- Home
- Entertainment
- 6 రూపాయల చిరంజీవి సినిమా టికెట్ 200, బ్లాక్ మార్కెట్ లో కూడా రికార్డ్ కొట్టిన మెగాస్టార్ సినిమా ఏదో తెలుసా?
6 రూపాయల చిరంజీవి సినిమా టికెట్ 200, బ్లాక్ మార్కెట్ లో కూడా రికార్డ్ కొట్టిన మెగాస్టార్ సినిమా ఏదో తెలుసా?
సినిమా టికెట్ల కోసం బ్లాక్ మార్కెట్ లో వేలకు వేలు పెడుతుంటారు అభిమానులు ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది. కాని అయితే 30 ఏళ్ల క్రితమే చిరంజీవి సినిమా కోసం 6 రూపాయల టికెట్ 200 రూపాయలు బ్లాక్ లో కొన్నారంటే మామూలు విషయం కాదు. ఇంతకీ మెగాస్టార్ ఏ సినిమా టికెట్ ను ఇంత కాస్ట్ పెట్టి కొన్నారో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
megastar chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ అంతా ఇంతా కాదు.. చిరంజీవిపై అభిమానులు ప్రేమ వెలకట్టలేనిది. అప్పటికీ ఇప్పటికీ అది రికార్డ్స్ ను క్రియేట్ చేస్తోంది. కోట్లమంది అభిమానులున్న అరుదైన హీరోలలో చిరంజీవి ఒకరు. ఆయన సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందంటే.. పాత సినిమాలు అయినా సరే రీరిలీజ్ చేస్తే.. రికార్డ్ కలెక్షన్లు రావడం ఖాయం. తాజాగా చిరంజీవికి సబంధించిన ఇటువంటి వార్తే ఒకటి వైరల్ అవుతోంది.
తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయిన సినిమాలలో జగదేకవీరుడు అతిలోకసుందరి' కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దివంగత తార, అతిలోక సుందరి శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ఐకానిక్ సోషియో ఫాంటసీ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈసినిమా రిలీజ్ అయ్యి 35 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, మే 9 న ఆఈ సినిమాను రీరిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈసినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ మూవీని రీమాస్టర్ చేసి, థియేటర్లలో విడుదల చేయనున్నారు.
1990 మే 9న విడుదలైన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' అప్పట్లో బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసింది. ఇప్పటి జనరేషన్ లో యూత్ ను కూడా అలరిస్తుంది ఈమూవీ. తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఈ సినిమాకు ఎంత క్రేజ్ ఉండేందంటే.. అప్పట్లో జరిగిని ఓ సంఘటన మెగాస్టార్ క్రేజ్ కు నిదర్శనంగా నిలిచింది.
జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయిన మొదటి రోజు మధ్యాహ్నం ఆటకు టికెట్ లు దొరకడం కష్టంగా మారింది. అప్పట్లో టికెట్ రేటు కేవలం రూ. 6.50 ఉండగా.. బ్లాక్ మార్కెట్ లో ఈ టికెట్‌ను ఏకంగా రూ. 210 కొనుగోలు చేశారంటే, ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ విషయం తెలియజేస్తూ.. ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఈ సినిమాలో చిరంజీవి రాజు అనే టూరిస్ట్ గైడ్ పాత్రలో కనిపించాగా.. శ్రీదేవి దేవకన్యగా నటించింది. ఇంద్రలోకం నుంచి భూలోకానికి వచ్చిన అతిలోక సందరి పాత్రలో శ్రీదేవి అద్భుతంగా నటించింది. ఈసినిమాలో శ్రీదేవి చేసిన ఇంద్రజ పాత్ర ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది.
ఈ సినిమా నుంచే ఆమెకు అతిలోకసుందరి అనే బిరుదు కూడా వచ్చింది. ఈమూవీలో వీరితో పాటుగా అమ్రిష్ పురి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామిరెడ్డి, బేబీ షాలిని, బేబీ షామిలి వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. భారీ బడ్జెట్‌తో సి. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మించారు.
megastar chiranjeevi
జగదేకవీరుడు అతిలోకసుందరి
ఇక ఈసినిమా విశేషాలను ఓ సందర్భంలో చిరంజీవితో పాటు మూవీ టీమ్ పంచుకున్నారు. 'అబ్బనీ తీయనీ దెబ్బ' పాట గురించి చిరంజీవి మాట్లాడుతూ, "ఆ పాటను ఇళయరాజా ఒక్క రోజులోనే ట్యూన్ చేశారు. ఇళయరాజా గారు ఉదయం 9 గంటలకు పని మొదలుపెట్టి, 12-12:30 గంటల కల్లా అద్భుతమైన ట్యూన్ ఇచ్చేశారు. అది వినగానే రాఘవేంద్రరావు గారు, దత్ గారు, నేను చాలా సింపుల్‌గా, స్వీట్‌గా ఉందని భావించి వెంటనే ఓకే చేశాం. మధ్యాహ్న భోజన సమయంలో వేటూరి గారు సాహిత్యం అందించారు. బాలు గారు ఎంతో ఉత్సాహంగా పాడారు అంటూ అప్పట్లో జరిగిన సంఘటనలను నెమరు వేసుకున్నారు మెగాస్టార్.