- Home
- Entertainment
- వెంకటేష్ కు కూతురిగా, ప్రియురాలిగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? షాక్ అవుతారు
వెంకటేష్ కు కూతురిగా, ప్రియురాలిగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? షాక్ అవుతారు
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కోక్క సారి వింత పరిస్థితులు ఏర్పడుతుంటాయి. తండ్రి కూతర్లుగా నటించిన స్టార్లు ఆతరువాత హీరో హీరోయిన్లుగా నటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. స్టార్ హీరో వెంకటేష్ కూతురిగా నటించి, తర్వాత ఆయన జోడీగా రొమాన్స్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

గతంలో ఎఎన్నార్ ఎన్టీఆర్ లసినిమాల్లో బాలనటులుగా నటించిన హీరోయిన్లు.. ఆతరువాతకాలంలో వారి జంటగా నటించి మెప్పించిన వారు ఉన్నారు. ఎన్టీఆర్ కు మనవరాలిగా నటించిన శ్రీదేవి ఆతరువాత కాలంలో చాలా సినిమాల్లో ఆయన పక్కన హీరోయిన్ గా నటించిన సంగతి అందరికి తెలిసిందే.
ఆతరువాత తరం హీరోలలో ఒకరైన వెంకటేష్ కు కూతురుగా నటించి, ఆతరువాత ఆయన జంటగా నటించిన హీరోయిన్ గురించి మీకు తెలుసా? ఆమె ఎవరో కాదు శ్రీదేవి. అవును అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్నాలర్లతో ఎలాగైతే చేసింది. వెంకటేష్ కు కూడా ఒక సినిమాలో కూతురి వరసలో నటించి.. ఆతరువాత కొన్నేళ్లకు హీరోయిన్ గా నటించింది. ఇంతకీ ఏంటా సినిమాలు?
ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన శ్రీదేవి, తన బాల్యం నుంచే ఎన్నో భాషల్లో సినిమాలు చేసింది. ఆమె కథ కూడా వినూత్నంగా ఉంది. 1972లో తమిళంలో విడుదలైన వసంత మాళిగై అనే చిత్రంలో, శ్రీదేవి ఒక చిన్నపాప పాత్రలో కనిపించింది. ఈ చిత్రం 1971లో తెలుగులో ప్రేమనగర్ పేరుతో నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా రూపొందిన సినిమాకు తమిళ రీమేక్.
ఈ తమిళ చిత్రంలో లెజెండరీ నటుడు శివాజీ గణేషన్ ప్రధాన పాత్ర పోషించగా, అతని సోదరుడి పాత్రలో 'విజయ్' నటించారు. ఈసినిమాలోనే బాల నటుడిగా వెంకటేష్ ఓ పాత్రను పోషించారు. వెంకటేష్ విజయ్ కు చిన్న తమ్ముడి క్యారెక్టర్ లో కనిపించారు. కాగా విజయ్ కూతురిగా శ్రీదేవి నటించింది. అంటే శ్రీదేవి బాబాయి పాత్రలో వెంకటేష్ కనిపించారు.
ఇక ఈ సినిమా తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆతరువాత 19 ఏళ్లకు అంటే 1991లో విడుదలైన క్షణ క్షణం సినిమాలో వెంకటేష్ శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించారు. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో వెంకటేశ్, శ్రీదేవి జంటగా నటించారు. ఈ సినిమాకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. ఇది వెంకటేశ్, శ్రీదేవి కలిసి నటించిన ఏకైక సినిమా కావడం విశేషం. ఆతరువాత వీరు మరే సినిమా చేయలేదు.
ఇక క్షణం క్షణం సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమూవీ సాంకేతికంగా కూడా ఆకట్టుకుంది. ఇక శ్రీదేవి తెలుగులో చాలా సినిమాలు చేశారు, కాని 1994లో చిరంజీవి సరసన నటించిన ఎస్పీ పరశురాం సినిమాతో తెలుగులో తన ప్రయాణాన్ని ముగించారు. ఆతరువాత బాలీవుడ్ కు వెళ్ళిన శ్రీదేవి అక్కడ స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది.
శ్రీదేవిత్ పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలనటిగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత హీరోయిన్లుగా మారిన తారలు చాలామంది ఉన్నారు. అందులో ప్రముఖంగా మీనా పేరు కూడా చెప్పుకోవచ్చు. 1984లో విడుదలైన అన్బుల్లా రజినీకాంత్ అనే తమిళ సినిమాలో రజినీకాంత్ కుమార్తె పాత్రలో బాలనటిగా నటించిన మీనా, తరువాత అదే రజినీకాంత్ సరసన ముత్తు వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది.