Nayanthara: నా జీవితం మీద డాక్యుమెంటరీ తీయకూడదా? ట్రోల్స్ పై నయనతార ఫైర్
Nayanthara: డాక్యుమెంటరీ గురించి విమర్శలు చేసిన వాళ్లకు లేడీ సూపర్ స్టార్ నయనతార గట్టి కౌంటర్ ఇచ్చారు. ధనుష్‌తో కాపీరైట్ వివాదం నడుస్తున్న వేళ.. నా జీవితం మీద డాక్యుమెంటరీ తీస్తే తప్పేంటి అని సూటిగా ప్రశ్నించారు.

కాపీ రైట్ వివాదం...
నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్గా రిలీజైన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ పెద్ద రచ్చకే దారితీసింది. ఇందులో ‘నానుమ్ రౌడీ ధాన్’ సినిమాలోని కొన్ని సెకన్ల విజువల్స్ వాడటంపై హీరో ధనుష్ అభ్యంతరం చెప్పారు. కాపీరైట్ కింద ఏకంగా రూ.10 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలంటూ లీగల్ నోటీసులు కూడా పంపారు.
ఈ వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే నయనతార జీవితం మీద డాక్యుమెంటరీ తీయాల్సిన అవసరం ఏముందని కొందరు విమర్శించారు. దీనిపై ఆమె దీటుగా బదులిచ్చారు. తన లైఫ్ జర్నీని డాక్యుమెంటరీగా చూపించడంలో తప్పేముందని ప్రశ్నించారు.
హీరోలకంటే నేను తక్కవేం కాదు..
"నేనేం మదర్ థెరిస్సాని కాదు, స్వాతంత్ర్య సమరయోధురాలిని కాదు. మీరు ఊహించుకునేంత పెద్ద పెద్ద బిరుదులకు నేను అర్హురాలిని కాకపోవచ్చు. కానీ, ఒక చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన సాధారణ అమ్మాయిని. మగవాళ్ల ఆధిపత్యం ఉన్న ఇండస్ట్రీలో ఎవరి అండా లేకుండా ఈ స్థాయికి ఎదిగాను.
ఇప్పుడు నాకు దక్కుతున్న ప్రేమ, గౌరవం ఏ స్టార్ హీరోకు తీసిపోదు. ఇన్నేళ్ల నా ప్రయాణంలో ఎవరూ సులువుగా సాధించలేని సక్సెస్ చూశాను. అలాంటి నా జీవితాన్ని డాక్యుమెంటరీగా తీస్తే తప్పేంటి?" అని విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు.
నటనలోనే కాదు, బిజినెస్‌లోనూ సక్సెస్!
42 ఏళ్ల నయనతార ఇప్పుడు కేవలం నటిగానే కాదు, సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆమె ఆస్తుల విలువ రూ.200 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం. సినిమాలు, బిజినెస్ రెండింటిలోనూ తన సక్సెస్ సీక్రెట్ ఏంటో ఆమె పంచుకున్నారు.
"నేను సినిమాల్లో నటించినా, బిజినెస్ చేసినా నూరు శాతం నిజాయితీగా, ఇష్టంతో పని చేస్తాను. ఎన్ని కష్టాలొచ్చినా, ఏం జరిగినా నా ఆత్మగౌరవాన్ని మాత్రం ఎప్పటికీ వదులుకోను" అని నయనతార స్పష్టం చేశారు.
కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసి, సవాళ్లు ఎదుర్కొని ఈరోజు లక్షలాది మంది అభిమానుల మనసు గెలుచుకున్న నయనతార సక్సెస్ జర్నీ ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. విమర్శలకు అంతే కాన్ఫిడెంట్‌గా బదులిచ్చిన లేడీ సూపర్ స్టార్ మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.















