- Home
- Entertainment
- జూ.ఎన్టీఆర్ చాలా అదృష్టవంతుడు, లక్ష్మీ ప్రణతి గురించి సీక్రెట్స్ చెబుతూ ప్రశంసలు కురిపించిన ఉపాసన
జూ.ఎన్టీఆర్ చాలా అదృష్టవంతుడు, లక్ష్మీ ప్రణతి గురించి సీక్రెట్స్ చెబుతూ ప్రశంసలు కురిపించిన ఉపాసన
లక్ష్మీ ప్రణతి లాంటి భార్య దొరికినందుకు జూనియర్ ఎన్టీఆర్ చాలా అదృష్టవంతుడు అని ఉపాసన తెలిపింది. లక్ష్మీ ప్రణతి గురించి కొన్ని సీక్రెట్స్ చెబుతూ ప్రశంసల వర్షం కురిపించింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఉపాసన కామెంట్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. రామ్ చరణ్ తో పాటు తన ఫ్యామిలీ గురించి విశేషాలని ఉపాసన అభిమానులతో పంచుకుంటుంటారు. తన అభిప్రాయాలని ధైర్యంగా చెప్పే సెలబ్రిటీలలో ఉపాసన ఒకరు. గతంలో ఉపాసన జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
చరణ్, ఎన్టీఆర్ బాండింగ్
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాలు చాలా క్లోజ్ గా ఉంటారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రారంభమైన తర్వాత చరణ్, ఎన్టీఆర్ మధ్య బాండింగ్ ఇంకా పెరిగింది. ఇరు ఫ్యామిలీలు తరచుగా పార్టీలకు హాజరవుతుండడం చూస్తూనే ఉన్నాం. చరణ్, ఎన్టీఆర్ లేకపోయినా ఉపాసన, లక్ష్మీ ప్రణతి మాత్రం సందర్భం వచ్చినప్పుడల్లా పార్టీలలో మీట్ అవుతుంటారు.
లక్ష్మీ ప్రణతి చాలా స్ట్రాంగ్
లక్ష్మీ ప్రణతితో ఉన్న చనువుతో ఉపాసన ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. లక్ష్మీ ప్రణతి చాలా అద్భుతమైన అమ్మాయి. తన ఫ్యామిలీలో అన్ని విషయాలలో ఆమె కేరింగ్ తీసుకుంటుంది. ప్రణతి వయసులో నాకన్నా చిన్నది.. అయినప్పటికీ ఆమె చాలా స్ట్రాంగ్ వుమెన్. ఎంత టెన్షన్ లో ఉన్న లక్ష్మీ ప్రణతిని చూస్తే కూల్ అయిపోతారు. ఆమె అంత మంచి అమ్మాయి అంటూ ఉపాసన ప్రశంసలు కురిపించింది.
ఎన్టీఆర్ అదృష్టవంతుడు
ప్రణతి లాంటి భార్య దొరికినందుకు జూనియర్ ఎన్టీఆర్ చాలా అదృష్టవంతుడు అంటూ ఉపాసన కితాబిచ్చింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి, కొమరం భీమ్ పాత్రల్లో నటించారు. ఈ చిత్రం చరణ్, తారక్ లకు పాన్ ఇండియా గుర్తింపు తీసుకువచ్చింది.
ఎన్టీఆర్, చరణ్ తదుపరి చిత్రాలు
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 చిత్రంలో, ప్రశాంత్ నీల్ డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు. రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చిత్రంలో నటిస్తున్నారు.