తప్పక చూడాల్సిన ధర్మేంద్ర 7 ఐకానిక్ సినిమాలివే, ఈ ఓటీటీలలో చూడొచ్చు
Dharmendra Top 7 Movies OTT: ధర్మేంద్ర తన కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్ సినిమాల్లో నటించారు. ఆయన సినిమాలను ఓటీటీలో చూడాలని చాలామంది అనుకుంటున్నారు. ఆయన నటించిన టాప్ 7 మూవీస్ ఏంటి? అవి ఏ ఓటీటీలో చూడొచ్చు అంటే?

ధర్మేంద్ర టాప్ 7 కల్ట్ క్లాసిక్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్
ధర్మేంద్ర బాలీవుడ్‌లో హీ మ్యాన్‌గా పేరుతెచ్చుకున్నారు. హీరోగా అత్యధిక చిత్రాలు చేసిన బాలీవుడ్ నటుడిగా రికార్డు సృష్టించారు. ఆయన మూడు వందలకుపైగా సినిమాల్లో నటించారు. అయితే వాటిలో కొన్ని మాత్రం ప్రతి ఒక్కరు కచ్చితంగా చూడాల్సిన మూవీస్ ఉన్నాయి. ధర్మేంద్ర నటించిన టాప్ 7 బెస్ట్, ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ మూవీస్ ఏంటి? అవి ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసుకుందాం.
యమ్లా పగ్లా దీవానా
2011లో విడుదలైన యాక్షన్-కామెడీ సినిమా 'యమ్లా పగ్లా దీవానా'ను జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూడొచ్చు. ఈ యాక్షన్ కామెడీ మూవీలో ధర్మేంద్రతోపాటు సన్నీ డియోల్, బాబీ డియోల్ కూడా కలిసి నటించారు. సమీర్ కర్ణిక్ డైరెక్ట్ చేశారు. బాక్సాఫీసు వద్ద ఇది బంపర్ హిట్ అయ్యింది.
కహానీ కిస్మత్ కీ
1973లో విడుదలైన యాక్షన్-డ్రామా సినిమా 'కహానీ కిస్మత్ కీ'. ఇందులో రేఖ, ధర్మేంద్ర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా సూపర్‌హిట్ అయింది. దీన్ని ఇప్పుడు సోనీ లివ్‌లో చూడొచ్చు.
యాదోం కీ బారాత్
1973లో విడుదలైన ధర్మేంద్ర సినిమా 'యాదోం కీ బారాత్'ను జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూడొచ్చు. నజీర్ హుస్సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధర్మేంద్రతోపాటు విజయ్ ఆరోరా, జీనత్ అమన్, నీతూ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. అప్పట్లో ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
దోస్త్
ధర్మేంద్ర నటించిన క్లాసిక్స్ లో `దోస్త్` ఒకటి. ఇందులో ఆయనకు జోడీగా హేమా మాలిని హీరోయిన్‌గా నటించింది. వీరితోపాటు అమితాబ్ బచ్చన్, రెహ్మాన్, శత్రుఘ్న సిన్హా, అసిత్ సేన్ ముఖ్య పాత్రలు పోషించారు. దులాల్ గుహా దర్శకత్వం వహించిన ఈ మూవీ కల్ట్ క్లాసిక్స్ గా నిలిచింది. 1974లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
షోలే
1975లో విడుదలైన యాక్షన్-అడ్వెంచర్ సినిమా 'షోలే'. ఇందులో ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ జోడీ ప్రజల మనసులను గెలుచుకుంది. రమేష్ సిప్పీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్‌గా, ఇండియన్ సినిమాలోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ.15 కోట్లు వసూలు చేసింది. ఇందులో సంజీవ్ కుమార్ కీలక పాత్ర పోషించగా, హేమా మాలిని, జయ భాదురి హీరోయిన్లుగా నటించారు. అమ్జద్ ఖాన్ విలన్‌గా గబ్బర్ సింగ్ రోల్‌లో దుమ్ములేపారు. దీన్ని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
ఇన్సానియత్ కే దుష్మన్
1987లో విడుదలైన యాక్షన్ డ్రామా సినిమా 'ఇన్సానియత్ కే దుష్మన్'. ఇందులో ధర్మేంద్రతో పాటు శత్రుఘ్న సిన్హా, రాజ్ బబ్బర్ ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్ కుమార్ కొహ్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డింపుల్ కపాడియా, స్మితా పాటిల్, అనితా రాజ్ హీరోయిన్లుగా నటించారు. భారీ కాస్టింగ్‌తో వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమాని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
తహల్కా
1992లో విడుదలైన యాక్షన్-అడ్వెంచర్ సినిమా 'తహల్కా'. ఈ సూపర్‌హిట్ సినిమాను మీరు యూట్యూబ్‌లో చూడొచ్చు. అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ధర్మేంద్రతోపాటు నజీరుద్దీన్ షా, ముఖేష్ ఖన్నా, ఆదిత్య పంచోలి, జావేద్ జఫ్రీ, సోనూ వాలియా, ఏక్తా సోహిని, పల్లవి జోషి వంటి వారు ప్రధాన పాత్రలు పోషించడం విశేషం.

