MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • పవన్‌ కళ్యాణ్‌ కోసం హీరోయిన్‌ని వెతికిన వదిన సురేఖ.. చిరంజీవి చెప్పిన మాటకి షాక్‌లో నటి

పవన్‌ కళ్యాణ్‌ కోసం హీరోయిన్‌ని వెతికిన వదిన సురేఖ.. చిరంజీవి చెప్పిన మాటకి షాక్‌లో నటి

పవన్‌ కళ్యాణ్‌ కోసం హీరోయిన్లని కూడా ఎంపిక చేసింది వదిన సురేఖ. అలా ఓ హీరోయిన్‌ని ఆమె ఎంపిక చేయగా, చిరంజీవి చెప్పిన మాటలకు ఆ నటి ఆశ్చర్యపోయిందట. ఆ సంగతేంటో చూద్దాం. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Nov 25 2025, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బిగినింగ్‌లో బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లతో కల్ట్ స్టార్‌గా ఎదిగిన పవన్‌
Image Credit : facebook/chiranjeevi

బిగినింగ్‌లో బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లతో కల్ట్ స్టార్‌గా ఎదిగిన పవన్‌

పవన్‌ కళ్యాణ్‌ `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈ మూవీ ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత `గోకులంలో సీత` చిత్రంతో మెప్పించారు. ఇందులో శ్రీహరి నెగటిల్‌ రోల్ చేయగా, రాశి హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత `సుస్వాగతం` చిత్రంతో మరో విజయాన్ని అందుకున్నారు. `తొలి ప్రేమ`తో బిగ్‌ బ్రేక్‌ అందుకుని స్టార్‌ అయిపోయారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్ తో టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌గా, యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ తెచ్చుకున్న హీరోగా రాణించారు. అదే ఫాలోయింగ్‌ ఇప్పటికీ కొనసాగుతుందంటే అతిశయోక్తి కాదు. అలా కల్ట్ హీరోగా ఎదిగారు పవన్‌.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పవన్‌ కళ్యాణ్‌ కోసం హీరోయిన్‌ని వెతికిన వదిన సురేఖ
Image Credit : X/pawan kalyan fans

పవన్‌ కళ్యాణ్‌ కోసం హీరోయిన్‌ని వెతికిన వదిన సురేఖ

ఇదిలా ఉంటే కెరీర్‌ ప్రారంభంలో పవన్‌ కళ్యాణ్‌కి ఆయన వదిన(చిరంజీవి భార్య) సురేఖ హీరోయిన్ ని వెతికిందట.  `గోకులంలో సీత` మూవీకి హీరోయిన్‌ని ఆమెనే ఎంపిక చేసిందట. ఈ విషయాన్ని హీరోయిన్‌ రాశి నే చెప్పింది. బాలనటిగా రాణించిన రాశి తమిళంలో `ప్రియం` అనే మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఇది ఆమెకి మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా కారణంగానే తెలుగులో జగపతిబాబు సరసన `శుభాకాంక్షలు` చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకుంది. తెలుగులో ఈ సినిమా విడుదలై పెద్ద హిట్‌ అయ్యింది.

Related Articles

Related image1
టాప్‌ 5 ఓటీటీ మూవీస్‌.. లాస్ట్ లో జాలీ ఎల్‌ఎల్‌బీ 3, నెంబర్‌ 1గా బాక్సాఫీసు సంచలనం
Related image2
ఈ వారం థియేటర్లో విడుదల కాబోతున్న చిత్రాలివే.. రామ్‌తో మహేష్‌ బాబు ఢీ
36
`శుభాకాంక్షలు` మూవీలో రాశి ని చూసి
Image Credit : lahari music

`శుభాకాంక్షలు` మూవీలో రాశి ని చూసి

`శుభాకాంక్షలు` మూవీలో రాశి ని చూసిన సురేఖ ఈ అమ్మాయి బాగుంది, కళ్యాణ్‌ బాబుకి బాగా సెట్‌ అవుతుందని భావించిందట. అప్పుడు పవన్‌ కళ్యాణ్‌ హీరోగా ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్‌లో `గోకులంలో సీత` మూవీ తీసేందుకు ప్లాన్‌ జరుగుతుంది. హీరోయిన్‌ కోసం చూస్తున్నారు. ఆ సమయంలోనే సురేఖ.. `శుభాకాంక్షలు`లో రాశిని చూసి చిరంజీవికి చెప్పిందట. ఆయన రాశిని ఇంటికి పిలిపించారు. ఆ సమయంలో చిరు కూడా చెన్నైలోనే ఉన్నారు. చిరంజీవి నుంచి పిలుపు వచ్చిందని హుటాహుటిని వచ్చింది రాశి. ఇంటికి వెళ్లగానే చిరంజీవి ఉన్నారు. ఆయన ఆమెని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే చిరంజీవితో పలు సినిమాల్లో రాశి బాలనటిగా నటించింది. ఇప్పుడు హీరోయిన్‌గా అంటే ఆయన కూడా కొంత ఆశ్చర్యపోయారట.

