`కుబేర` మూడు రోజుల కలెక్షన్లు.. దళపతి విజయ్ 'GOAT' సినిమా రికార్డులు బ్రేక్
విజయ్ నటించిన 'GOAT' సినిమా లైఫ్ టైమ్ వసూళ్లని నాగార్జున, ధనుష్‌ల `కుబేర` చిత్రం బ్రేక్ చేసింది. ట్రేడ్ వర్గాలను షాక్‌కి గురిచేస్తోంది.

విజయ్ `గోట్` కలెక్షన్లని బ్రేక్ చేసిన ధనుష్ `కుబేర`
ధనుష్ 51వ సినిమా 'కుబేర' జూన్ 20న విడుదలైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్ సరసన రష్మిక మందన్నా, నాగార్జున ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.
ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడిగా నటించారు. వెంకటేశ్వర సినిమాస్ ఈ సినిమాను నిర్మించింది. సుమారు 120 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ధనుష్‌కి రూ.30 కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చినట్టు సమాచారం.
ధనుష్‌కి నేషనల్ అవార్డు రావాలంటూ చిరంజీవి కామెంట్
'కుబేర' సినిమాకి తమిళనాడులో మిశ్రమ స్పందన వచ్చినా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బాగా రన్ అవుతుంది. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చింది. దీంతో ఇక్కడ వసూళ్లు బాగా వస్తున్నాయి. సినిమా సక్సెస్ మీట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధనుష్‌కి ఈ సినిమాకి జాతీయ అవార్డు రావాలని ఆయన అన్నారు.
`కుబేర` మూడు రోజుల కలెక్షన్లు
ధనుష్ నటించిన 'కుబేరా' సినిమా తమిళనాడు కంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజు దేశవ్యాప్తంగా 14.5 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా తెలుగులో 10 కోట్లు వసూలు చేసింది.
రెండో రోజు 16.5 కోట్లు వసూలు చేయగా, తెలుగులో 11.5 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు దేశవ్యాప్తంగా 17.25 కోట్లు వసూలు చేయగా, తెలుగులో 10 కోట్లకు పైగా వసూలు చేసింది. మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్లకు పైగా వసూలు చేసి, 50 కోట్ల వైపు దూసుకుపోతోంది.
విజయ్ `గోట్` కలెక్షన్లని దాటేసిన `కుబేర`
'కుబేరా' సినిమాతో ధనుష్ తెలుగులో తన మార్కెట్‌ని పెంచుకుంటున్నాడు. ఆయన ఇప్పుడు తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ మార్కెట్ కలిగి ఉన్నాడు. అంతకుముందు `సార్` సినిమా తెలుగులో సూపర్ హిట్ అయింది.
ఇప్పుడు 'కుబేర' కూడా అదే బాటలో వసూళ్లు రాబడుతోంది. విజయ్ 'GOAT' సినిమా జీవితకాల వసూళ్ల రికార్డును 'కుబేర' బద్దలు కొట్టింది. 'GOAT' సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.19 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
సోమవారం పరీక్షలో `కుబేర` పాస్ అవుతుందా?
'కుబేరా' రెండు రోజుల్లోనే ఆ వసూళ్లను దాటేసి, ఇప్పుడు డబుల్ వసూళ్లు రాబడుతోంది. అయితే సోమవారం కలెక్షన్ల మీదే ఈ మూవీ సక్సెస్ ఆధారపడి ఉంది. మరి ఇది ఏ మేరకు సత్తా చాటుతుందో చూడాలి.
నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన `కుబేర` చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్, శేఖర్ కమ్ములు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రిచ్ మ్యాన్‌కి, బిచ్చగాడికి మధ్య పోరాటమే ఈ మూవీ.