MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Comrade Kalyan 4 Days Collections: సోమవారం పడిపోయిన శ్రీవిష్ణు మూవీ.. కామ్రేడ్‌ కళ్యాణ్‌కి టోటల్‌ కలెక్షన్లు

Comrade Kalyan 4 Days Collections: సోమవారం పడిపోయిన శ్రీవిష్ణు మూవీ.. కామ్రేడ్‌ కళ్యాణ్‌కి టోటల్‌ కలెక్షన్లు

శ్రీవిష్ణు హీరోగా నటించిన `కామ్రేడ్‌ కళ్యాణ్‌` మూవీ బాక్సాఫీసు వద్ద వీకెండ్‌లో సత్తా చాటింది. టాక్‌తో సంబంధం లేకుండా మంచి వసూళ్లని రాబట్టింది. కానీ సోమవారం మాత్రం డీలా పడింది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 13 2026, 07:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కామ్రేడ్‌ కళ్యాణ్‌ బాక్సాఫీసు రిపోర్ట్
Image Credit : X/@KonaFilmCorp

కామ్రేడ్‌ కళ్యాణ్‌ బాక్సాఫీసు రిపోర్ట్

ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌గా నిలిచే శ్రీవిష్ణు తాజాగా `కామ్రేడ్‌ కళ్యాణ్‌`తో సందడి చేస్తున్నారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమాలో మహిమా నంబియార్‌ హీరోయిన్‌గా నటించగా, జానకీరామ్‌ మారెళ్ల దర్శకత్వంతో రూపొందిన ఈ చిత్రాన్ని కోన వెంకట్‌ సమర్పణలో స్కంధ వాహన మోషన్‌ పిక్చర్స్, కోన ఫిల్మ్ కార్పొరేషన్‌ పతాకాలపై వెంకటకృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మించారు. రాధికా శరత్‌ కుమార్‌, షైన్‌ టామ్‌ చాకో, ఉపేంద్ర లిమయే, సత్య, సుదర్శన్‌, వెన్నెల కిశోర్‌, శ్రీకాంత్‌ అయ్యంగర్‌, సాయి చంద్‌, శత్రు కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. మరి బాక్సాఫీసు వద్ద ఎలాంటి రిజల్డ్ ని తెచ్చుకుంటోంది అనేది చూస్తే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కామ్రేడ్ కళ్యాణ్‌ 4 రోజుల వసూళ్లు
Image Credit : X/@KonaFilmCorp

కామ్రేడ్ కళ్యాణ్‌ 4 రోజుల వసూళ్లు

`కామ్రేడ్‌ కళ్యాణ్‌` మూవీ బాక్సాఫీసు వద్ద వీకెండ్‌లో సత్తా చాటింది. ఊహించని విధంగా ఈ మూవీకి మంచి కలెక్షన్లు వచ్చాయి. వరుసగా సెలవులు ఉండటంతో ఆడియెన్స్ సినిమాని చూస్తున్నారు. అది ఈ చిత్రానికి కలిసి వచ్చింది. వీకెండ్‌లో మంచి కలెక్షన్లని రాబట్టిన ఈ చిత్రం సోమవారం మాత్రం డ్రాప్‌ అయ్యింది. నాల్గో రోజు రూ.1.55కోట్ల ఇండియన్‌ నెట్‌ని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రెండో రోజు దాదాపు రెండు కోట్ల వరకు రాబట్టిందని చెప్పొచ్చు. ఇక నాల్గు రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 13.19కోట్లు వచ్చాయి. ఓవర్సీస్‌లో రెండు కోట్లు వచ్చాయి. టోటల్‌ ఇండియా గ్రాస్‌ రూ.11.19, ఇండియా నెట్‌ రూ.9.70కోట్లు వచ్చినట్టు సాక్నిల్క్ సైట్‌ వెల్లడించింది.

33
హిట్‌ కావాలంటే కామ్రేడ్‌ కళ్యాణ్‌ ఇంకా ఎంత చేయాలంటే?
Image Credit : X/@KonaFilmCorp

హిట్‌ కావాలంటే కామ్రేడ్‌ కళ్యాణ్‌ ఇంకా ఎంత చేయాలంటే?

ఈ సినిమాకి దాదాపు రూ.22 కోట్ల బడ్జెట్‌ అయ్యిందట. థియేట్రికల్‌ బిజినెస్‌ని రూ.11కోట్లుగా లెక్క కట్టారు. అంటే సుమారు రూ.22 కోట్ల గ్రాస్‌ రావాలి. ప్రస్తుతం రూ.13.19కోట్లు వచ్చాయి. ఇంకా దాదాపు 9 కోట్లు రావాలి. అయితే ఇప్పుడు సెలవులుండటంతో ఇది ఆ టార్గెట్‌ని రీచ్‌ అవుతుందని చెప్పొచ్చు. కలెక్షన్లు స్టడీగా ఉంటే సాధ్యమవుతుంది. పడిపోతే చెప్పలేం. ఇదిలా ఉంటే ఈ మూవీ మూడు రోజుల్లోనే రూ.19.80కోట్లకుపైగా వసూలు చేసినట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రటించింది. వారి లెక్కల ప్రకారం ఒకటి రెండు రోజుల్లో ఈ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ అవుతుందని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Related Stories
Recommended image1
Rajinikanth Villain Movies: రజనీకాంత్‌ విలన్‌గా విశ్వరూపం చూపించిన టాప్ 5 మూవీస్‌.. సూపర్‌ స్టార్‌ కావడానికి ముందు
Recommended image2
VK Naresh: చంద్రబాబే పిల్లల్ని కనమని చెప్పాడు, నా తప్పేం లేదు... ట్రోల్స్ పై నరేష్‌ రియాక్షన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved