MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • ఎన్టీఆర్ అభిమానులకు ప్రభాస్ డైరెక్టర్ క్షమాపణలు, కారణం ఏంటో తెలుసా?

ఎన్టీఆర్ అభిమానులకు ప్రభాస్ డైరెక్టర్ క్షమాపణలు, కారణం ఏంటో తెలుసా?

Prabhas Director  Apologizes to NTR Fans : యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు సోషల్ మీడియాాలో క్షమాపణలు తెలిపాడు ప్రభాస్ డైరెక్టర్ మారుతి. అసలు ఆయన ఏం చేశారు? ఎందుకు సారీ చెప్పాడు? 

2 Min read
Mahesh Jujjuri
Published : Nov 25 2025, 12:35 PM IST| Updated : Nov 25 2025, 12:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మొదలైన రాజాసాబ్ ప్రమోషన్లు..
Image Credit : Asianet News

మొదలైన రాజాసాబ్ ప్రమోషన్లు..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి త్వరలో రాబోతున్న పాన్ ఇండియా హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌ సినిమా ‘రాజాసాబ్. సంక్రాంతి కానుకగా అభిమానులను అలరించబోతున్న రాజాసాబ్ సినిమా ప్రమోషన్స్.. ఇప్పటి నుంచే మొదలు పెట్టారు. ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాను దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్నాడు. జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటను, రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇక ప్రభాస్ అభిమానులకోసం వరుసగా అప్ డేట్స్ రాబోతున్నట్టు కూడా ప్రకటించారు. అయితే ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో మారుతీ చేసిన కామెంట్స్ కొన్ని ప్రస్తుతం పెద్ద వివాదానికి దారితీశాయి.

25
ప్రభాస్ కటౌట్ గురించి కామెంట్స్
Image Credit : Asianet News

ప్రభాస్ కటౌట్ గురించి కామెంట్స్

రాజాసాబ్ సాంగ్ కు మంచి స్పందన వస్తోంది. అయితే ఈ సాంగ్ లాంచ్ సందర్భంగా రాజాసాబ్ అప్‌డేట్స్ ఆలస్యంపై స్పందించిన మారుతీ.. కొన్ని కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు. రాజా సాబ్ నుంచి ఇక ముందు వరుసగా అప్‌డేట్స్ వస్తాయని అభిమానులకు హామీ ఇచ్చారు మారుతి. తరువాత మాట్లాడుతూ, “నాకు ఇలా కలర్స్ ఎగరేయడం అనే మాటలు చెప్పడం రాదు. ఒకవేళ చెప్పినా ప్రభాస్ కటౌట్‌కు చాలా చిన్నదవుతుంది” అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ బాగా వైరల్ అవ్వడంతో పాటు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి.

Related Articles

Related image1
బ్లూ ఫిల్మ్ కేసులో సుమన్ కు అండగా నిలబడ్డ ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా? స్వయంగా వెల్లడించిన హీరో
Related image2
రోజా కన్నతండ్రి కంటే ఎక్కువగా అభిమానించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్
35
వార్ 2 ఈవెంట్ లో కాలర్ ఎగరేసిన ఎన్టీఆర్..
Image Credit : Youtube/Sithara Entertainment

వార్ 2 ఈవెంట్ లో కాలర్ ఎగరేసిన ఎన్టీఆర్..

అయితే మారుతీ డైలాగ్స్ ఎన్టీఆర్ అభిమానులకు  కోపం తెప్పించాయి. ఎందుకంటే.. రీసెంట్ గా తారక్ నటించిన బాలీవుడ్ మూవీ వార్ 2 ఈవెంట్‌లో.. ఎన్టీఆర్ డబుల్ కాలర్‌లు ఎగరేద్దాం అన్నాడు. ఈ స్టేట్‌మెంట్‌ను అభిమానులు బాగా ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ వార్ 2 మూవీ ప్లాప్ అయ్యింది. ఇక మారుతీ చేసిన వ్యాఖ్యలని ఎన్టీఆర్ స్టేట్‌మెంట్‌తో పోల్చి, కొందరు అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. మారుతీ కావాలనే ఎన్టీఆర్‌ను టీజ్ చేసినట్టుగా ఆరోపణలు చేస్తూ హాష్‌ట్యాగ్ ట్రోలింగ్ కూడా ప్రారంభించారు. దాంతో ఈ విషయంలో మారుతీ వివరణ ఇవ్వక తప్పలేదు.

45
ఎన్టీఆర్ అభిమానులకు మారుతి సారి..
Image Credit : Asianet News

ఎన్టీఆర్ అభిమానులకు మారుతి సారి..

మారుతీ కామెంట్స్ ఎన్టీఆర్, ప్రభాస్ అభిమానుల మధ్య గొడవలకు కారణం అయ్యింది. అంతే కాదు సోషల్ మీడియాలో విమర్శలకు కూడా ఇది కారణం అవ్వడం.. వివాదం తీవ్రరూపం దాల్చడంతో దర్శకుడు మారుతీ స్వయంగా స్పందించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “ముందుగా అభిమానులకు నా క్షమాపణలు. నేను ఎవరినీ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు. నా మాటల వల్ల ఎవరికైనా మనసుకు నొప్పి కలిగితే హృదయపూర్వక క్షమాపణలు. నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు ఎన్టీఆర్ గారు అంటే ఎంతో ఇష్టం. ఆయనను ఉద్దేశించి నేను మాట్లాడలేదు” అని స్పష్టం చేశారు.

Dear Venky…
Felt like clarifying this personally.
First I sincerely apologise to every fan. It was never my intention to hurt or disrespect anyone. Sometimes in the flow of words things come out differently from what we truly mean and I regret that it was received in the wrong…

— Director Maruthi (@DirectorMaruthi) November 24, 2025

55
అభిమానులు శాంతిస్తారా?
Image Credit : prabhas instagram

అభిమానులు శాంతిస్తారా?

మారుతీ క్షమాపణలు చెప్పిన పోస్ట్ సూపర్ ఫాస్ట్ గా వైరల్ అయ్యింది. చాలా కోపంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు దీనిపై ఎలా స్పందిస్తారు, వివాదం ఇక్కడితో ముగుస్తుందా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. రాజాసాబ్ మూవీ ప్రమోషన్స్ మరింత జోరందుకునే సమయంలో.. ఇలా స్టార్ హీరో అభిమానుల కోపానికి గురైతే.. సినిమాపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే మారుతి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. రాజాసాబ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ హారర్ కామెడీ జానర్ లో ఫస్ట్ టైమ్ సినిమా చేస్తుండటంతో.. అభిమానులు ఈసినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
టాప్‌ 5 ఓటీటీ మూవీస్‌.. లాస్ట్ లో జాలీ ఎల్‌ఎల్‌బీ 3, నెంబర్‌ 1గా బాక్సాఫీసు సంచలనం
Recommended image2
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్ దక్కడని కంగారుపడ్డ జ్యోత్స్న- నిజం చెప్పేస్తానన్న దాసు
Recommended image3
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: ఒక్కటైన స్వప్న, కాశీ- తల్లి కాబోతున్న దీప- షాక్ లో జ్యో, పారు
Related Stories
Recommended image1
బ్లూ ఫిల్మ్ కేసులో సుమన్ కు అండగా నిలబడ్డ ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా? స్వయంగా వెల్లడించిన హీరో
Recommended image2
రోజా కన్నతండ్రి కంటే ఎక్కువగా అభిమానించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved