- Home
- Entertainment
- Radhika Apte: హీరోలు ముసలోళ్లు కారు, హీరోయిన్లకు మాత్రం.. బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Radhika Apte: హీరోలు ముసలోళ్లు కారు, హీరోయిన్లకు మాత్రం.. బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Radhika Apte: వయసు పెరిగే కొద్దీ హీరోయిన్లకు అవకాశాలు రావడం చాలా కష్టం. హీరోయిన్లు తమ అందాన్ని కాపాడుకోవడం కూడా చాలా పెద్ద సవాలు అని బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే అన్నారు.

రాధిక ఆప్టే..
బాలీవుడ్ నటి రాధిక ఆప్టే కి పరిచయం అవసరం లేదు.అనేక హిట్ సినిమాల్లో నటించి, తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. తెలుగులోనూ కూడా ఆమె నటించారు. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘లెజెండ్’ మూవీలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. రీసెంట్ గా రాధిక ఆప్టే..‘ సలీ మహమ్మద్’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె అందం కంటే.. నటనకే ఎక్కువ ప్రాధానత్య ఇచ్చారు. తన లుక్ గురించి మీడియాతో మాట్లాడుతూ, తన బరువు కారణంగా చాలా సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
బరువు పెరిగానని సినిమాలో నుంచి తీసేశారు..
తన కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడే ఓ క్యారెక్టర్ ని కేవలం బరువు కారణంగా కోల్పోయానని రాధిక ఆప్టే తెలియజేశారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని చెప్పారు. ‘ కొన్ని సంవత్సరాల క్రితం నన్ను దృష్టిలో ఉంచుకొని ఓ డైరెక్టర్ సినిమా కి కథ రెడీ చేసుకున్నారు. ఆ మూవీకి సంబంధించి చర్చలు కూడా పూర్తయ్యాయి.అయితే, ఈ మూవీ షూటింగ్ మొదలవ్వడానికి ముందు.. నేను ఓ ట్రిప్ కి వెళ్లాను. ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత షూటింగ్ కి వెళ్దాం అనుకున్నాను. ట్రిప్ లో ఉన్నప్పుడు ఎలాంటి డైట్ ఫాలో అవ్వలేదు. నచ్చిన ఫుడ్ తిన్నాను. దీంతో నాలుగు కేజీల బరువు పెరిగాను. అయితే, షూటింగ్ మొదలవ్వడానికి ముందే డైట్, వర్కౌట్ చేసి బరువు తగ్గుతాను అని మేకర్స్ కి ప్రామిస్ కూడా చేశాను.కానీ, ఆలోపు మూవీకి సంబంధించి ఫోటో షూట్ చేశారు. అందులో లావుగా కనిపించాను అని నన్ను ఆ మూవీ నుంచి తీసేశారు. మరో నటితో ఆ సినిమాను తీశారు. ఆ సినిమా హిట్ అయ్యింది. ఆ నటి పెద్ద హీరోయిన్ అయ్యింది’ అని రాధిక ఆప్టే చెప్పారు.
హీరోలకు ఒక రూల్.. హీరోయిన్లకు ఒక రూల్..
"నా కెరీర్‌ను శిఖరానికి తీసుకెళ్లే అవకాశం చేజారిపోయింది. ఆ నిజాన్ని గ్రహించడానికి నాకు సంవత్సరాలు పట్టింది. దాని నుండి బయటపడటానికి నేను థెరపీ తీసుకోవలసి వచ్చింది," అని రాధిక చెప్పింది. దాని తర్వాత తన ఆలోచన మారిందని రాధిక చెప్పారు.
ఆ సంఘటన తనకు ఒక వరంలాంటిదని రాధిక చెప్పింది. ఆ తర్వాత, తాను అందం గురించి ఎక్కువగా ఆందోళన చెందలేదు. ఎవరి కోసం తాను బరువును మార్చుకోలేనని, తనపై తనకు ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని ఆమె చెప్పింది. తాను బిడ్డ పుట్టిన తర్వాత కేవలం మూడు నెలలకే మళ్లీ వచ్చి సినిమా చేశానని, ఆ సినిమా చేసిన సమయంలో తాను బాగా బరువు పెరిగే ఉన్నాను అని.. కానీ ఆందోళన చెందకుండా కేవలం నటన మీద మాత్రమే ధ్యాస పెట్టాను అని ఆమె చెప్పారు.
‘ వయసు విషయంలో కూడా పురుషులకు, మహిళలకు మధ్య తేడా ఉంటుంది. పురుషులకు వయసు పెరగడం అంటే ముసలితనం రావడం కాదు. కానీ మహిళలకు వయసు పెరగడం అంటే ముసలితనం రావడం లాంటిదే. ఈ తేడా ముఖ్యంగా సినిమా రంగంలో స్పష్టంగా కనిపిస్తుంది’ అని రాధిక ఆప్టే చెప్పారు.

