సినిమా షూటింగ్ లో సల్మాన్ ఖాన్ హత్య కు ప్లాన్..? విచారణలో వెల్లడైన సంచలన నిజాలు..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాణ్ ఖాన్ హత్యకు కుట్ర జరిగిందా..? సినిమా షూటింగ్ వేదికగా ఆయన్ను చంపాలని చూశారా..? విచారణలో వెల్లడైన సంచలన నిజాలు ఏంటి..?

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను ఓ సినిమా షూటింగ్‌లో హత్య చేసేందుకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పథకం వేసినట్టు తెలుస్తోంది. సల్మాన్‌ను చంపేందుకు బిష్ణోయ్ స్వయంగా తన ముఠా సభ్యులకు 25 లక్షలు సుపారీ ఇచ్చినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురిపై నవీ ముంబై పోలీసులు దాఖలు చేసిన కొత్త ఛార్జ్ షీట్‌లో ఈ విషయం వెల్లడైంది.
రవితేజ ప్రేమ కోసం సూసైడ్ చేసుకోబోయిన టాలీవుడ్ హీరోయిన్..? నిజమెంత..?
చాలా కాలంగా సల్మాన్ ఖాన్ పై కోపంతో రగిలిపోతున్నారు లారెన్స్ బిష్ణోయ్.. అతని మనుషులు. కాస్త సందు దొరికినా.. సల్మాన్ ను హత్య చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు సల్మాన్ ను చంపి తీరుతాం అని లారెన్స్ బిష్ణోయ్ ఓ సందర్భంలో పబ్లిక్ గానే హెచ్చరిక జరీ చేశాడు. ఈక్రమంలోనే సల్మాన్ ఖాన్ కు భద్రత పెంచారు పోలీసులు. వై కేటగిరి భద్రతను సల్మాణ్ ఖాన్ కు అందిస్తున్నారు. ఇక పోలీస్ సెక్యూరిటీతో పాటు.. ప్రైవేట్ గా కూడా సల్మాన్ భద్రతను ఏర్పాటు చేసుకున్నారు.
జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన నిందితులు సల్మాన్ ఖాన్‌ను హతమార్చేందుకు ఆధునిక ఆయుధాలను కొనుగోలు చేయాలని ప్లాన్ చేశారట. 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాను హత్య చేసేందుకు ఉపయోగించిన ఆయుధాలతోనే సల్మాన్ ను హత్య చేయాలని ప్రయత్నిస్తున్నారట. టర్కీలో తయారైన జిగానా పిస్టల్‌తో సల్మాన్‌ఖాన్‌ను హత్య చేయాలని ముఠా ప్లాన్ చేసినట్టు విచారణలో వెల్లడి అయ్యింది.
పవన్ కళ్యాణ్ ఇంట్లో పెత్తనం అంతా ఆమెదేనా..? పవర్ స్టార్ ను కంట్రోల్ చేసే పవర్ ఫుల్ లేడీ ఎవరు ..?
సల్మాన్ ఖాన్ పై దాడి చేసేందుకు ఎం16, ఏకే-47, ఏకే-92 తుపాకులను కొనుగోలు చేసేందుకు పాకిస్థానీ ఆయుధ వ్యాపారితో టచ్‌లో ఉన్నట్లు విచారణలో తేలిందని చార్జిషీట్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ విషయం ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో.. అటు రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారింది.
సల్మాన్ ఖాన్ రాజస్థాన్‌లో కృష్ణజింకలను వేటాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమకు ఆరాధ్య దైవంగా భావించే జింకలను వేటాడినట్టు తెలియడంతో.. ఆతెగ నుంచి ఆదోళణలు.. సల్మాన్ ఖాన్ పై దాడులు జరిగాయి. కోర్టు కేసులు కూడా సుధీర్ఘకాలం నడిచాయి. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ ఇంటి పరిసరాల్లో కాల్పుల సంఘటనతో అంతా ఉలిక్కి పడ్డారు. ఎప్పుడు ఏం జరుగుతుందా అని సల్మాన్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.