100 ఎకరాల్లో అద్భుతమైన ఫామ్ హౌజ్.. ధర్మేంద్ర ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా.?
Dharmendra: బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. 89 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ధర్మేంద్ర సోమవారం తుదిశ్వాస విడిచారు.

ప్రశాంత జీవితం
తనకు శాంతి ఇచ్చేది నగరం కాకుండా ప్రకృతి అని ధర్మేంద్ర చాలాసార్లు చెప్పారు. అందుకే ముంబై ట్రాఫిక్, సినిమా రద్దీ, శబ్దాల నుంచి దూరంగా లోనావాలాలో ఉన్న తన ఫార్మ్ హౌస్‌లో ఎక్కువ సమయం గడిపేవారు. ఈ ఫార్మ్ హౌస్ 100 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది కేవలం పెద్ద ప్రాంతం మాత్రమే కాదు, అందమైన నిర్మాణాలు, పచ్చని చెట్లు, ఆధునిక సౌకర్యాలతో నిండి ఉంది.
ఆర్గానిక్ వ్యవసాయం, జంతు సంరక్షణ
ఈ ఫార్మ్‌హౌస్‌లో ధర్మేంద్ర స్వయంగా ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేసేవారు. అక్కడ పండ్లు, కూరగాయలు, ధాన్యాలు పండించేవారు. అదే విధంగా ఆయన ఆవులతో పాటు ఇతర పశువులు కూడా పెంచేవారు. వాటి సంరక్షణలో ఆయనకు చాలా ఆసక్తి ఉండేది. ఆయనతో పాటు పలువురు ఉద్యోగులు వ్యవసాయం నిర్వహణలో సహాయం చేసేవారు.
ఫార్మ్ హౌస్‌లో ఉన్న ప్రత్యేక ఆకర్షణలు
ఈ ఆస్తిలో ఖరీదైన సౌకర్యాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా: అద్భుతమైన బంగ్లా, స్విమ్మింగ్ పూల్, రాక్ గార్డెన్, పచ్చటి లాన్స్, 1000 అడుగుల లోతున్న చిన్న సరస్సు ఉన్నాయి. ఈ సరస్సు వద్ద ధర్మేంద్ర ఎక్కువగా సమయం గడిపేవారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అక్కడి ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు. గతంలో అవి వైరల్ అయ్యాయి కూడాయి.
రూ. వందల కోట్ల ఆస్తులు
ధర్మేంద్ర మొత్తం ఆస్తి విలువ దాదాపు రూ. 335 కోట్లుగా అంచనా. అందులో ఈ లోనావాలా ఫార్మ్ హౌస్ ముఖ్యమైన భాగం. రియల్ ఎస్టేట్ నిపుణుల ప్రకారం, ఇది అతి ఖరీదైన ప్రైవేట్ ఫార్మ్ హౌసులలో ఒకటిగా చెబుతుంటారు. ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాశ్ కౌర్ ఇక్కడే ఎక్కువగా ఉంటారు. హెమా మాలిని కూడా కొన్నిసార్లు ఇక్కడికి వచ్చే వారు.

