- Home
- Entertainment
- Movie Reviews
- Peddannayya Movie Review: సంక్రాంతి బరిలో వెంకటేష్ ను చిత్తుగా ఓడించిన బాలకృష్ణ సినిమా, పెద్దన్నయ్య రివ్యూ..
Peddannayya Movie Review: సంక్రాంతి బరిలో వెంకటేష్ ను చిత్తుగా ఓడించిన బాలకృష్ణ సినిమా, పెద్దన్నయ్య రివ్యూ..
Peddannayya Movie Review: బాలయ్య కెరీర్ లో ఎన్నోసార్లు తోటి హీరోలతో సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచాడు. ప్రతీసారి గెలివకపోయినా.. కొన్ని సినిమాలు మాత్రం పోటీని తట్టుకుని గట్టిగానిలబడ్డాయి. అలాంటి సినిమాల్లో పెద్దన్నయ ఒకటి.

పెద్దన్నయ్య రివ్యూ..
తెలుగు సినిమా చరిత్రలో 1997 సంక్రాంతి పండుగ ప్రేక్షకులకు ఎన్నో మరపురాని జ్ఞాపకాలను అందించింది. ఆ పండుగ బరిలో మూడు పెద్ద సినిమాలు నిలవగా.. అందుల్ ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ జనాలను కూడా ఉర్రూతలూగించి.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా 'పెద్దన్నయ్య'. నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా 1997 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ సెంటిమెంట్, అన్నదమ్ముల అనుబంధం, యాక్షన్, మాస్ పవర్ మేళవించి తెరకెక్కించిన ఈ చిత్రం నేటికీ అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానంలో నిలిచింది.
'పెద్దన్నయ్య' చిత్రాన్ని రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియోస్ బ్యానర్‌పై నందమూరి రామకృష్ణ నిర్మించారు. శరత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, పరుచూరి బ్రదర్స్ కథతో పాటు పవర్ ఫుల్ డైలాగ్స్ ను కూడా అందించారు. ఛాయాగ్రహణాన్ని నందమూరి మోహన కృష్ణ నిర్వహించగా, ఎడిటింగ్ బాధ్యతలను కోటగిరి వెంకటేశ్వరరావు చేపట్టారు.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోని విలువలు, అన్నదమ్ముల అనుబంధం, తమ మాటను గౌరవించే కుటుంబ సభ్యుల మధ్య సాగే భావోద్వేగాలే ఈ సినిమాకు ప్రధాన బలం. బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శైలిని గుర్తుచేసేలా పౌరుషం, కుటుంబ గౌరవం, సెంటిమెంట్ కలగలిసిన పాత్రల్లో కనిపించడం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పెద్దన్నయ కథ విషయానికి వస్తే..
రామకృష్ణా ప్రసాద్ (బాలకృష్ణ) ఉమ్మడి కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉంటాడు. కుటుంబ సభ్యులందరూ అతని మాటను ఎంతో గౌరవంగా, ఆప్యాయంగా పాటిస్తుంటారు. తన సోదరులు, కుటుంబ సభ్యుల భవిష్యత్తు, ఆనందమే తన ప్రాణంగా భావిస్తాడు. మరోవైపు, సీతామహాలక్ష్మి (రోజా) రామకృష్ణా ప్రసాద్‌ను ప్రేమించి, అతని కోసం ఎంతో ఓపికగా ఎదురుచూస్తుంటుంది.
గతంలో ప్రాణ స్నేహితులుగా ఉన్న రామకృష్ణా ప్రసాద్, భాస్కర్ రాయుడు (చరన్ రాజ్) మధ్య పరిస్థితుల కారణంగా తీవ్రమైన శత్రుత్వం ఏర్పడుతుంది. ఆస్తి పంపకాలు, కుటుంబ గౌరవం, గతంలో జరిగిన చేదు సంఘటనలు, పగ ప్రతీకారాల మధ్య కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది. అన్నదమ్ముల మధ్య తలెత్తే పరిస్థితులు, భావోద్వేగాలు, వాటిని పెద్దన్నయ్య ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశాల చుట్టూ కథనం తిరుగుతుంది.
నటీనటుల ప్రతిభ
ఈ సినిమాకు తన నటనతో ప్రాణం పోశాడు నందమూరి బాలకృష్ణ రామకృష్ణా ప్రసాద్, భవానీ ప్రసాద్ పాత్రల్లో ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. ఉమ్మడి కుటుంబాన్ని కాపాడుకునే పెద్దన్నయ్యగా హుందాతనం, భావోద్వేగ సన్నివేశాల్లో తీవ్రత, మాస్ సన్నివేశాల్లో జోష్ చూపించారు. యంగ్ బ్రదర్ భవానీ ప్రసాద్ పాత్రలో స్టైలీష్ లుక్ లో యాక్షన్ సీన్స్ తో అదరగొట్టాడు.
