- Home
- Entertainment
- డ్యాన్సుల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్, కృష్ణలా చేయలేను అని బ్రతిమాలిన చిరు..సూపర్ స్టార్ చెప్పిన ఒక్క మాటతో
డ్యాన్సుల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్, కృష్ణలా చేయలేను అని బ్రతిమాలిన చిరు..సూపర్ స్టార్ చెప్పిన ఒక్క మాటతో
డ్యాన్సుల్లో చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. అలాంటి చిరంజీవి సూపర్ స్టార్ కృష్ణతో డ్యాన్స్ చేయాలి అంటే భయపడిపోయారట. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ కథనంలో తెలుసుకోండి.

చిరంజీవి, కృష్ణ చిత్రాలు
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ బిగినింగ్ లో కృష్ణ, కృష్ణం రాజు లాంటి హీరోలతో మల్టీస్టారర్ చిత్రాలు చేశారు. సూపర్ స్టార్ కృష్ణతో కలిసి చిరంజీవి తోడు దొంగలు, కొత్తపేట రౌడీ లాంటి చిత్రాల్లో నటించారు. చిరంజీవి అంటే డ్యాన్సులకు పెట్టింది పేరు. ఎలాంటి సాంగ్ కి అయినా హుషారుగా డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆకర్షించేవారు చిరంజీవి. అయితే కెరీర్ బిగినింగ్ లో సూపర్ స్టార్ కృష్ణతో నటించిన ఓ మూవీలో డ్యాన్స్ చేయాలి అంటే చిరంజీవి భయపడిపోయారట.
చిరంజీవిలో కంగారు
ఈ విషయాన్ని సీనియర్ డ్యాన్స్ మాస్టర్ శ్రీను ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. చిరంజీవి, కృష్ణ కలిసి నటించిన తోడు దొంగలు షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో కృష్ణ, చిరంజీవి కలిసి ఓ సాంగ్ కి డ్యాన్స్ చేయాలి. అప్పటికే కృష్ణ సూపర్ స్టార్.. పెద్ద హీరో. చిరంజీవి మాత్రం ఇండస్ట్రీకి కొత్త. దీనితో చిరంజీవి కాస్త కంగారుగా కనిపించేవారు.
కృష్ణలా నేను డ్యాన్స్ చేయలేను
కృష్ణ లాంటి అగ్ర హీరోతో డ్యాన్స్ చేయాలి అంటే చిరంజీవి భయపడిపోయారట. డ్యాన్స్ మాస్టర్ శ్రీనుని పిలిచి.. మాస్టర్ నేను ఇంత కష్టమైన మూమెంట్స్ చేయలేను. ఆయనంటే(కృష్ణ) పెద్ద హీరో. ఆయనలా నేను డ్యాన్స్ చేయాలంటే కష్టం. దయచేసి డ్యాన్స్ మూమెంట్స్ మార్చండి అని బ్రతిమాలారు అట. అప్పటికే తాను చిరంజీవి డ్యాన్స్ ని కొన్ని సినిమాల్లో చూశానని డ్యాన్స్ మాస్టర్ శ్రీను అన్నారు.
చిరంజీవితో కృష్ణ ఏమన్నారంటే..
ఈ అబ్బాయి చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నాడు అని అనిపించింది. దీనితో నువ్వు చాలా బాగా డ్యాన్స్ చేస్తావయ్యా.. నీ బాడీలో ఆ రిథమ్ ఉంది అని ఎంకరేజ్ చేశారట. అయినా కూడా చిరంజీవి వినలేదు. దీనితో డ్యాన్స్ మాస్టర్ శ్రీను సూపర్ స్టార్ కృష్ణకి వెళ్లి విషయం చెప్పారు. కృష్ణ చిరంజీవి వద్దకు వచ్చి.. నాకు అంతగా డ్యాన్స్ రాదయ్యా చిరంజీవి.. నువ్వు చాలా బాగా చేస్తావ్ అని అన్నారట.
సూపర్ స్టార్ కృష్ణ చాలా జెన్యూన్
ఆ తర్వాత చిరంజీవి రిహార్సల్స్ కూడా అవసరం లేకుండా ఆ సాంగ్ పూర్తి చేసినట్లు డ్యాన్స్ మాస్టర్ శ్రీను అన్నారు. కృష్ణ చిరంజీవికి అందించిన ప్రోత్సాహం బాగా పనిచేసింది అని అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ చాలా జెన్యూన్ గా ఉండేవారు. తనకి సరిగ్గా డ్యాన్స్ రాదనే విషయాన్ని కృష్ణ ఓపెన్ గా చెప్పేవారు. అదే విధంగా తన సినిమా ఫ్లాప్ అయితే ఆ విషయాన్ని కూడా అంగీకరించేవారు అని శ్రీను అన్నారు. చిరంజీవి అప్పట్లో కృష్ణతో డ్యాన్స్ చేయడానికి భయపడ్డారు కానీ ఆ చిరంజీవే డ్యాన్సుల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు.