అఖండ 2 బడ్జెట్ 160 కోట్లు ? స్టార్ హీరోల రేంజ్ లో బోయపాటి రెమ్యునరేషన్
డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ లో అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి.

డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ లో అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. వీరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు సంచలన విజయం సాధించాయి.
ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో అఖండ చిత్రానికి సీక్వెల్ అఖండ 2 తెరకెక్కుతోంది. డివోషనల్ అండ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ‘అఖండ 2’ సినిమా కోసం బోయపాటి శ్రీను రూ.40 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. అఖండ 2 పై ఊహించని క్రేజ్ నెలకొంది. అఖండ మూవీ 80 కోట్ల కలెక్షన్స్ సాధించి బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ క్రేజ్ ని బోయపాటి క్యాష్ చేసుకుంటున్నారు అని అంటున్నారు.
అఖండ చిత్రాన్ని మించేలా రూపొందుతున్న ‘అఖండ 2’ చిత్ర బడ్జెట్ రూ.160 కోట్లకు చేరిందని సమాచారం. అందులో కీలకంగా ఉన్న అంశం బోయపాటి శ్రీనుకి చెల్లించబోయే రెమ్యునరేషన్ అని ఇండస్ట్రీ సర్కిల్స్ పేర్కొంటున్నాయి.
బోయపాటి శ్రీను ఈ ప్రాజెక్టులో పూర్తిగా క్రియేటివ్‌గా ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నారు. స్క్రిప్టింగ్, డైలాగులు, లొకేషన్ స్కౌటింగ్ వంటి ప్రతీ అంశంలో ఆయన స్వయంగా పాల్గొంటున్నారు. అఖండ 2 చిత్రాన్ని విజువల్ వండర్ గా తీర్చిదిద్దాలన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది.
ఈ డీల్‌తో బోయపాటి శ్రీను పారితోషికం పరంగా కోరటాల శివ, సుకుమార్ లాంటి టాప్ డైరెక్టర్ల సరసన నిలిచారు. ‘అఖండ 2’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగంలో బాలకృష్ణ పోషించిన అఘోరా పాత్ర, పవర్‌ఫుల్ డైలాగ్స్, మాస్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తే, ఇప్పుడు దానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టాలీవుడ్ లో మరో భారీ హిట్‌గా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.