ఇక హీరోయిన్లుగా రోజా, ఇంద్రజ చాలా బాగా నటించారు. సీతామహాలక్ష్మి పాత్రలో చురుకుదనం, ప్రేమ, నిబద్ధత ఉన్న యువతిగా రోజా నేచురల్ యాక్టింగ్ తో అదరగొట్టింది. ఇక ఇంద్రజ, శుభశ్రీ: తమ పాత్రల పరిధి మేరకు చక్కటి నటనతో కథకు గ్లామర్ ను ఆడ్ చేశారు. వీరితో పాటు కోట శ్రీనివాసరావు, చరన్ రాజ్, శ్రీహరి, బ్రహ్మానందం, ఆలపాటి లక్ష్మి, అన్నపూర్ణ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
వెంకటేష్ ను చిత్తుగా ఓడించిన సినిమా..
ఈ సినిమాకు కోటి అందించిన సంగీతం పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. వేటూరి సుందరరామ్మూర్తి, సి. నారాయణ రెడ్డి రాసిన పాటలకు ఎస్.పి. బాలసుబ్రమణ్యం, కె.ఎస్. చిత్ర తమ గాత్రాలతో ప్రాణం పోశారు. ముఖ్యంగా "అన్నగారి కుటుంబం" ఫ్యామిలీ సాంగ్ తో పాటు మిగిని పాటలన్నీ ఇప్పటికీ శ్రోతలను అలరిస్తున్నాయి. ఇక శరత్ దర్శకత్వం, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ ఈ సినిమాను ఎక్కడో నిలబెట్టాయి. ఈసినిమా రిలీజ్ కు సంక్రాంతి బరలో ఇద్దరు పెద్ద హీరోలు ఉన్నా.. వారిని కూడా తట్టుకుని హిట్ గా నిలిచింది పెద్దన్నయ్య.
1997 సంక్రాంతి సీజన్ తెలుగు బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీకి వేదికైంది. ఆ సమయంలో చిరంజీవి హీరోగా నటించిన 'హిట్లర్' చిత్రంతో పాటు వెంకటేష్ హీరోగా చిన్నబ్బాయి కూడా 'పెద్దన్నయ్య' సినిమాతో పోటీ పడాయి. ఇద్దరు అగ్ర హీరోల చిత్రాలు బరిలో ఉన్నప్పటికీ, 'పెద్దన్నయ్య' బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. ముఖ్యంగా కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లు సాధించింది. గుంటూరు, విజయవాడ, ఉత్తరాంధ్ర వంటి ప్రాంతాల్లో వంద రోజుల వేడుకలు జరుపుకుని, ఆనాటి పొంగల్ రేసులో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ బరిలో నిలిచిన చిరంజీవి కూడా హిట్లర్ సినిమాతో సక్సెస్ సాధించాడు. కానీ చిన్నబ్బాయి సినిమాతో వెంకటేష్ మాత్రం డిజాస్టర్ ను ఫేస్ చేయాల్సి వచ్చింది.
ప్లాస్ - మైనస్ పాయింట్స్
ప్లాస్ - పాయింట్స్:
బాలకృష్ణ ద్విపాత్రాభినయం, మాస్ , సెంటిమెంట్ సన్నివేశాల్లో ఆయన నటన.
కుటుంబ విలువలు, అన్నదమ్ముల అనుబంధాన్ని చూపించే ఎమోషనల్ సీన్స్.
కోటి సంగీతం, ఆకట్టుకునే పాటలు.
పండుగ సీజన్‌కు తగిన ఎంటర్టైన్మెంట్ అంశాలు.
మైనస్ పాయింట్స్ :
పాతకాలపు కుటుంబ, పగ ప్రతీకారాల ఫార్ములాకు దగ్గరగా అనిపించే కథాంశం.
క్లైమాక్స్ సీన్స్ లో సెంటిమెంట్ మోతాదు కాస్త ఎక్కువగా అనిపించడం.
ఫైనల్ గా చెప్పాలంటే...
కుటుంబ బంధాలు, సెంటిమెంట్, మాస్ అంశాలు ఇష్టపడే ప్రేక్షకులకు 'పెద్దన్నయ్య' ఒక మంచి పండుగ చిత్రంగా నిలుస్తుంది. బాలకృష్ణ నటన, కోటి సంగీతం, పరుచూరి బ్రదర్స్ మాటలు ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెడతాయి. 1997 సంక్రాంతి బాక్సాఫీస్ విజయాల్లో తనదైన ముద్ర వేసిన ఈ చిత్రం, ఫ్యామిలీ డ్రామా ఇష్టపడేవారికి తప్పక నచ్చే సినిమా. ఈమూవీని చూడాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ తో పాటు యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది.















