- Home
- Entertainment
- 'మన శంకర వరప్రసాద్ గారు' ట్రైలర్ రివ్యూ..ఎన్నాళ్లకు మెగాస్టార్ ఇలా, పండక్కి బ్లాక్ బస్టర్ కొట్టే స్టఫ్ ఉందా ?
'మన శంకర వరప్రసాద్ గారు' ట్రైలర్ రివ్యూ..ఎన్నాళ్లకు మెగాస్టార్ ఇలా, పండక్కి బ్లాక్ బస్టర్ కొట్టే స్టఫ్ ఉందా ?
చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ ట్రైలర్ వచ్చేసింది. చాలా రోజుల తర్వాత చిరంజీవి యాక్షన్, కామెడీ మిక్స్ చేసిన రోల్ లో కనిపిస్తున్నారు. ట్రైలర్ లో హైలైట్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి.

జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు మూవీ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం మరికొన్ని రోజుల్లో సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేయబోతోంది. చిరు, అనిల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇది. దీనితో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ట్రైలర్ వచ్చేసింది
తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేశారు. అంతా ఊహించినట్లుగానే చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత ఫుల్ ఫన్ అండ్ యాక్షన్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. ట్రైలర్ ప్రారంభం కాగానే చిరంజీవి పాత్రని ఫన్నీగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, రా ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్.. ఎలాంటి క్రిమినల్ అని అయినా ఉతికి పిండి ఆరేస్తారు.. తప్పు చేసినోడిని కోసి కారం పెడతారు అంటూ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ఉతికి ఆరేస్తారు అని అన్నపుడు చిరంజీవి బట్టలు ఉతుకుతూ కనిపించడం.. కోసి కారం పెడతారు అన్నప్పుడు వంకాయల కోయడం చూపించారు.
చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా..
దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు చిరంజీవి పాత్రలో అనిల్ రావిపూడి ఎంత ఫన్ జోడించారో అని. మన శంకర వరప్రసాద్ గారు అని చెప్పగానే చిరు తన స్టైల్ లో యాక్షన్ అవతారంలో చెలరేగిపోతున్నారు. గ్యాంగ్ లీడర్ తరహాలో వినిపిస్తున్న బీజీయం కూడా అదిరిపోయింది. భీమ్స్ చాలా కొత్తగా ఆ బీజీయం ని ప్రజెంట్ చేస్తున్నారు. చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి అది పర్ఫెక్ట్ గా సెట్ అయింది.
చిరు కామెడీ టైమింగ్ చూశారా
ఆ తర్వాత నయనతారతో ఫన్నీ రొమాన్స్, భార్య భర్తలు అయ్యాక జరిగే గోడలని అనిల్ రావిపూడి తనదైన స్టైల్ లో చూపించారు. శత్రువులని చిత్తు చేసే శంకర వరప్రసాద్.. భార్య ముందు మాత్రం పిల్లిలా అయిపోతున్నాడు. చిరంజీవి నయనతారని.. శశి నా వాట్సాప్ నెంబర్ కొంచెం అన్ బ్లాక్ చేయవా ప్లీజ్ అని అడుక్కోవడం ఫన్నీగా ఉంది.
వెంకటేష్ మాస్ ఎంట్రీ
ట్రైలర్ చివర్లో విక్టరీ వెంకటేష్ ఇచ్చిన ఎంట్రీ, చిరంజీవితో కలిసి చెప్పిన ఫన్నీ డైలాగ్ కూడా ఆకట్టుకుంటోంది. హెలికాఫ్టర్ లో వెంకీ ఎంట్రీ ఇస్తారు. చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావ్ ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావ్ ఏంటి అని చిరంజీవి అడగగా.. మాస్ కే బాస్ లా ఉన్నావ్ నువ్వు ఫ్యామిలీ రాలేదా అని వెంకీ కౌంటర్ ఇవ్వడం దానికి చిరంజీవి ఇచ్చిన రియాక్షన్ భలేగా ఉంటాయి. మొత్తానికి అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతికి పసందైన విందు రెడీ చేశారు. పండక్కి బ్లాక్ బస్టర్ అయ్యే స్టఫ్ మొత్తం ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది. సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటే బ్లాక్ బస్టర్ కొట్టేసినట్లే.

