- Home
- Entertainment
- రోజా అన్నయ్యలా భావించే హీరోతో రొమాంటిక్ సీన్, 27 టేకులు తీసుకున్నారట.. అసలేం జరిగిందో తెలుసా
రోజా అన్నయ్యలా భావించే హీరోతో రొమాంటిక్ సీన్, 27 టేకులు తీసుకున్నారట.. అసలేం జరిగిందో తెలుసా
రోజా ఒక టాలీవుడ్ హీరోని తన అన్నయ్యలా భావించేదట. ఆ హీరోతో హీరోయిన్ గా నటించినప్పుడు రొమాంటిక్ సన్నివేశం షూటింగ్ లో ఆసక్తికర సంఘటన జరిగింది.
- FB
- TW
- Linkdin
Follow Us

సీనియర్ నటి రోజా ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర నటిగా రాణించారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, శ్రీకాంత్ లాంటి హీరోలతో రోజా ఎన్నో చిత్రాల్లో నటించారు. నటిగా రాణిస్తున్న సమయంలోనే ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకుల తర్వాత వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
రోజా తన కెరీర్ లో సీతారత్నం గారి అబ్బాయి, ముగ్గురు మొనగాళ్లు, భైరవ ద్వీపం, పెద్దన్నయ్య, క్షేమంగా వెళ్లి లాభంగా రండి లాంటి చిత్రాల్లో నటించింది. ఊరిలో వినాయకుడు అనే టీవీ కార్యక్రమంలో రోజా ఆసక్తికర విషయం రివీల్ చేసింది. ఈ కార్యక్రమంలో శ్రీదేవి డ్రామా కంపెనీ టీం హైపర్ ఆది, రష్మీ, ఇంద్రజ ఇతరులు పాల్గొన్నారు. రోజా, శ్రీకాంత్ అతిథులుగా హాజరయ్యారు.
ఈ షోలో హైపర్ ఆది శ్రీకాంత్ కి ఆసక్తికర ప్రశ్న సంధించారు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి చిత్రంలో మీరు రోజా గారితో నటించారు. ఒక సీన్ కోసం 27 టేకులు తీసుకున్నారట ఎందుకు అని ప్రశ్నించాడు. దీనికి శ్రీకాంత్ ఇచ్చిన సమాధానం చాలా ఫన్నీగా ఉంది.
సీతారత్నం గారి అబ్బాయి చిత్రంలో రోజా నాకు చెల్లిగా నటించింది. అప్పటి నుంచి నన్ను అన్నయ్య.. అన్నయ్య అని పిలుస్తూ ఉండేది. కానీ క్షేమంగా వెళ్లి లాభంగా రండి చిత్రంలో భార్యగా నటించింది. అప్పటి వరకు అన్నయ్య అని పిలుస్తూ ఉన్న అమ్మాయికి భర్తగా నటించాలంటే అన్ని టేకులు తప్పవు కదా అని శ్రీకాంత్ అన్నారు. దీనితో అక్కడున్న వారంతా నవ్వేశారు.
దీనికి కొనసాగింపుగా రోజా మాట్లాడుతూ.. అది కిచెన్ లో వచ్చే రొమాంటిక్ సీన్. నన్ను శ్రీకాంత్ గారు వెనకనుంచి వచ్చి కౌగిలించుకుని డైలాగులు చెప్పాలి. నన్ను కౌగిలించుకున్న వెంటనే డైలాగ్ మరచిపోతున్నారు. అందుకే 27 టేకులు అవసరం అయ్యాయి అని రోజా తెలిపింది.
హైపర్ ఆది సెటైర్లు వేస్తూ.. ఆయన దగ్గరకి రాగానే మీరు అన్నయ్య అని పిలిచి ఉంటారేమో.. అందుకే డైలాగులు మరచిపోయారు అని ఫన్నీగా తెలిపాడు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి చిత్రంలో శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ, ప్రీతా ప్రధాన పాత్రల్లో నటించారు.