- Home
- Entertainment
- ఈ సినిమా మాకొద్దని చిరంజీవి, బాలయ్య, మోహన్ బాబు చేతులెత్తేశారు..అదే కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన కృష్ణ
ఈ సినిమా మాకొద్దని చిరంజీవి, బాలయ్య, మోహన్ బాబు చేతులెత్తేశారు..అదే కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన కృష్ణ
ఒక చిత్రం విషయంలో సూపర్ స్టార్ కృష్ణ ధైర్యంగా తీసుకున్న నిర్ణయం ఆయనకి ఘన విజయాన్ని అందించింది. ఆ చిత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో సూపర్ స్టార్ కృష్ణకి సాటి ఇంకెవరూ లేరని ఇండస్ట్రీలో అంతా చెబుతుంటారు. తన సాహసోపేతమైన నిర్ణయాలు కారణంగానే సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో విజయాలు అందుకున్నారు. చిత్ర పరిశ్రమలో కొత్త ఆవిష్కరణలకు ఆయన కారణమయ్యారు. ఒక చిత్రం విషయంలో సూపర్ స్టార్ కృష్ణ ధైర్యంగా తీసుకున్న నిర్ణయం ఆయనకి ఘన విజయాన్ని అందించింది. ఆ చిత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1982లో కన్నడలో జిమ్మిగల్లు అనే చిత్రం విడుదలైంది. శ్రీప్రియ, విష్ణువర్ధన్ కలిసిన నటించిన ఈ చిత్రం ఫ్లాప్ అయింది. ఈ చిత్రాన్ని నిర్మాత వి బి రావు చూశారు. ఆ సినిమా ఫ్లాప్ అని తెలిసినప్పటికీ.. ఈ కథలో కొన్ని మార్పులు చేసి తెలుగులో రీమేక్ చేస్తే తప్పకుండా హిట్ అవుతుందని ఆయన నమ్మారు. దీంతో ఆ చిత్ర రీమేక్ హక్కులని కొన్నారు.
చిరంజీవితో ఈ చిత్రం చేయాలని ఆయనకి కన్నడ సినిమాని చూపించారు. చిరంజీవికి ఆ చిత్రం నచ్చలేదు.. దీంతో రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత బాలకృష్ణ, మోహన్ బాబులకు కూడా కన్నడ చిత్రాన్ని చూపించారు. వాళ్లు కూడా ఈ ఫ్లాప్ సినిమా రీమేక్ లో నటించేందుకు ఆసక్తి చూపలేదు. కథలో మార్పులు చేస్తామని చెప్పినప్పటికీ ఈ ముగ్గురు హీరోలు ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు.
ఆ తర్వాత ఈ చిత్ర కథలో మార్పులు చేసేందుకు పరుచూరి బ్రదర్స్ రంగంలోకి దిగారు. జిమ్మిగల్లు చిత్రంలో కేవలం మూడు సన్నివేశాలను మాత్రమే పరుచూరి బ్రదర్స్ తీసుకున్నారు. మిగిలిన సన్నివేశాలని, కథని మార్చేశారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణకి కథను వినిపిస్తే ఆయనకి చాలా బాగా నచ్చేసింది. కృష్ణ వెంటనే ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఆ విధంగా కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో ఈ చిత్రం ప్రారంభమైంది. ఈ మూవీలో పోలీస్ అధికారి పాత్రలో సీనియర్ నటి శారద నటించారు. విజయశాంతి లాయర్ గా నటించింది. హీరోయిన్ పాత్రలో రాధ, మరో కీలక పాత్రలో శరత్ బాబు నటించారు. 1987లో 'ముద్దాయి' అనే టైటిల్ తో ఈ చిత్రం రిలీజ్ అయింది. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఫ్లాప్ సినిమా రీమేక్ అయినప్పటికీ కృష్ణ ఈ చిత్రాన్ని చేసేందుకు వెనకడుగు వేయలేదు. మొత్తంగా చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు ఒక సూపర్ హిట్ చిత్రాన్ని మిస్ అయ్యారు.