MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Govinda: ఆత్మహత్యకు యత్నించిన గోవిందా.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాలీవుడ్ స్టార్

Govinda: ఆత్మహత్యకు యత్నించిన గోవిందా.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాలీవుడ్ స్టార్

Bollywood Actor Govinda: నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు బాలీవుడ్ స్టార్ గోవిందా షాకింగ్ విషయాలు వెల్లడించారు. గోవిందా ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు? అసలు ఏం జరిగింది? ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 10 2026, 09:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నర్మదా నది తీరంలో ఆ రోజు ఏం జరిగింది? చావు అంచుల దాకా వెళ్లిన గోవిందా
Image Credit : Govinda/ Facebook

నర్మదా నది తీరంలో ఆ రోజు ఏం జరిగింది? చావు అంచుల దాకా వెళ్లిన గోవిందా

90ల కాలంలో తన కామెడీ, ఎనర్జెటిక్ డాన్సులతో బాలీవుడ్‌ను ఏలిన స్టార్ హీరో గోవిందా. ఎప్పుడూ నవ్వుతూ, పక్కన ఉన్నవారిని నవ్విస్తూ కనిపించే ఈ నటుడి జీవితంలో ఎవరికీ తెలియని ఒక మహా విషాదం ఉంది. ఒకానొక సమయంలో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఇటీవల ఏఎన్‌ఐ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న గోవిందా, తన తల్లి నిర్మలా దేవి మరణం తర్వాత తాను అనుభవించిన నరకాన్ని, ఆత్మహత్య ఆలోచనలను ఓపెన్‌గా పంచుకున్నారు.

1996 జూన్ 15న ప్రముఖ హిందూస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, నటి అయిన గోవిందా తల్లి నిర్మలా దేవి 69 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అమ్మ అంటే ప్రాణంగా భావించే గోవిందా, ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయారు. ఆ గ్యాప్‌లో తీవ్ర భావోద్వేగానికి లోనై, నర్మదా నది లోపలికి నడుచుకుంటూ వెళ్లినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆత్మహత్య యత్నం.. అంతా అయిపోయిందనుకున్నా
Image Credit : ANI

ఆత్మహత్య యత్నం.. అంతా అయిపోయిందనుకున్నా

పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో గోవిందా మాట్లాడుతూ.. "ఆ సమయంలో నేను చెప్పలేని తీవ్రమైన మనో వేదనలో ఉన్నాను. నాకు చాలా బాధగా అనిపించింది. నా జీవితంలో అంతా అయిపోయింది, ఇక ఇదే చివరి అనిపించింది. నేను నర్మదా నది ఒడ్డున ఉన్నాను. నదిలోకి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నా తల్లిని మళ్లీ కలుసుకోవచ్చని ఆలోచించాను. అందుకే నీళ్లలోకి దిగి ముందుకు వెళ్లాను" అని తెలిపారు.

యాంకర్ ప్రశ్నిస్తూ.. మీరు ఆ క్షణంలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అని అడగ్గా, గోవిందా స్పందిస్తూ.. "ఒక రకంగా అవుననే చెప్పాలి. నేను మా అమ్మకు చాలా దగ్గరగా ఉండేవాడిని. ఆమెను అమితంగా ప్రేమించాను. లోకం దీన్ని ఆత్మహత్య అని పిలుస్తుంది. కానీ నిజానికి మన దగ్గర అలాంటిదేమీ ఉండదు. జీవితం ఎప్పటికీ అంతం కాదు, అది కొత్త రూపాలను తీసుకుంటుంది" అని తన భావాలను వ్యక్తపరిచారు.

Related Articles

Related image1
తెలంగాణ మాల్దీవులు: హైదరాబాద్‌కు దగ్గర్లోనే.. ఈ హిడెన్ ఐలాండ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది !
Related image2
Ohh My Dog: క్లైమాక్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు.. మస్ట్ వాచ్ క్రైమ్ థ్రిల్లర్.. ఓ మై డాగ్ సినిమా రివ్యూ
35
కాపాడిన పూజారి.. నన్ను మేల్కొలిపిన మాటలు అవే
Image Credit : ANI

కాపాడిన పూజారి.. నన్ను మేల్కొలిపిన మాటలు అవే

నీటిలో ముందుకు వెళ్తున్న గోవిందాను రామ కుండల్ అనే పూజారి గమనించారు. ఆ పూజారి గోవిందాను గట్టిగా పిలిచి, నదిలో నుంచి బయటకు తీసుకురావడంలో సహాయం చేశారు. "ఆ పూజారి నన్ను పిలిచి నా వైపు వచ్చారు. నేను బయటకు వచ్చాక, ఏమైంది గోవిందా? అని అడిగారు. ఆ క్షణంలో నేను ఏదో తప్పు చేస్తున్నానని ఎవరో నాకు చెప్పినట్లు అనిపించింది. నా పిల్లల కోసం నేను బతకాలని ఆ క్షణంలో గ్రహించాను. నాకు ఒక గొప్ప పాఠం దొరికింది" అని గోవిందా ఆ క్షణాలను వివరించారు.

