- Home
- Entertainment
- చిరంజీవి ఎవరు?, నోరుజారిన ఎన్టీఆర్.. నాగార్జున సీరియస్‌గా వార్నింగ్ ఇవ్వడంతో రియలైజేషన్
చిరంజీవి ఎవరు?, నోరుజారిన ఎన్టీఆర్.. నాగార్జున సీరియస్‌గా వార్నింగ్ ఇవ్వడంతో రియలైజేషన్
మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో పైకి వచ్చారు. అలాంటి చిరుని పట్టుకుని ఎన్టీఆర్ అవమానించాడు. దీంతో నాగార్జున రంగంలోకి దిగి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
- FB
- TW
- Linkdin
Follow Us

పాన్ ఇండియా సినిమాలతో టాప్ స్టార్‌గా ఎన్టీఆర్
జూ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు. పాన్ ఇండియా స్టార్‌గా రాణిస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్`, `దేవర`తో వరుసగా విజయాలు అందుకున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో పాపులర్ అయ్యారు.
ఇప్పుడు `వార్ 2`తో రాబోతున్నారు. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ నటించిన చిత్రమిది. త్వరలోనే విడుదల కాబోతుంది. దీనితోపాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు తారక్.
చిరంజీవిపై నోరు జారిన తారక్
ఎన్టీఆర్.. తాత నందమూరి తారక రామారావు వారసత్వాన్ని పునికి పుచ్చుకుని సినిమాల్లోకి వచ్చారు. `నిన్ను చూడాలని` చిత్రంతో టాలీవుడ్‌కి హీరోగా పరిచయం అయ్యారు.
`స్టూడెంట్ నెంబర్ 1` చిత్రంతో హిట్ అందుకున్నారు. ఆ తర్వాత `సుబ్బు`, `నాగ` చిత్రాలు ఆడలేదు. మళ్లీ రాజమౌళితో `సింహాద్రి` చిత్రం చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
అప్పట్లో ఈ మూవీ విజయం ఇండస్ట్రీని షేక్ చేసిందని చెప్పొచ్చు. ఆ సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చేసిన కామెంట్లు పెద్ద దుమారం రేపాయి. చిరుపై ఆయన నోరు జారారు.
చిరంజీవి ఎవరు? మాతాతనే పెద్ద స్టార్
`సింహాద్రి` సక్సెస్‌తో తారక్‌కి క్రేజ్, స్టార్ ఇమేజ్ వచ్చింది. బాగా ఫాలోయింగ్ పెరిగింది. ఆ సమయంలో ఓ లైవ్ ఇంటర్వ్యూలో తారక్ మాట్లాడుతూ చిరంజీవిపై షాకింగ్ కామెంట్ చేశారు.
ప్రస్తుతం టాప్ స్టార్‌గా ఉన్న చిరంజీవి గురించి ఏం చెబుతారు అని యాంకర్ అడగ్గా, చిరంజీవి ఎవరు? నాకు తెలిసిన అతిపెద్ద స్టార్ మా తాతయ్య(సీనియర్ ఎన్టీఆర్) మాత్రమే అని అన్నారు.
అది లైవ్‌లో వెళ్లిపోయింది. దీంతో అంతా షాక్ అయ్యారు. సక్సెస్ జోరులో ఉన్న తారక్ ఆ మైకంలో ఈ కామెంట్ చేసి ఉండొచ్చు. కానీ ఇండస్ట్రీలో అది పెద్ద రచ్చ అయ్యింది.
తారక్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున
ఆ తర్వాత నాగార్జున ఫోన్ చేసి తారక్‌కి క్లాస్ పీకాడట. పెద్ద వాళ్లతో ఎలా మాట్లాడాలో తెలుసుకో, అలా బహిరంగంగా మాట్లాడకూడదని చెప్పారట. గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట.
ఆ దెబ్బతో దిగొచ్చిన తారక్ తాను ఏం తప్పు చేశాడో తెలుసుకున్నారు. తనని తాను సరిచేసుకున్నారు. ఆ తర్వాత నుంచి తక్కువ మాట్లాడటం నేర్చుకున్నారు.
అంతేకాదు తన స్పీచ్ పకట్బందీగా ప్రిపేర్ అయి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడటం స్టార్ట్ చేశారు. ఇప్పుడు చాలా ఎక్స్ పర్ట్ అయ్యారు. మంచి వక్తగా పేరుతెచ్చుకుంటున్నారు.
వరుస పరాజయాలతో ఎన్టీఆర్‌లో రియలైజేషన్
అయితే `సింహాద్రి` తర్వాత ఎన్టీఆర్‌కి వరుసగా పరాజయాలు వెంటాడాయి. `యమదొంగ` వరకు ఐదారు పరాజయాలు చవిచూశారు. ఇది కూడా ఎన్టీఆర్‌లో రియలైజేషన్‌కి కారణమని చెప్పొచ్చు.
ఇప్పుడు వివాదాలకు దూరంగా ఉంటున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `డ్రాగన్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.
మరోవైపు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. అలాగే `దేవర 2`లోనూ నటించనున్నారు తారక్. ఇవి వచ్చే ఏడాది ప్రారంభం కానున్నాయి.