- Home
- Entertainment
- Samantha Dating: ప్రియుడితో అమెరికాలో సమంత చెట్టాపట్టాల్.. ఇంతకంటే అర్థమయ్యేలా ఎలా చెప్పాలి
Samantha Dating: ప్రియుడితో అమెరికాలో సమంత చెట్టాపట్టాల్.. ఇంతకంటే అర్థమయ్యేలా ఎలా చెప్పాలి
సమంతకి సంబంధించిన డేటింగ్ రూమర్స్ చాలా కాలంగా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆమె పంచుకున్న ఫోటోలను బట్టి చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టమవుతుంది.
- FB
- TW
- Linkdin
Follow Us

దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత అమెరికా టూర్
సమంత ఇప్పుడు రోజూ వార్తల్లో నిలుస్తోంది. ఓ వైపు తన యాక్టివిటీస్ పరంగా నెట్టింట చక్కర్లు కొడుతుంటే, మరోవైపు డేటింగ్ రూమర్స్ తో వార్తల్లో నిలుస్తోంది.
చాలా రోజులుగా ఆమె తన రూమర్ బాయ్ ఫ్రెండ్, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి తిరుగూ కనిపించింది. ఇద్దరూ చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నట్టు కనిపించారు.
ఏకంగా తన సోషల్ మీడియా అకౌంట్లలో ఫోటోలను పంచుకుంది. ఇప్పుడు మరోసారి ఆయనతో ఉన్న ఫోటోలను పంచుకుంటూ రూమర్లకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
ప్రియుడితో సమంత జాలీగా చెట్టాపట్టాల్
దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి అమెరికాలో హల్‌చల్ చేస్తుంది సమంత. డెట్రాయిట్ వీధుల్లో కలియ తిరుగుతుంది. అక్కడి అందాలను ఆస్వాధిస్తుంది. అయితే ఇందులో రాజ్ నిడిమోరుని పట్టుకుని ఆమె విదేశీ వీధుల్లో చక్కర్లు కొట్టడం విశేషం.
అంతేకాదు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంది. ఇందులో రాజ్ నిడిమోరుతోపాటు వారి కొంతమంది ఫ్రెండ్స్, సన్నిహితులు, పర్సనల్ టీమ్ కూడా ఉన్నారు.
రూమర్స్ పై స్పందించని సమంత, రాజ్‌నిడిమోరు
సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉన్నట్టు చాలా కాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరు కలిసి టెంపుల్స్ ని కూడా సందర్శించారు.
దీంతో ఈ ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే రూమర్స్ ఊపందుకున్నాయి. పెళ్లి డేట్ ఇదే అనే రూమర్స్ కూడా నెట్టింట చక్కర్లు కొట్టాయి.
కానీ దీనిపై అటు సమంతగానీ, ఇటు రాజ్ గాానీ స్పందించలేదు. ఈ వార్తలను ఖండించలేదు. దీంతో ఇది నిజమే అని అంతా నమ్ముతున్నారు. అదే చాలా కాలంగా నెట్టింట వైరల్ అవుతుంది.
సమంత ఫోటోలపై నెటిజన్ల ఆసక్తికర పోస్ట్
దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది సమంత. మరోసారి వీరిద్దరు క్లోజ్‌గా ఉన్న ఫోటోలను తాజాగా పంచుకోవడంతో నెటిజన్లు స్పందిస్తూ ఆసక్తికర పోస్ట్ లు పెడుతున్నారు.
వారిద్దరు ప్రేమలో ఉన్నారని, ఇంతకంటే బాగా అర్థమయ్యేలా చెప్పడం ఎలా అంటున్నారు. ఇదే వీరి మధ్య రిలేషన్ ని స్పష్టం చేస్తుందంటున్నారు. దీంతో ఇప్పుడు మరోసారి సమంత వార్తల్లో నిలుస్తోంది.
నాట్స్ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న సమంత
ఇదిలా ఉంటే ఇటీవల నాట్స్ వేడుకల్లో పాల్గొన్న సమంత స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వేడుకలకు రావడానికి, అమెరికా ఆడియెన్స్ ని కలవడానికి 15ఏళ్లు పట్టిందని ఎమోషనల్ అయ్యింది. యాంకర్ సుమని పట్టుకుని ఏడ్చేసింది. ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది.
ఇక ఇటీవల `శుభం` సినిమాతో నిర్మాతగా మారిన సమంత ఇప్పుడు `మా ఇంటి బంగారం`తోపాటు మరో హిందీ సినిమా చేస్తుందట. అలాగే `ది ఫ్యామిలీ మ్యాన్ 3`లో ఆమె నటిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.
దీనికి రాజ్ నిడిమోడు, డీకే దర్శకులు కావడం విశేషం. వీరు రూపొందించిన `ది ఫ్యామిలీ మ్యాన్ 2`లో సమంత నటించింది. అప్పట్నుంచే రాజ్, సమంతలు ప్రేమలో పడ్డారని టాక్.