ఈ విపరీతమైన మానసిక వేదన నుంచి బయటపడటానికి, జీవితంలో కొత్త లక్ష్యాన్ని వెతుక్కోవడానికి తనకు 15 రోజులకు పైగా పట్టిందని ఆయన అన్నారు. ఈ సంఘటన తన కెరీర్, స్టార్‌డమ్‌ను చూసే విధానాన్ని పూర్తిగా మార్చేసిందని తెలిపారు.

45
అండర్‌వరల్డ్ బెదిరింపులు.. రాజేష్ ఖన్నా, ధర్మేంద్రలపై కామెంట్స్
Image Credit : instagram.com/govinda_herono1

అండర్‌వరల్డ్ బెదిరింపులు.. రాజేష్ ఖన్నా, ధర్మేంద్రలపై కామెంట్స్

ఇదే ఇంటర్వ్యూలో గోవిందా ఇతర ఆసక్తికర విషయాలను కూడా వెల్లడించారు. అండర్‌వరల్డ్ నుంచి బెదిరింపులు వచ్చాయా అని అడగ్గా, "ఆ రోజుల్లో ఎవరికి బెదిరింపులు రాలేదు? దేశంలో ఒక ట్రెండ్ నడుస్తున్నప్పుడు నటులు దాని నుంచి ఎలా విడిగా ఉంటారు?" అని సమాధానమిచ్చారు.

అలాగే దిగ్గజ నటులు రాజేష్ ఖన్నా, ధర్మేంద్రల గురించి మాట్లాడుతూ.. "వారు పని గురించి బాగా ప్లాన్ చేసేవారు. కానీ పని పూర్తయ్యాక ఎలాంటి ప్లానింగ్ చేసుకునేవారు కాదు. వారు ఎప్పుడూ ఒక నిర్దిష్టమైన ఇమేజ్ తయారుచేసుకోవడానికి ప్రయత్నించలేదు. సాయంత్రం వేళ సరదాగా కూర్చుని డ్రింక్ చేసేవారు" అని చెప్పారు. తన హీరోయిన్లతో కెమిస్ట్రీ, డాన్స్ మూవ్స్ గురించి చెబుతూ, తన సినిమాలు ఆడకపోయినా పాటలు కచ్చితంగా హిట్ అవుతాయనే నమ్మకం తనకు ఉండేదని నవ్వుతూ పేర్కొన్నారు.

55
7 ఏళ్ల తర్వాత 'రూపా'తో గోవిందా కంబ్యాక్
Image Credit : instagram.com/govinda_herono1

7 ఏళ్ల తర్వాత 'రూపా'తో గోవిందా కంబ్యాక్

సుదీర్ఘ విరామం తర్వాత గోవిందా మళ్లీ వెండితెరపై అలరించేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 7 సంవత్సరాల విరామం తర్వాత ఆయన 'రూపా' అనే చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, గోవిందా ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో బిజీగా పాల్గొంటున్నారు. ఎంతోమంది అభిమానులు ఈ 90స్ సూపర్ స్టార్ కంబ్యాక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
బాలీవుడ్
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Review: టాక్సిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. యష్‌ దెబ్బకి బాక్సాఫీస్‌ షేక్‌, కానీ షాకింగ్‌ రిపోర్ట్
Recommended image2
Chiranjeevi: ఎస్పీ బాలు సంగీతం అందించిన సినిమా.. సుమన్, విజయశాంతి లకు చుక్కలు చూపించిన చిరంజీవి
Recommended image3
Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్‌.. రవితేజ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే కలెక్షన్లు
Related Stories
Recommended image1
తెలంగాణ మాల్దీవులు: హైదరాబాద్‌కు దగ్గర్లోనే.. ఈ హిడెన్ ఐలాండ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది !
Recommended image2
Ohh My Dog: క్లైమాక్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు.. మస్ట్ వాచ్ క్రైమ్ థ్రిల్లర్.. ఓ మై డాగ్ సినిమా రివ్యూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved