MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Korean Kanakaraju 3 Days Collections: బాక్సాఫీసు వద్ద కొరియన్‌ కనకరాజు రచ్చ.. వరుణ్‌ తేజ్‌ మూవీ 3 రోజుల వసూళ్లు

Korean Kanakaraju 3 Days Collections: బాక్సాఫీసు వద్ద కొరియన్‌ కనకరాజు రచ్చ.. వరుణ్‌ తేజ్‌ మూవీ 3 రోజుల వసూళ్లు

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, రితికి నాయక్‌ జంటగా నటించిన `కొరియన్‌ కనకరాజు` గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఇది మూడు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ కావడం విశేషం.

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 10 2026, 08:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కొరియన్‌ కనకరాజు మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ
Image Credit : Asianet News

కొరియన్‌ కనకరాజు మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ కి ఎట్టకేలకు హిట్‌ పడింది. ఆయన తాజాగా `కొరియన్‌ కనకరాజు` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గత శుక్రవారం(ఆగస్ట్ 7)న ఈ చిత్రం విడుదలైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రితిక నాయక్‌ హీరోయిన్‌గా నటించగా, సత్య, మురళీధర్‌ గౌడ్‌, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్ టైన్‌మెంట్స్ పతాకాలపై తెరకెక్కిన చిత్రమిది. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్‌ని తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. మూడు రోజుల్లోనే అదిరిపోయే వసూళ్లని రాబట్టింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కొరియన్‌ కనకరాజు మూవీ 3 రోజుల కలెక్షన్లు
Image Credit : Asianet News

కొరియన్‌ కనకరాజు మూవీ 3 రోజుల కలెక్షన్లు

వరుణ్‌ తేజ్‌కి హిట్‌ లేక చాలా రోజులవుతుంది. దీంతో ఆ లోటుని ఇప్పుడు `కొరియన్‌ కనకరాజు` తీర్చింది. ఎట్టకేలకు వరుణ్‌ తేజ్‌కి హిట్‌ పడింది. ఈ సినిమా మూడు రోజుల్లో మంచి వసూళ్లని రాబట్టింది. మొత్తంగా ఇది రూ.35కోట్లు రాబట్టినట్టు సమాచారం. రెండు రోజుల్లోనే దీనికి రూ.23.6కోట్లు రాగా, మూడో రోజు దాదాపు రూ.13కోట్లు వసూలు చేయడం విశేషం. గత రెండు రోజులతో పోల్చితే ఆదివారం దీనికి కలెక్షన్లు పెరిగాయి. సండే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ర్యాంపేజ్‌ ఆడిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి మూడు రోజుల్లో సుమారు ఇరవై కోట్లు రాబట్టినట్టు ట్రేడ్‌ సైట్లు వెల్లడించడం గమనార్హం.

34
మూడు రోజుల్లోనే కొరియన్‌ కనకరాజు బ్రేక్‌ ఈవెన్‌
Image Credit : Asianet News

మూడు రోజుల్లోనే కొరియన్‌ కనకరాజు బ్రేక్‌ ఈవెన్‌

ఇక `కొరియన్‌ కనకరాజు` చిత్రానికి సుమారు రూ.38కోట్ల బడ్జెట్‌ అయ్యిందని సమాచారం. సినిమాకి అయిన థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.12కోట్లు. నాన్‌ థియేట్రికల్‌గా సుమారు రూ.26కోట్లు వచ్చాయి. దీనికి థియేటర్ రన్‌ ద్వారా రూ.35కోట్లు రావడంతో ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ కావడమనే కాదు ఆల్‌రెడీ లాభాల్లోకి వెళ్లింది. ఇటీవల కాలంలో ఇలా తొలి వారాంతంలోనే సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కావడం అరుదైన రికార్డుగా చెప్పొచ్చు. అంతేకాదు సోమవారం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సాలిడ్‌గానే ఉంది. ఇది సినిమా బ్లాక్‌ బస్టర్ దిశగా వెళ్తుందనే దానికి నిదర్శనంగా చెప్పొచ్చు. మొత్తంగా `కొరియన్‌ కనకరాజు` మూవీ వరుణ్‌ తేజ్‌కి కెరీర్‌ బెస్ట్ కలెక్షన్లని రాబడుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

44
హర్రర్‌ కామెడీగా నవ్వులు పూయిస్తున్న కొరియన్‌ కనకరాజు
Image Credit : X/@UV_Creations

హర్రర్‌ కామెడీగా నవ్వులు పూయిస్తున్న కొరియన్‌ కనకరాజు

`కొరియన్‌ కనకరాజు` హర్రర్‌, థ్రిల్లర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. వరుణ్‌ తేజ్‌ కనకరాజుగా కనిపించారు. ఆయన లోకల్‌గా గల్లీ రౌడీ లాంటి వాడు. బార్‌లో ప్రత్యర్థులతో గొడవలో భాగంగా ఆయన ఒక కొరియన్‌ గ్యాంగ్‌స్టర్‌ ఆత్మ ఉన్న బాటిల్‌లో మందు పోసుకొని తాగుతాడు. దీంతో ఆ ఆత్మ కనకరాజులోకి వెళ్తుంది. ఆ తర్వాత చోటు చేసుకున్న కామెడీ అంశాలు, యాక్షన్‌ అంశాల సమాహారమే ఈ చిత్రం. థ్రిల్‌కి గురి చేస్తూ నవ్విస్తూ, యాక్షన్‌తో ఆకట్టుకుందీ మూవీ. సత్య కామెడీ సినిమాకే హైలైట్‌గా నిలిచిందని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: హౌస్ నుంచి అపూర్వ, చరణ్ ఇద్దరూ అవుట్.. షాలినికి చుక్కలు చూపించిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్
Recommended image2
Ramakrishna: ఖాకీ యూనిఫామ్ వేసుకోవాలనే కల, కానీ క్యాటరింగ్ యూనిఫామ్ తో జీవితం.. బిగ్ బాస్ లోకి రామకృష్ణ
Recommended image3
Swetha Naidu: సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసుకుని ఇండస్ట్రీలోకి శ్వేతా నాయుడు, బిగ్ బాస్ లోకి ఫైర్ బ్రాండ్ ఎంట్రీ
Related Stories
Recommended image1
OTT Movies: ఈ వారం ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని సినిమాలు ఇవే..భారత్ భాగ్య విధాత, కాటాలన్ తో పాటు మరిన్ని
Recommended image2
Mega Family: ఓజీ నుంచి కొరియన్ కనకరాజు వరకు, మెగా ఫ్యామిలీ జోరు చూశారా.. ఇక మిగిలింది ఒక్కడే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved