిపోయేలా చేసావు’ అని భాగ్యాన్ని తిడుతూనే ఉంటుంది శ్రీ వల్లి.
ఇడ్లీ బాబాయ్ కూతుర్ని కాస్త నెమ్మదించేలా చేస్తాడు. నువ్వు బాగా బతుకుతావని నిన్ను ఆ ఇంటికి కోడల్ని చేసాం, ఆ టెన్షన్లన్నీ మేము పడతాము, నువ్వు సంతోషంగా ఉండు అని చెబుతాడు. కానీ భాగ్యం మాత్రం ఇంకా శ్రీవల్లిని రెచ్చగొడుతూనే ఉంటుంది. కొడుకులకి, తండ్రికి మధ్య మంట ఆల్రెడీ పెట్టాము కదా .. అది కార్చిచ్చుగా మారుతుంది అని భాగ్యం అంటుంది. దీంతో శ్రీవల్లి ఇంకా సంతోషంగా ఉంటుంది.
ప్రేమకు హాల్ టికెట్
ఇక ఇక్కడి నుంచి సీన్... ప్రేమ దగ్గరికి మారుతుంది. ప్రేమ దగ్గరికి ధీరజ్ వచి పోలీస్ ఎగ్జామ్ కోసం రాయాల్సిన హాల్ టికెట్ ను తెచ్చి ఇస్తాడు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామ్ కు ప్రేమ పేరుతో ధీరజ్ అప్లై చేస్తాడు. ఆ విషయం ఇప్పుడే ప్రేమకు తెలుస్తుంది. దాంతో ప్రేమ చాలా సంతోషిస్తుంది. పరీక్ష వచ్చే నెల హైదరాబాదులో ఉంది, కష్టపడి చదవమని చెబుతాడు ధీరజ్. నేను జాబ్ చేయడానికి వీలు లేదని మామయ్య గారు తేల్చి చెప్పారు.. అలాంటిది ఎగ్జామ్ రాయడానికి హైదరాబాద్ పంపిస్తారా అని డౌట్ పడుతుంది ప్రేమ. కానీ ధీరజ్ మాత్రం నీ చేత ఎగ్జామ్ రాయిస్తాను అది నా బాధ్యత అని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో ప్రేమ ఎంతో ఆనందపడుతుంది.
ఉద్యోగం కోసం సాగర్ వేదన
తర్వాత సాగర్ ఒక జాబ్ కన్సల్టెన్సీకి వెళ్లి అధికారిని కలుస్తాడు. అతడు ‘నువ్వు విఆర్వో పోస్ట్ కోసం రాస్తే వచ్చిన మార్కులు కనీసం క్వాలిఫై కూడా అయ్యేంత దగ్గరలో లేవు. అంటే నువ్వు కష్టపడి చదవలేదని అర్థము. ఇలా అయితే ఉద్యోగం సంపాదించడం చాలా కష్టమని. ఇప్పుడున్న కాంపిటేషన్ నువ్వు తట్టుకొని గవర్నమెంట్ ఉద్యోగం ఎలా కొడతావు’ అడుగుతాడు. దానికి సాగర్ మాట్లాడుతూ నేను గవర్నమెంట్ జాబ్ చేయడం చాలా అవసరం సార్ దానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని అడుగుతాడు. అధికారి నువ్వు ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడం చాలా కష్టం ఇక వదిలేయని చెబుతాడు. దాంతో సాగర్ చాలా బాధగా బయటికి వస్తాడు. ఇలా బయటికి రాగానే నర్మద కనిపిస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నావని సాగర్ ని ప్రశ్నిస్తుంది. ఫ్రెండ్ ని కలవడానికి వచ్చానని చెబుతాడు సారగ్. తర్వాత ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు. సాగర్ మీద నర్మద మనసులో సందేహం అలాగే ఉంటుంది.
వల్లిని ఇరికించిన నర్మద, ప్రేమ
ఇక ఇక్కడ నుంచి సీన్... రాత్రి భోజనాల దగ్గరికి మారుతుంది. కుటుంబమంతా కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది. ప్రేమ, నర్మద కలిసి వల్లిని టార్గెట్ చేస్తారు. ప్రేమ మాట్లాడుతూ ‘వల్లి అక్క నువ్వు ఎమ్ఏ ఇంగ్లీష్ చేశావు కదా’ అని అంటుంది. దాంతో మళ్ళీ ఒక్కసారిగా భయపడిపోతుంది. మధ్యలో నర్మద మాట్లాడుతూ చదువుకున్నాక ఏదో ఒక ఉద్యోగం చేయాలనుంటుంది కదా ఎంఏ ఇంగ్లీష్ చదివిన నువ్వు.. ఏమవుదామనుకున్నావ్? అని వల్లిని అడుగుతుంది. దాంతో వల్లి ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతుంది. తెలివిగా ప్రస్తుతం నా ఆశయం ఒక్కటే అత్తయ్య గారికి ఇంటి పనిలోను, వంట పనుల్లోనూ సాయం చేస్తూ అత్తా మామయ్య దగ్గర మంచి కోడలు అనిపించుకోవాలన్నదే అని చెబుతుంది. ఇక పైన ఇప్పటివరకు అత్తయ్య గారే కిచెన్ కు మహారాణి, ఇకపై ఈ వల్లీ మహారాణి అని అంటుంది.
దాంతో వేదవతి ముఖం మాడిపోతుంది. కేవలం అత్తయ్య గారికి సాయం చేయడం కోసమే ఏ ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉంటున్నానని వల్లి చెబుతుంది. లేకుంటే పెద్ద ఉద్యోగం చేసేదాన్నని అంటుంది. దీంతో వేదవతికి కోపం వచ్చి రేపటి నుంచి నువ్వు కూడా ఉద్యోగానికి వెళ్ళు అని అంటుంది. దాంతో విల్లికి ఫ్యూజుల్ అవుట్ అయిపోతాయి.

