దీపికా పదుకొనే నుండి ఆలియా భట్ వరకు స్టార్ హీరోయిన్ల యోగాసనాలు
ప్రతి సంవత్సరం జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటాము. యోగా ఆరోగ్యాన్ని, మానసిక సమతౌల్యాన్ని, ఆధ్యాత్మిక శాంతిని సాధించేందుకు ఎంతో ముఖ్యం. సామాన్యులు కూడా తమ జీవితంలో యోగాను భాగం చేయాలని చెపుతూ సెలబ్రిటీలు స్పూర్తిస్తున్నారు.

స్టార్ హీరోలు హీరోయిన్లు యోగాసనాలతో సామాన్యులకు స్పూర్తినిస్తున్నారు. ఆరోగ్యకర జీవితానికి యోగా ఎంత ముఖ్యమో తెలుపుతున్నారు. శిల్పా శెట్టి, మందిరా బేడి మలైకా అరోరా, కరీనా కపూర్ ఖాన్ దీపికా, ఆలియా ఇలా స్టార్ హీరోయిన్లు యోగా ప్రముఖ్యతను వివరిస్తున్నారు.
శిల్పా శెట్టి
యోగాను తన జీవనశైలిలో భాగంగా మార్చుకున్నవారిలో ముందు వరుసలో శిల్పా శెట్టి ఉంటారు. ఆమె పలు యోగా ఆసనాల వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ యోగా ప్రాముఖ్యత గురించి తెలిపారు. శారీరకంగా దృఢంగా ఉండటంకోసం, మానసిక ప్రశాంతతకు యోగా ఎలా తోడ్పడుతుందో చూపిస్తున్నారు. తన ఫిట్‌నెస్ యాప్‌లు, వీడియోల ద్వారా యోగాను ప్రపంచానికి ప్రచారం చేస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారు కరీనా.
మందిరా బేడి
యోగాను ఫిట్‌నెస్ కోసం మాత్రమే కాదు, అది తన జీవితంలో భాగం అని భావించే తారలలో మందిరా బేడి ఒకరు. ఆమె తరచూ సోషల్ మీడియాలో తన యోగా సాధన కు సబంధించిన ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ ఉంటారు. అంతే కాదు మానసిక బలం, ఎమోషనల్ బ్యాలెన్స్ కు యోగా ఎంత అవసరమో వివరిస్తుంటారు. ఆమె చెప్పే ప్రతీ విషయం వ్యక్తిగత ఎదుగుదలకు యోగా ఎంత కీలకమో చూపిస్తుంది.
మలైకా అరోరా
అందం, ఆరోగ్యం కోసం మలైకా అరోరా తీసుకునే జాగ్రత్తలలో యోగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. 50 ఏళ్లు దాటినా మలైకా ఫిట్ గా, స్ట్రాంగ్ గా ఉండటానికి కారణం.. ఆమె అత్యంత క్లిష్టమైన ఆసనాలను అలవోకగా వేయడమే. యోగా, జిమ్, ప్రాణాయామం ద్వారా తన శారీరక నైపుణ్యాన్ని, స్థైర్యాన్ని చాటుతున్నారు మలైకా. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో యోగా ఎంతగా సహాయపడిందో ఆమె తరచూ చెపుతుంటారు.
కరీనా కపూర్ ఖాన్
కరీనా కపూర్ ఖాన్ ప్రెగ్నెంట్ గా ఉన్న టైమ్ లో కూడా యోగాను ఆపలేదు. అటువంటి సమయంలో కూడా యోగాను ఆమె కొనసాగించారు. తాజాగా యోగాడే సందర్భంగా యోగా ప్రయాణాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు కరీనా. సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించడంలో యోగా పాత్రను ఆమె వివరించారు. కరీనా కపూర్ యోగా స్టైల్ లో ఆధునికత, సంప్రదాయం రెండూ కలిసి ఉంటాయి, ఇది యువతను ఎంతగానో ఆకర్షిస్తోంది.
దీపికా పదుకొనే
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే శారీరక , మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి యోగా చేస్తారు. రోజువారి పనులు, షూటింగ్ వల్ల కలిగే అలసట నుంచి మానసిక ప్రశాంతత కోసం దీపికా యోగా చేస్తారు. యోగా వల్ల జీవితంలో ఎన్నో సమస్యలను ధైర్యంగా ఫేస్ చేసే మానసిక బలం చేకూరుతుంది అని అంటారు దీపికా.
అలియా భట్
ఇక అలియా భట్ విషయానికి వస్తే జిమ్ వర్కౌట్‌లను యోగాతో బాలన్స్ చేస్తుంటుంది స్టార్ హీరోయిన్. యోగాతో శారీరికంగా, మానసికంగా ఎంత ధృడంగా ఉండగలమో వివరిస్తుంది ఆలియా భట్. రోజువారి జీవితంలో కలిగే అలసటను దూరం చేసుకోవడం కోసం యోగా ఉపయోగపడుతుందంటున్నారు ఆలియా భట్.