చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా త్రిష బర్త్ డే సందర్భంగా ఈసీనిమా నుంచి త్రిష స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్.
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా విశ్వంభర. ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు దర్శకుడు వశిష్ఠ మల్లిడి. ఈఆ సినిమాలో చిరంజీవి జోడీగా త్రిష నటిస్తోంది. ఈక్రమంలో హీరోయిన్ త్రిష పుట్టిన రోజు సందర్భంగా ఆమె పాత్ర పేరుతో సినిమా పోస్టర్ విడుదల చేశారు.
చిరు జోడీగా త్రిష 'అవని'గా కనిపించనుంది. ఆగస్టు 22న సినిమా విడుదల కానుంది. ఇషా చౌలా, రమ్య పసుపులేటి కూడా నటిస్తున్నారు. రమ్య ఇన్‌స్టాలో చిరుతో ఉన్న ఫోటో షేర్ చేసింది. వశిష్ఠ, చిరుకి థాంక్స్ చెప్పింది.
గుంటూరు కారం సినిమా కోసం వేసిన సెట్‌లోనే విశ్వంభర పాట చిత్రీకరించారని సమాచారం. ఇక ఈసినిమాలో చిరు సామాన్యుడిగా కనిపిస్తారని, 'దొరబాబు అనే పాత్రతో గోదావరి యాసతో మెగాస్టార్ సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. ' సామాన్యుడు హీరోగా ఎలా మారతాడన్నదే ఈ సినిమాలో ఆసక్తికరపాయింట్
చిరు నటించిన లేటెస్ట్ సినిమా 'భోళా శంకర్'. అజిత్ 'వేదాళం' రీమేక్. కానీ, బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా 47.50 కోట్లేు మాత్రమే వసూలైంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈసినిమాలో . కీర్తి సురేష్ చిరు చెల్లెలిగా, తమన్నా హీరోయిన్‌గా నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.