46
సురేఖ పిలిపించిందని తెలిసి షాక్‌ అయిన రాశి
Image Credit : youtube/hit tv

సురేఖ పిలిపించిందని తెలిసి షాక్‌ అయిన రాశి

ఆ తర్వాత సురేఖని పిలిచి పరిచయం చేశారట. ఆమెకి బాగా నచ్చిందట రాశి. వెంటనే ఓకే చేశారట. అయితే అప్పటి వరకు రాశికి తెలియదు, తనని పిలిపించింది సురేఖ అని, చిరంజీవి ఆ సమయంలో చెప్పడంతో తాను కూడా షాక్‌ అయ్యిందట. అలా తనని సురేఖ మేడం `గోకులంలో సీత`కి ఎంపిక చేసిందని తెలిపింది హీరోయిన్‌ రాశి. హిట్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకుందామె. ఇది తనకు గొప్ప మెమొరబుల్‌ మూమెంట్‌ అని, ఎప్పటికీ ఆ సందర్భాన్ని మర్చిపోలేనని వెల్లడించింది రాశి.

56
ఫ్యామిలీ చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన రాశి
Image Credit : youtube/hit tv

ఫ్యామిలీ చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన రాశి

రాశీకి తెలుగులో `శుభాకాంక్షలు`, `గోకులంలో సీత`, `పెళ్లి పందిరి` వంటి చిత్రాలు బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్ కావడంతో తెలుగుకే ప్రయారిటీ ఇచ్చింది. ఇక్కడ చాలా వరకు హోమ్లీ రోల్స్ చేసి మెప్పించింది. ఫ్యామిలీ చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. `పండగ`, `సుప్రభాతం`, `స్నేహితులు`, `మనసిచ్చి చూడు`, `స్వప్నలోకం`, `ప్రేయసి రావే`, `ఒకే మాట`, `మూడు ముక్కలాట`, `అమ్మో ఒకటో తారీఖు`, `దేవుళ్లు`, `మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది`, `దీవించండి`, `సందడే సందడి` వంటి చిత్రాలతో విజయాలు అందుకుంది. అప్పట్లో అత్యంత బిజీ హీరోయిన్‌గా రాణించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ మూవీస్‌ చేసింది. తెలుగులో `నిజం` తర్వాత ఆమె బ్యాక్‌ అయ్యింది. ఇందులో నెగటివ్‌ రోల్‌ చేసింది. దీంతో విమర్శలు ఎదుర్కొంది. అది తట్టుకోలేక సినిమాలకు దూరమయ్యింది రాశి. ఇప్పుడు మళ్లీ తెలుగులో నటించేందుకు సిద్దంగా ఉంది. అయితే ఇప్పటికే ఈమె సీరియల్స్ తోనూ బిజీగా ఉండటం విశేషం.

66
పవన్‌ని కొడుకులా భావించిన సురేఖ
Image Credit : X/pawan kalyan fans

పవన్‌ని కొడుకులా భావించిన సురేఖ

ఇక పవన్‌ కళ్యాణ్‌ ని వదిన సురేఖ సొంత కొడుకులా చూసుకుంటుంది. తమ మధ్య ఏజ్‌ గ్యాప్ చాలా ఎక్కువగా ఉండటంతో, పైగా చిన్నప్పట్నుంచి ఇంట్లోనే పెరగడంతో పెద్ద కొడుకులాగానే భావిస్తుంది సురేఖ. అంతేకాదు పవన్‌ కళ్యాణ్‌ కూడా ఆమెని అమ్మలాగే ట్రీట్‌ చేస్తారు. అమ్మ మీద అలిగినట్టుగానే ఆమె మీద అలుగుతాడట. అది వారి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనం. ఈ బాండింతోనే పవన్‌కి ప్రారంభంలో సినిమాలకు సంబంధించిన హీరోయిన్‌ ఎంపిక చేసిందని, ఇతర విషయాల్లోనూ ఆమె భాగమయ్యిందని సమాచారం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎంత క‌ష్టామైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి. జీవితాన్ని మార్చే గొప్ప సందేశం
Recommended image2
Mouni Roy House: విశ్వంభర నటి లగ్జరీ హోమ్ చూస్తే షాక్ అవుతారు, సిటీ వ్యూ, స్టైలిష్ డెకర్‌తో అదరగొట్టేసిందిగా
Recommended image3
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Related Stories
Recommended image1
టాప్‌ 5 ఓటీటీ మూవీస్‌.. లాస్ట్ లో జాలీ ఎల్‌ఎల్‌బీ 3, నెంబర్‌ 1గా బాక్సాఫీసు సంచలనం
Recommended image2
ఈ వారం థియేటర్లో విడుదల కాబోతున్న చిత్రాలివే.. రామ్‌తో మహేష్‌ బాబు ఢీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved