- Home
- Entertainment
- Raasi: నా బాడీ గురించి అసభ్యంగా మాట్లాడింది, కేసు వేద్దామనుకున్నా..అనసూయ పేరెత్తకుండా ఇచ్చిపడేసిన నటి రాశి
Raasi: నా బాడీ గురించి అసభ్యంగా మాట్లాడింది, కేసు వేద్దామనుకున్నా..అనసూయ పేరెత్తకుండా ఇచ్చిపడేసిన నటి రాశి
శివాజీ, అనసూయ వివాదంలో నటి రాశి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అనసూయ పేరు ఎత్తకుండా రాశి కౌంటర్ ఇచ్చారు. గతంలో అనసూయ తన గురించి ఓ షోలో మాట్లాడిన విషయాన్ని రాశి బయటపెట్టింది.

శివాజీ వివాదంపై రాశి కామెంట్స్
ప్రముఖ నటి రాశి 90వ దశకం నుంచి టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తున్నారు. అప్పట్లో రాశి టాలీవుడ్ అగ్ర హీరోలతో నటించారు. జగపతి బాబు, శ్రీకాంత్ లతో ఎక్కువ సినిమాలు చేశారు. ప్రేయసి రావే, శుభాకాంక్షలు, పెళ్లి పందిరి లాంటి హిట్ చిత్రాలు రాశి కెరీర్ లో ఉన్నాయి. అయితే ఇటీవల శివాజీ వివాదం టాలీవుడ్ ని కుదిపేసింది.
ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రాశి
హీరోయిన్లు ధరించే బట్టల గురించి శివాజీ మాట్లాడుతూ కొన్ని పదాలు ఉపయోగించారు. దీనితో వివాదం పెరిగింది. అనసూయ, చిన్మయి మరికొందరు ప్రముఖులు శివాజీని విమర్శిస్తూ కౌంటర్ ఇచ్చారు. అనసూయ సోషల్ మీడియాలో కూడా అనేక పోస్ట్ లు పెట్టింది. శివాజీ వివాదం గురించి నటి రాశి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆమె తన యూట్యూబ్ ఛానల్ లో ఈ వివాదం గురించి మాట్లాడారు. రాశి మాట్లాడుతూ.. శివాజీ గారు మాట్లాడింది 100 శాతం తప్పు అని నేను అనను. కొన్ని మాటలు ఆ విధంగా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. కానీ అలా మాట్లాడినందుకు ఆయనే బాధపడ్డారు. క్షమాపణలు కూడా చెప్పారు. ఆయన వ్యక్తిగతంగా నాకు తెలుసు. ఇది పక్కన పెడితే నాకు నాలుగేళ్ళ క్రితం ఒక సంఘటన ఎదురైంది.
రాశిని బాడీ షేమింగ్ చేసేలా వ్యాఖ్యలు
కానీ అదే షోలో పాల్గొంటున్న యాంకర్ ఒక కామెడీ స్కిట్ చేసింది. ఆ యాంకర్ ఎవరో కాదు అనసూయ. ఆమె పేరు ఎత్తకుండా రాశి కౌంటర్ ఇచ్చారు. హైపర్ ఆది, అనసూయ కలిసి ఆ స్కిట్ లో పాల్గొన్నారు. ఆ స్కిట్ లో హైపర్ ఆది రాశి ఫలాలు అని అంటాడు.. వెంటనే ఆ యాంకర్ రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా అని అడుగుతుంది. ఒక మహిళ అయి ఉండి ఆమె అలా ఎలా మాట్లాడుతుంది.
ప్రేయసి రావే మూవీపై కామెడీ స్కిట్
నా భర్త నాకు ఒక వీడియో క్లిప్ చూపించారు. అది మీరంతా రెగ్యులర్ గా చూసే ఒక కామెడీ షోకి సంబంధించిన క్లిప్. అందులో జడ్జెస్, యాంకర్ కూడా మీ అందరికీ తెలుసు. ఆ షోకి రమ్మని నన్ను కూడా పిలిచారు. ప్రేయసి రావే సినిమాకి సంబంధించి కామెడీ స్కిట్ చేయాలని అడిగారు. ఆ సినిమా ఒక క్లాసిక్. దానిని కామెడీ చేయడం ఇష్టం లేక రానని చెప్పాను. ఆ షోకి జడ్జిగా, గెస్ట్ గా రమ్మంటే వస్తాను కానీ, ప్రేయసి రావే సినిమాని కామెడీ చేయడానికి మాత్రం అంగీకరించను అని చెప్పా.
లీగల్ గా వెళదామనుకున్నా
అదే యాంకర్ ఇప్పుడు శివాజీ వివాదంలో బాగా మాట్లాడుతున్నారు. రాశి ఫలాల్లో నేను లేను. కానీ రాశి గారి ఫలాలు అంటే నేను ఉంటాను. ఆ యాంకర్ మాట్లాడింది నా గురించే. రాశి గారి ఫలాలు అని యాంకర్ అనగానే అక్కడున్న జడ్జి కూడా నవ్వారు. ఆ టైంలో జడ్జిగా ఉన్నది రోజా. నేను ఆ ప్లేస్ లో ఉంటే నవ్వను. పైగా స్కిట్ ని ఆపేసేదాన్ని అని రాశి అన్నారు. బాడీ షేమింగ్ చేసే హక్కు ఎవరికీ లేదు. కన్న తల్లిదండ్రులకు కూడా లేదు. నేను దీనిపై లీగల్ గా వెళదాం అని అనుకున్నా. కానీ మా అమ్మ వద్దని చెప్పింది అందుకే ఆగిపోయినట్లు రాశి పేర్కొంది.

