- Home
- Entertainment
- రజనీకాంత్ డిజాస్టర్ సినిమా దెబ్బకి ఆ స్టార్ హీరోయిన్ కెరీర్ గల్లంతు.. సూపర్‌స్టార్‌పై షాకింగ్ కామెంట్స్
రజనీకాంత్ డిజాస్టర్ సినిమా దెబ్బకి ఆ స్టార్ హీరోయిన్ కెరీర్ గల్లంతు.. సూపర్‌స్టార్‌పై షాకింగ్ కామెంట్స్
సూపర్ స్టార్ రజనీకాంత్‌తో నటించేందుకు చాలా మంది హీరోయిన్లు క్యూ కడతారు. ఆయన చిత్రంలో కనిపిస్తే చాలు అంటున్నారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఆయనతో చేసి కెరీర్‌నే పోగొట్టుకుంది.

రజనీకాంత్‌తో సినిమా ఒక్క ఛాన్స్ కోసం ఎంతో మంది
సూపర్ స్టార్ రజనీకాంత్ నటుడిగా ఇప్పుడు సౌత్‌లో టాప్‌లో ఉన్నారు. ఆయన తిరుగులేని సూపర్ స్టార్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ లతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు.
అయితే రజనీకాంత్ తన కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లకి లైఫ్ ఇచ్చాడు. ఆయన సినిమాలతో స్టార్లు అయిన వారు ఉన్నారు. అదే సమయంలో రజనీకాంత్‌తో ఒక్క సినిమా చేస్తే చాలు అనుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు.
ఒక్క ఛాన్స్ కోసం ఇప్పటికీ ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. కానీ ఆ ఛాన్స్ వచ్చిన వారికి మాత్రం అదృష్టం అని చెప్పొచ్చు. అయితే ఓ హీరోయిన్ మాత్రం రజనీకాంత్ కారణంగా తన కెరీర్‌నే పోగొట్టుకుంది. ఆయనతో సినిమా చేసి అడ్రస్ లేకుండా పోయింది.
రజనీకాంత్ కారణంగా మనీషా కోయిరాలా కెరీర్ గల్లంతు
రజనీకాంత్‌తో సినిమా చేసి అడ్రస్ లేకుండా పోయిన స్టార్ హీరోయిన్ ఎవరో కాదు మనీషా కోయిరాలా. ఆమె సౌత్‌లో `ఒకే ఒక్కడు`, `బొంబాయి`, `భారతీయుడు` వంటి చిత్రాల్లో నటించింది. సంచలనాత్మక చిత్రాల్లో భాగమై మెప్పించింది.
సౌత్ ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. మనీషా సౌత్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా, ఆమెని అక్కున చేర్చుకున్నారు ఇక్కడి ఆడియెన్స్. ఎంతో ఆదరించారు. కానీ మనీషా మాత్రం సౌత్‌లో సినిమాలు చేయడం లేదు.
రజనీతో `బాబా` మూవీ చేసిన మనీషా కోయిరాలా
మనీషా కోయిరాలా దక్షిణాదిలో మూవీస్ చేయకపోవడానికి కారణం రజనీకాంత్. ఆయనతో నటించిన `బాబా` సినిమా. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మనీషా నటించింది. కానీ ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2002లో విడుదలైంది.
కానీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. అయితే ఈ మూవీకి రజనీకాంత్ నిర్మాతగా కావడం విశేషం. బాబా గొప్పతనం చెబుతూ రజనీకాంత్ చేసిన ఈ ప్రయత్నం బెడిసి కొట్టింది.ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. రజనీకి భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత రజనీ ప్రొడక్షన్ వైపు వెళ్లలేదు.
రజనీకాంత్ `బాబా` డిజాస్టర్, మనీషాపై ఎఫెక్ట్
ఇదిలా ఉంటే రజనీకాంత్ హీరోగా నటించిన ఈ మూవీలో మనీషా కోయిరాలా హీరోయిన్. సినిమా కథేంటి? తన పాత్ర ఏంటి? అనేది ఆలోచించకుండా సూపర్ స్టార్ మూవీ కావడంతో ఓకే చెప్పింది మనీషా.
కానీ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ ప్రభావం మనీషాపై పడింది. ఈ దెబ్బతో ఆమెకి సౌత్‌లో ఆఫర్లు రాలేదు. అంతకు ముందు తమిళంలో అడపాదడపా చాలానే ఆఫర్లు అందుకుంది. కన్నడలోనూ నటించింది.
తెలుగులోనూ ఓ మూవీ చేసింది. కానీ `బాబా` తర్వాత ఆమెకి ఛాన్సులు రాలేదు. దీంతో బాలీవుడ్‌కే పరిమితమయ్యింది. అక్కడ వరుసగా మూవీస్ చేసి స్టార్ హీరోయిన్‌గా రాణించింది.
సౌత్‌లో ఆఫర్లు రాలేదంటూ మనీషా కోయిరాలా ఆవేదన
సౌత్‌లో సినిమాలు చేయకపోవడంపై మనీషా కోయిరాలా స్పందించింది. రజనీకాంత్ వల్లే తన కెరీర్ నాశనమైందని తెలిపింది. ఆయనతో నటించిన `బాబా` మూవీ కారణంగానే తనకు సౌత్‌లో ఆఫర్లు రాలేదని తెలిపింది. `రజనీకాంత్ `బాబా` సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది.
ఈ సినిమా వలన నేను చాలా నష్టపోయాను. ఈ సినిమాకు ముందువరకు నాకు సౌత్ లో చాలా బాగా అవకాశాలు వచ్చాయి. కానీ, `బాబా` సినిమా తరువాత నాకు సౌత్ లో అస్సలు ఛాన్స్ లు రాలేదు` అని పేర్కొంది మనీషా. ఇటీవల ఆమె చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.