- Home
- Entertainment
- చిరంజీవికి చెప్పుకోవడానికి ఒక్క గొప్ప సినిమా కూడా లేదు..శోభన్ బాబు, కృష్ణతో పోల్చుతూ సంచలన వ్యాఖ్యలు
చిరంజీవికి చెప్పుకోవడానికి ఒక్క గొప్ప సినిమా కూడా లేదు..శోభన్ బాబు, కృష్ణతో పోల్చుతూ సంచలన వ్యాఖ్యలు
చిరంజీవి కెరీర్ లో చెప్పుకోవడానికి ఒక్క గొప్ప సినిమా కూడా లేదు అని టాలీవుడ్ సీనియర్ నటుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ నటుడు ఎవరు ? ఎందుకు అలా అన్నారు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

చిరంజీవి సినిమాలు
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ ప్రారంభం నుంచి ఆడియన్స్ ని తన డ్యాన్సులు, ఫైట్స్ తో అలరిస్తూ వచ్చారు. ఖైదీ చిత్రం తర్వాత టాలీవుడ్ పై చిరంజీవి పూర్తి ఆధిపత్యం మొదలైంది. ఖైదీ తర్వాత చిరంజీవి సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. ఆ టైంలో ఎన్టీఆర్ కి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఏఎన్నార్ కూడా హీరోగా సినిమాలు చేయడం చాలా తక్కువ. కృష్ణ కెరీర్ కూడా చివరి దశకు చేరుకుంది.
ప్రేక్షకులని తనవైపు తిప్పుకున్న మెగాస్టార్
దీనితో చిరంజీవి తన ట్యాలెంట్ తో దర్శక నిర్మాతలని, తెలుగు ప్రేక్షకులని తనవైపు తిప్పుకున్నారు. విప్లవాత్మక సినిమాలు చేసే దర్శకుడు, నటుడు ఆర్ నారాయణ మూర్తి ఓ కార్యక్రమంలో చిరంజీవిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని.. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు లాంటి సీనియర్ నటులతో పోల్చుతూ వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవికి ఒక్క గొప్ప సినిమా కూడా లేదు
ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. రామారావు గారికి ఎన్నో గొప్ప సినిమాలు ఉన్నాయి చెప్పుకోవడానికి. నాగేశ్వర రావు గారికి కూడా ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు ఉంది. శోభన్ బాబు గారికి సంపూర్ణ రామాయణం ఉంది. చిరంజీవి గారు ఇంత పెద్ద మెగాస్టార్ కదా.. ఆయనకి గొప్ప సినిమా ఏది ? ఏదీ లేదు ?ఆయన గొప్ప మెగాస్టార్ కావచ్చు. కానీ వయసు అయిపోయాక.. అరె నేను ఇంత గొప్ప సినిమాలో నటించాను అని చెప్పుకోవడానికి ఒక్క సినిమా కూడా లేదు.
కనీసం ఆ సినిమా అయినా..
బహుశా సైరా నరసింహారెడ్డి చిత్రం చిరంజీవి గారి కెరీర్ లో గొప్ప సినిమా అవుతుందేమో చూడాలి అని అన్నారు. ఆ కార్యక్రమంలో చిరంజీవి కూడా పాల్గొన్నారు. చిరంజీవిని ఎదురుగా పెట్టుకునే ఆర్ నారాయణ మూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.
సైరా నరసింహారెడ్డి
సైరా నరసింహారెడ్డి సినిమా విడుదలై పర్వాలేదనిపించింది. కమర్షియల్ గా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. మొత్తంగా నారాయణమూర్తి కామెంట్స్ తో టాలీవుడ్ లో పెద్ద చర్చే జరిగింది. కొందరు నారాయణమూర్తి కామెంట్స్ ని సమర్థిస్తుండగా మరికొందరు విభేదిస్తున్నారు. చిరంజీవి తన కెరీర్ లో జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి అద్భుతమైన సినిమాల్లో నటించారు అని అంటున్నారు. కమర్షియల్ గా తెలుగు సినిమా స్వరూపాన్ని మార్చింది చిరంజీవే అని అంటున్నారు.

