MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: రాజశేఖర్‌లాగా నేను కూడా యాక్ట్ చేయలేను.. చిరంజీవి ఓపెన్‌ స్టేట్‌మెంట్‌.. ఎప్పుడంటే?

Chiranjeevi: రాజశేఖర్‌లాగా నేను కూడా యాక్ట్ చేయలేను.. చిరంజీవి ఓపెన్‌ స్టేట్‌మెంట్‌.. ఎప్పుడంటే?

చిరంజీవి అద్భుతమైన నటుడు. కానీ ఆయన రాజశేఖర్‌ నటన గురించి ప్రశంసలు కురిపించారు. ఆయన తాను కూడా నటించలేనిన అందరిలోనూ ఓపెన్‌గా ప్రకటించారు. మరి ఇది ఎప్పుడు జరిగిందంటే?

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 13 2026, 08:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాజశేఖర్‌ నటనపై చిరంజీవి ప్రశంసలు
Image Credit : our own

రాజశేఖర్‌ నటనపై చిరంజీవి ప్రశంసలు

చిరంజీవి నో డౌట్‌ బెస్ట్ యాక్టర్‌. ఆయన యాక్టింగ్‌కి కోట్లాది మంది అభిమానులున్నారు. భారతదేశంలోనే గర్వించదగ్గ నటుల్లో చిరంజీవి ఒకరు. అంతేకాదు స్టార్‌ డమ్‌లోనూ ఆయన టాప్‌లోనే ఉన్నారు. బిగ్గర్‌ దెన్‌ బచ్చన్‌ అని ఓ ఇంగ్లీష్‌ మేగజీన్‌ కూడా ప్రకటించిన రోజులున్నాయి. అయితే ఓ సందర్భంలో మాత్రం ఆయన రాజశేఖర్‌ నటన గురించి ప్రశంసలు కురిపించారు. రాజశేఖర్‌లాగా తాను కూడా చేయలేనని ఓపెన్‌గానే ప్రకటించారు. మరి ఆకథేంటి అనేది చూస్తే,

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గొడవలకు ముందు చిరంజీవికి, రాజశేఖర్‌కి మంచి అనుబంధం
Image Credit : youtube/shreyas media

గొడవలకు ముందు చిరంజీవికి, రాజశేఖర్‌కి మంచి అనుబంధం

చిరంజీవి, రాజశేఖర్‌కి మధ్య ఇప్పుడు కొన్ని గొడవలున్నాయి. పార్టీ పరమైన గొడవలని సమాచారం. ఈ క్రమంలో రాజశేఖర్‌పై చిరంజీవి అభిమానులు దాడి కూడా చేశారు. బ్లడ్‌ బ్యాంక్‌ విషయంలో రాజశేఖర్‌ చేసిన ఆరోపణలకు ఆయన జైలుకి వెళ్లినట్టు సమాచారం. కానీ ఒకప్పుడు చిరంజీవి, రాజశేఖర్‌ మధ్య మంచి అనుబంధం ఉంది. రాజశేఖర్‌ సినిమా సక్సెస్‌ మీట్‌లకు, ఈవెంట్లకి, సెలబ్రేషన్స్ కి చిరంజీవి గెస్ట్ గా వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కలిసి మంచి పార్టీలు కూడా చేసుకున్నారు.

35
అన్న మూవీతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న రాజశేఖర్‌
Image Credit : telugu lyrics world

అన్న మూవీతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న రాజశేఖర్‌

అలా `అన్న` సినిమా సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రాజశేఖర్‌ హీరోగా నటించిన `అన్న`సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. అన్న, తమ్ముడి సెంటిమెంట్‌ మెయిన్‌గా సినిమా సాగుతుంది. అటవి ప్రాంతంలో ఉండే అన్నాదమ్ముళ్లు పొట్టకూటి కోసం సిటీకి వస్తారు. ఇక్కడ రాజకీయ ఉచ్చులో చిక్కుకుంటారు. రౌడీలకు తమ్ముడు బలవుతాడు. దీంతో అన్నగా రాజశేఖర్‌ విలన్ల ఆటకట్టించడం, అందుకు కారణమైన రాజకీయ నాయకుల అంతు చూడటమనే కథాంశంతో సినిమా సాగుతుంది.

45
రాజశేఖర్‌లాగా నేను నటించలేను-చిరంజీవి
Image Credit : Asianet News

రాజశేఖర్‌లాగా నేను నటించలేను-చిరంజీవి

ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో గౌతమి, రోజా హీరోయిన్లుగా నటించారు. 1994 ఏప్రిల్‌ 7న విడుదలైంది. పెద్ద హిట్‌ అయ్యింది. ఈ సినిమా సక్సెస్‌ మీట్‌కి చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాలో రాజశేఖర్‌లాగా తాను కూడా పర్‌ఫెర్మ్‌ చేయలేనని ఓపెన్‌గా చెప్పారట. ముఖ్యంగా ఇంటర్వెల్‌ సీన్ అయితే నా వల్ల అయ్యేది కాదు, అంత బాగా చేసేవాడిని కాదు అని చెప్పారట. అయితే ఈ సినిమాని హిందీలోనూ చిరంజీవి రీమేక్‌ చేసే అవకాశం వచ్చిందట. కానీ తాను చేయలేనని తెలిపారు చిరంజీవి. ఈ విషయాన్ని రాజశేఖర్‌.. టీఎన్‌ఆర్‌ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం అది ఇప్పుడు వైరల్‌గా మారింది.

55
హీరోగా కమ్‌ బ్యాక్‌ కోసం చూస్తున్న రాజశేఖర్‌
Image Credit : Asianet News

హీరోగా కమ్‌ బ్యాక్‌ కోసం చూస్తున్న రాజశేఖర్‌

రాజశేఖర్‌ చివరగా `బైకర్‌` మూవీలో ముఖ్య పాత్ర పోషించారు. శర్వానంద్‌కి తండ్రి పాత్ర పోషించారు. ఇందులో ఆయన పాత్ర హీరో రేంజ్‌లో ఉండటం విశేషం. ఆ తర్వాత ఇప్పుడు హీరోగా రెండు సినిమాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఒకప్పుడు స్టార్‌ హీరోగా రాణించారు.చిరంజీవి లాంటి బిగ్‌ స్టార్స్ కి ఆయన పోటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వరుస పరాజయాల కారణంగా డౌన్‌ అయ్యారు. బౌన్స్ బ్యాక్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Babu Mohan: పాన్‌లో విషం కలిపి బాబు మోహన్‌ను చంపాలనుకున్నది ఎవరు? సంచలన విషయాలు వెల్లడించిన స్టార్ నటుడు
Recommended image2
Comrade Kalyan 4 Days Collections: సోమవారం పడిపోయిన శ్రీవిష్ణు మూవీ.. కామ్రేడ్‌ కళ్యాణ్‌కి టోటల్‌ కలెక్షన్లు
Recommended image3
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Related Stories
Recommended image1
Rajinikanth Villain Movies: రజనీకాంత్‌ విలన్‌గా విశ్వరూపం చూపించిన టాప్ 5 మూవీస్‌.. సూపర్‌ స్టార్‌ కావడానికి ముందు
Recommended image2
Comrade Kalyan 4 Days Collections: సోమవారం పడిపోయిన శ్రీవిష్ణు మూవీ.. కామ్రేడ్‌ కళ్యాణ్‌కి టోటల్‌ కలెక్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved