- Home
- Entertainment
- చిరంజీవి జాతకం మార్చేసిన నెల్లూరు లీలామహల్ థియేటర్, అతడు చేసిన మిస్టేక్ వల్లే మెగాస్టార్ అయ్యారా ?
చిరంజీవి జాతకం మార్చేసిన నెల్లూరు లీలామహల్ థియేటర్, అతడు చేసిన మిస్టేక్ వల్లే మెగాస్టార్ అయ్యారా ?
చిరంజీవి కెరీర్ కీలక మలుపు తిరగడానికి నెల్లూరులోని లీలామహల్ థియేటర్ తో పాటు ఓ క్యాసెట్ షాప్ వ్యక్తి చేసిన పొరపాటు కారణం అయ్యాయి. ఆ వివరాలు మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మెగాస్టార్ చిరంజీవి కెరీర్
మెగాస్టార్ చిరంజీవి 45 ఏళ్లుగా టాలీవుడ్ లో మెగాస్టార్ గా వెలుగొందుతున్నారు. తన నటన, డ్యాన్స్, ఫైట్స్ తో చిరంజీవి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ చిరంజీవి నెమ్మదిగా టాలీవుడ్ లో అగ్రస్థానానికి ఎదిగారు. అయితే చిరంజీవి కెరీర్ లో ఎన్నో ఊహించని సంఘటనలు జరిగాయి.
ఖైదీ చిత్రం
సాధారణ హీరోగా ఉన్న చిరంజీవిని స్టార్ గా మార్చేసిన చిత్రం ఖైదీ. 1983లో రూపొందిన ఈ చిత్రం కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కోదండరామిరెడ్డి హాలీవుడ్ మూవీ 'ఫస్ట్ బ్లడ్' ఆధారంగా రూపొందించారు. అయితే దీని వెనుక పెద్ద కథే ఉంది. ఖైదీ చిత్రానికి బీజం పడింది నెల్లూరులోని లీలామహల్ థియేటర్లో అంటే నమ్మగలరా? కానీ అది నిజం. నెల్లూరు లీలామహల్ థియేటర్లో జరిగిన సంఘటనతో ఖైదీ చిత్ర ప్రయాణం మొదలైంది.
లీలా మహల్ థియేటర్
ఖైదీ చిత్ర నిర్మాతలలో ఒకరైన తిరుపతిరెడ్డి అప్పట్లో నెల్లూరులో డాక్టర్ గా పనిచేశారు. ఓ ఇంటర్వ్యూలో తిరుపతిరెడ్డి ఖైదీ చిత్రం ఎలా మొదలైంది అనే విషయాన్ని చెబుతూ.. ఊహించని ట్విస్ట్ తో కూడిన సంఘటన గురించి తెలిపారు. చిరంజీవి గారి ఫ్యామిలీ అప్పట్లో నెల్లూరులో ఉండేవారు. వారి తండ్రితో నాకు అనుబంధం ఉంది. అంతకుముందే నేను చిరంజీవి నటించిన కొన్ని చిత్రాలకు ఫైనాన్స్ చేశాను. నెల్లూరులో డాక్టర్ గా పనిచేసేవాడిని. నైట్ డ్యూటీ లో ఉన్నప్పుడు పక్కనే ఉన్న లీలా మహల్ థియేటర్ లో సినిమాకి వెళ్లేవాడిని. ఏదైనా ఎమర్జెన్సీ అయితే థియేటర్ కి వచ్చి చెప్పేవాళ్లు.
చిరంజీవితో 'ఫియర్ ఓవర్ ది సిటీ'
లీలామహల్ థియేటర్ లో అప్పట్లో ఇంగ్లీష్ చిత్రాలు మాత్రమే ప్రదర్శించేవారు. ఆ రోజు 'ఫియర్ ఓవర్ ద సిటీ' అనే చిత్రం లీలామహల్ థియేటర్ లో చూశాను. అందులో ఉన్న మాస్ యాక్షన్ నాకు బాగా నచ్చింది. చిరంజీవికి సెట్ అవుతుంది అనిపించింది. దీంతో ఎలాగైనా ఆ చిత్ర క్యాసెట్ సంపాదించి డైరెక్టర్ కోదండరామిరెడ్డికి చూపించాలని అనుకున్నా. చాలా చోట్ల ప్రయత్నించినప్పటికీ ఆ చిత్ర క్యాసెట్ దొరకలేదు. చివరికి కొందరి ద్వారా ముంబైలో ఓ క్యాసెట్ షాప్ ఉందని అక్కడ ప్రతి సినిమాకు సంబంధించిన క్యాసెట్లు దొరుకుతాయని తెలిసింది.
క్యాసెట్ షాప్ లో జరిగిన పొరపాటు
వెంటనే ఆ క్యాసెట్ షాప్ కి ఫోన్ చేశాను. ఫియర్ ఓవర్ ద సిటీ చిత్ర క్యాసెట్ కావాలని అడిగాను. 400 రూపాయలు పంపిస్తే వెంటనే క్యాసెట్ ని కొరియర్ చేస్తానని షాప్ లో ఉన్న వ్యక్తి చెప్పాడు. అడిగినట్లుగానే 400 రూపాయలు పంపించాను. క్యాసెట్ నాకు చేరింది. ఇంటికి తీసుకెళ్లే ఓపెన్ చేసి చూస్తే అది ఫియర్ ఓవర్ ద సిటీ కాదు.. షాప్ వ్యక్తి నాకు పొరపాటున ఫస్ట్ బ్లడ్ అనే చిత్ర క్యాసెట్ ని పంపించాడు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. క్యాసెట్ ని పక్కన పడేసి షటిల్ ఆడటానికి వెళ్ళిపోయా.
చివరికి ఫస్ట్ బ్లడ్ మూవీనే ఖైదీగా..
తిరిగి ఇంటికి వచ్చాక ఫస్ట్ బ్లడ్ మూవీ అసలు ఎలా ఉంటుందో చూద్దామని ప్లే చేసి చూశాను. ఆ మూవీ కూడా నాకు బాగా నచ్చింది. వెంటనే కోదండరామిరెడ్డి గారికి చెప్పడం ఆయన చూడడం జరిగింది. ఆ తర్వాత చిరంజీవి గారు కూడా చూసి బాగుందని చెప్పారు. ఆ విధంగా ఫస్ట్ బ్లడ్ మూవీని మన తెలుగు నేటివిటీకి మార్చి ఖైదీ అనే చిత్రాన్ని రూపొందించినట్లు తిరుపతిరెడ్డి తెలిపారు.
ఆ విధంగా చిరంజీవి మెగాస్టార్ కావడానికి లీలామహల్ థియేటర్, క్యాసెట్ షాప్ వ్యక్తి చేసిన పొరపాటు కారణం అయ్యాయి. ఖైదీ చిత్రంలో చిరంజీవి నట విశ్వరూపం ప్రదర్శించారు. ఫస్ట్ బ్లడ్ చిత్రంలోని తొలి 15 నిమిషాలు మార్చకుండా ఖైదీ చిత్రంలో చిత్రీకరించారట.