- Home
- Entertainment
- తుమ్మ మొద్దులా ఉంటాడు, అతడిని చూసి చిరంజీవి మైండ్ బ్లాక్.. మెగాస్టార్ కి ఆదర్శంగా నిలిచిన ఆ నటుడు ఎవరంటే
తుమ్మ మొద్దులా ఉంటాడు, అతడిని చూసి చిరంజీవి మైండ్ బ్లాక్.. మెగాస్టార్ కి ఆదర్శంగా నిలిచిన ఆ నటుడు ఎవరంటే
చిత్ర పరిశ్రమలో తాను ఎందరికో ఆదర్శంగా నిలిస్తే తనకి ఇన్స్పిరేషన్ గా నిలిచిన ఓ నటుడి గురించి చిరంజీవి వేదికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాన్ఫిడెన్స్ కోల్పోకూడదు అంటూ చిరంజీవి కామెంట్స్
చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఒక్కో మెట్టు ఎదుగుతూ టాలీవుడ్ లో అగ్ర స్థానానికి చేరుకున్న ప్రయాణం అందరికీ ఆదర్శం. దశాబ్దాల పాటు టాలీవుడ్ లో టాప్ హీరోగా చిరంజీవి రాణించారు. చిరంజీవి ఓ కార్యక్రమంలో యువత ఎప్పుడూ కాన్ఫిడెన్స్ కోల్పోకుండా తాము అనుకున్నది సాధించే వరకు పట్టుదలతో ఉండాలని తెలిపారు.
అవకాశాల కోసం ప్రయత్నించే రోజుల్లో..
చిత్ర పరిశ్రమలో తాను ఎందరికో ఆదర్శంగా నిలిస్తే తనకి ఇన్స్పిరేషన్ గా నిలిచిన ఓ కమెడియన్ గురించి చిరంజీవి వేదికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చెన్నైలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఫిలిం ఇన్స్టిట్యూట్ కి వెళ్ళేవాడిని అని చిరంజీవి తెలిపారు. అక్కడ పాండీ బజార్ లో ఎక్కువగా నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు ఉండేవారు. అవకాశాల కోసం ప్రయత్నించి విఫలమైన వాళ్ళు, జీవితంలో ఏమీ సాధించని వాళ్ళు అక్కడ ఎక్కువగా కనిపించేవారు.
ముఖం అద్దంలో చూసుకో అంటూ నెగిటివ్ కామెంట్స్
అక్కడికి ఎవరైనా వెళ్తే ఏంటి యాక్టర్ అయిపోదాం అని వచ్చావా.. ఒకసారి ముఖం అద్దంలో చూసుకో అంటూ నెగిటివ్ కామెంట్స్ చేసేవారు. వాళ్ల వ్యాఖ్యలతో నా ఆత్మ విశ్వాసం దెబ్బ తినేది. అందుకే పాండీ బజార్ వైపు వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నించి సక్సెస్ అయ్యాను. యువత కూడా ఇదే గుర్తుపెట్టుకోవాలి మీలో కాన్ఫిడెన్స్ ని దెబ్బతీసే వాళ్ళ దగ్గరికి వెళ్ళొదు. అలాంటి వారికి దూరంగా ఉంటూ మీ ప్రయత్నాలు మీరు చేయండి అని చిరంజీవి అన్నారు.
సునీల్ నా అభిమాని
జీవితంలో ఎప్పుడూ నెగిటివ్ గా ఆలోచించకండి. అనుకున్నది సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉండండి అని తెలిపారు. ఆ విషయంలో నాకు సునీల్ ఆదర్శం. భీమవరం నుంచి వచ్చిన సునీల్ నా అభిమాని. దొంగ చాటుగా వాళ్ళ అమ్మకి తెలియకుండా సినిమాలు చూస్తూ తాను కూడా నటుడిని కావాలని అనుకున్నాడు. సునీల్ యాక్టర్ కావాలనుకున్నప్పుడు చాలామంది అతడిపై నెగిటివ్ కామెంట్స్ చేశారు.
చిరంజీవికి మైండ్ బ్లాక్ చేసిన సునీల్
అతని స్నేహితులే ఇంత లావుగా ఉన్నావు, నల్ల తుమ్మ మొద్దులా ఉన్న నువ్వు యాక్టర్ అవుతావా ? అని నవ్వే వాళ్ళట. కానీ వాళ్ళ మాటలు సునీల్ పట్టించుకోలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సహకారంతో ఇండస్ట్రీకి వచ్చి కమెడియన్ అయ్యాడు. ఏకంగా సిక్స్ ప్యాక్ చేసి నా మైండ్ బ్లాక్ చేశాడు. ఆ విషయంలో సునీల్ నాకు ఆదర్శం అని చిరంజీవి అన్నారు. చిరంజీవి ఆ మాట అనగానే సునీల్ చేతులు జోడించి నమస్కరించారు. సునీల్ కొంతకాలం హీరోగా రాణించినప్పటికీ సరైన కథలు ఎంచుకోకపోవడం వల్ల ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. ఇప్పుడు మళ్లీ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సునీల్ రాణిస్తున్నాడు.

