- Home
- Entertainment
- 23 సర్జరీలు, 4 ఏళ్ళు వీల్ చైర్ కే పరిమితం, భారీ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న స్టార్ హీరో ఎవరు?
23 సర్జరీలు, 4 ఏళ్ళు వీల్ చైర్ కే పరిమితం, భారీ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న స్టార్ హీరో ఎవరు?
స్టార్ హీరో ధైర్యానికి పెట్టింది పేరు, ప్రయోగాలకు మారు పేరు, సినిమా కోసం ప్రాణం ఇస్తాడు. ఎన్నో కష్టాలను అవలీలగా ఎదిరించిన సౌత్ హీరో. ఓ భారీ యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాడు. కాలు తీసేయ్యాలి అన్నారు. కాని పట్టుదలతో అన్నింటిని ఎదురించిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
Chiyaan Vikrams
23 సర్జరీలు, 4ఏళ్ళు వీల్ చైర్ కే పరిమితం, భారీ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న స్టార్ హీరో నింజగా ఇది ఎవరికైనా సాధ్యం అవుతుందా? కాని ఆ హీరోకు మాత్రం సాధయం అయ్యింది. పట్టుదలతో చావునే జయించాడు. బ్రతుకుతాడో లేదో అనుకున్నారు. కాని అన్ని ఆపరేషన్లు తట్టుకుని అంత పెద్ద ప్రమాదం నుంచి కూడా బ్రతికి స్టార్ హీరోగా ఎదిగాడు. హీరో మాత్రమే కాదు ప్రయోగాత్మక సినిమాలకు బ్రాండ్ గా నిలిచాడు. ఇంతకీ ఎవరా హీరో?
Also Read: కమల్ హాసన్ కు కూడా సాధ్యం కాలేదు, ఒక్క సినిమాలో 45 పాత్రలు చేసిన నటుడు ఎవరో తెలుసా?
vikram, aparichithudu, thangalaan
సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయా ప్రపంచం.. రంగురంగులు తెర వెనక విషాద ఛాయలు ఉంటాయి. నవ్వుతూ నవ్విస్తూ తెరపై కనిపించే స్టార్ల జీవితాల వెనక ఎన్నో విషాదాలు కూడా ఉంటాయి. ఈక్రమంలోనే సౌత్ లో స్టార్ వెలుగు వెలుగుతున్న హీరో జీవితానికి సబంధించిన ఈ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.ఆ హీరో మరెవరో కాదు చియాన్ విక్రమ్.. సౌత్ స్టార్ హీరో.. ప్రయోగాలకు పెట్టింది పేరు. సినిమాకోసం ఎంత రిస్క్ చేయడానికైనా వెనకాడని హీరో. 60 ఏళ్ళకు దగ్గరగా ఉన్నాడు.
Also Read: ఎన్టీఆర్, ఏఎన్నార్ కాదు ఫస్ట్ ఫారెన్ లో షూటింగ్ చేసిన తెలుగు హీరో ఎవరు? ఏ సినిమా?
vikram, aparichithudu, thangalaan
ఈ స్టార్ సీనియర్ హీరో.. వేయని వేశం లేదు.. చేయసి పాత్ర లేదు. ఎవరికీ సాధ్య కాని సాహసోపేతమైన క్యారెక్టర్లు కూడా అవలీలగా చేసేశాడు విక్రమ్. అటువంటి విక్రమ్ జీవితంలో తీవ్ర విషాదం ఒకటి దాగి ఉంది. ఈ హీరో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడట. విక్రమ్ ఫ్యామిలీలో అందరు చదువుకున్నవారే.
తల్లి గవర్నమెంట్ ఎంప్లాయి, చెల్లెలు ప్రభుత్వ టీచర్, తమ్ముడు సినిమా నటుడు, విక్రమ్ సినిమాల్లోకి వెళ్తానంటే.. MBA పూర్తి చేయాలి అని కండీషన్ పెట్టాడట. దాంతో MBA తో పాటు ఇంగ్లీష్ లిట్రేచర్ లో పోస్ట్ గ్రాడ్యూయేషన్ చేశాడు విక్రమ్. ఆతరువాత సినిమాల వైపు అడుగులు వేశాడు.
Also Read: రొమాన్స్ చేయను, ముద్దు సీన్లు వద్దు, నాగార్జునకు కండీషన్లు పెట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా?
చదువుకుంటూనే నాటకాల్లో నటిస్తూ.. మంచి పేరుతో పాటు ఎన్నో అవార్డ్ లు కూడా అందుకున్నాడటన విక్రమ్. ఓ సారి ఓ అవార్డ్ అందుకుని వస్తుండగా పెద్ద యాక్సిడెంట్ అయ్యిందట. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విక్రమ్ కు కాలు తీసేయాలి అన్నారట.
కాని అందుకు విక్రమ్ తల్లి అస్సలు ఒప్పుకోలేదట. ఎక్కడికి వెళ్లి అయినా ట్రీట్మెంట్ చేయిస్తాను కాని కాలు తీయ్యడానికి మాత్రం ఆమె నో చెప్పారట. దాంతో విక్రమ్ కెరీర్ బిగినింగ్ లోనే 4 ఏళ్ళు వీల్ చైర్ కు పరిమితం కావలసి వచ్చిందని సమాచారం.
Also Read: 300 కోట్ల హీరోను అల్లు అర్జున్ మూవీలో విలన్ గా ప్లాన్ చేస్తోన్న అట్లీ
Chiyaan Vikrams
ఆతరువాత విక్రమ్ కాలుకు 23 సర్జరీలు చేశారట. ఆయన కాలు చీలమండలం నుంచి మోకాలు వరకూ డామేజ్ అయ్యి.. చర్మం కూడా మారిపోయిందట. కాని అలాగే సర్జరీలు చేయించుకుని... సంకల్పంతో ముందుకువెళ్ళాడు విక్రమం.
కోలుకుని మళ్ళీ రంగంలోకి దిగాడు. ఇక ఆయన ఇండస్ట్రీలో చేసిన పాత్రలు.. ప్రయోగాలు, సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అపరిచితుడు, ఐ, శివపుత్రుడు, మల్లన్న, ఇలా ఎన్నో సినిమాల్లోతన పాత్ర కోసం ఎంతో కష్టపడ్డ నటుడు విక్రమ్.