- Home
- Entertainment
- తెలుగు మూవీ షూటింగ్ లో అది భరించలేక తల్లికి ఫోన్ చేసి ఏడ్చేసిన ఇలియానా.. పారిపోదామని అనుకుందట
తెలుగు మూవీ షూటింగ్ లో అది భరించలేక తల్లికి ఫోన్ చేసి ఏడ్చేసిన ఇలియానా.. పారిపోదామని అనుకుందట
టాలీవుడ్ లోతిరుగులేని హీరోయిన్ గా ఇలియానా చాలా కాలం తన హవా కొనసాగించింది. ఇలియానా టాలీవుడ్ లోకి దేవదాసు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.

టాలీవుడ్ లోతిరుగులేని హీరోయిన్ గా ఇలియానా చాలా కాలం తన హవా కొనసాగించింది. ఇలియానా టాలీవుడ్ లోకి దేవదాసు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. వైవిఎస్ చౌదరి ఈ చిత్రానికి దర్శకుడు కాగా రామ్ పోతినేని ఈ చిత్రంతోనే హీరోగా పరిచయమయ్యాడు.యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా రూపొందిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
తొలి చిత్రంలోనే ఇలియానా గ్లామర్ గా కనిపించి యువతని ఆకర్షించింది. అయితే ఈ చిత్ర షూటింగ్లో ఇలియానా భయంకర పరిస్థితులు ఎదుర్కొన్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రస్తుతం ఇలియానా ఇద్దరు పిల్లలకు తల్లిగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది.
దేవదాసు మూవీ గురించి ఇలియానా మాట్లాడుతూ.. ఇప్పటివరకు సినీ రంగంలో అలాంటి ఒత్తిడులు ఉంటాయని నాకు తెలియదు. పైకి గ్లామరస్ గా కనిపిస్తారు కానీ జీవితం అలా ఉండదు. చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నాకు అదే తొలి చిత్రం కావడం వల్ల షూటింగ్ వాతావరణం కొత్తగా అనిపించింది. ప్రారంభంలో ఆ పరిస్థితులకు అడ్జస్ట్ కాలేకపోయాను.
భాష, వర్క్ కల్చర్, చిత్ర యూనిట్ తో కమ్యూనికేషన్ ఇలా ప్రతిదీ సవాలుగా మారింది. దీంతో ఒత్తిడి ఎక్కువైపోయింది. ఒక దశలో ఆ ఒత్తిడిని భరించలేకపోయా. షూటింగ్ నుంచి పారిపోదామనుకున్నా. మా అమ్మకు ఫోన్ చేసి ఏడ్చేశాను. ఈ చిత్రంలో నేను నటించలేనని చెప్పినప్పుడు అమ్మ నాకు ధైర్యం చెప్పింది.
మా అమ్మ చెప్పిన మాటల వల్లే దేవదాసు చిత్రాన్ని పూర్తి చేయగలిగాను. ఆ తర్వాత ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాను అని ఇలియానా పేర్కొంది. దేవదాసు తర్వాత ఇలియానా నటించిన పోకిరి చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసింది దీంతో ఇలియానా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. పోకిరి తర్వాత ఇలియానా టాలీవుడ్ లో కోటి రూపాయలు రెమ్యునరేషన్ అందుకున్న తొలి హీరోయిన్ గా రికార్డ్ సృష్టించింది.