- Home
- Entertainment
- లిప్ లాక్ సీన్స్ పై నిధి అగర్వాల్ కామెంట్స్.. నా తల్లిదండ్రులతో కూర్చుని చూడలేని సన్నివేశాల్లో నటించను
లిప్ లాక్ సీన్స్ పై నిధి అగర్వాల్ కామెంట్స్.. నా తల్లిదండ్రులతో కూర్చుని చూడలేని సన్నివేశాల్లో నటించను
హరిహర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్ లిప్ లాక్ సన్నివేశాలపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఏం చెప్పిందో ఈ కథనంలో తెలుసుకుందాం.

నిధి అగర్వాల్ త్వరలో హరిహర వీరమల్లు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 2022లో విడుదలైన 'హీరో' చిత్రం తర్వాత నిధి అగర్వాల్ నటించిన తెలుగు మూవీ ఇదే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్ లో నిర్మించారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.
హరిహర వీరమల్లు కోసం నిధి అగర్వాల్ ఓపిగ్గా 5 ఏళ్ళు ఎదురుచూసింది. ఇప్పుడు ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొంటోంది. నిధి అగర్వాల్ హరిహర వీరమల్లు చిత్రం కోసం వంద శాతం డెడికేషన్ ప్రదర్శిస్తోంది. జూలై 24న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ తనకి మాస్ హీరోయిన్ కావాలని ఉన్నట్లు పేర్కొంది. దీనితో యాంకర్.. మాస్ హీరోయిన్ కావాలంటే కొన్ని అంశాలు తప్పనిసరిగా పాటించాలి కదా అని అడిగారు. బికినీలు ధరించడం, లిప్ లాక్ సన్నివేశాలు, ఇంటిమేట్ సన్నివేశాలు ఇలాంటివి చేయాలి కదా అని ప్రశ్నించారు.
దీనికి నిధి అగర్వాల్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. అలాంటివి నేను చేయను. నా లిమిట్స్ నాకు ఉన్నాయి. నా తల్లిదండ్రులతో కూర్చుని చూడలేని సన్నివేశాల్లో నేను నటించను అని నిధి పేర్కొంది. అలాంటివి చేయకపోయినా మాస్ హీరోయిన్ కావొచ్చు.
కష్టపడి పనిచేస్తాను, మంచి స్క్రిప్ట్స్ ఎంచుకోవడానికి ప్రయత్నిస్తాను అని నిధి అగర్వాల్ పేర్కొంది. హరిహర వీరమల్లు చిత్రం కోసం నిధి అగర్వాల్ భరతనాట్యం, గుర్రపు స్వారీ నేర్చుకుంది. ఈ మూవీలో భరతనాట్యం నేపథ్యంలో కీలక సన్నివేశం ఒకటి ఉందట. అదే విధంగా తన పాత్రలో ఊహించని ట్విస్ట్ ఉంటుందని నిధి అగర్వాల్ పేర్కొంది.