Ankit Siwach: ఇదెక్కడి విడ్డూరం.. యువ నటుడి ఫోటోలు న్యూడ్ గా, కాంప్రమైజ్ కావాలన్నారు
చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కానీ ఒక నటుడు కాస్టింగ్ కౌచ్ బారిన పడడం, లైంగిక వేధింపులు ఎదుర్కోవడం విడ్డూరమే అవుతుంది.
Ankit Siwach
చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కెరీర్ ప్రారంభంలో అయితే ఆడిషన్స్ పేరుతో లైంగిక వేధింపులు కూడా జరుగుతాయని చాలా మంది నటీమణిలు తమ చేదు అనుభవాలని గతంలో బయట పెట్టారు. కాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమాల్లో హీరోయిన్ల పై జరుగుతున్న వేధింపులు చాలా వరకు బయట పడ్డాయి.
Ankit Siwach
కానీ ఒక నటుడు కాస్టింగ్ కౌచ్ బారిన పడడం, లైంగిక వేధింపులు ఎదుర్కోవడం విడ్డూరమే అవుతుంది. ఒక బాలీవుడ్ నటుడు లైంగిక వేధింపులకు గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. హిందీ టీవీ సీరియల్స్ లో నటుడిగా రాణిస్తున్న అంకిత్ శివాచ్ తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ వేధింపుల గురించి తాజాగా ఇంటర్వ్యూలో బయట పెట్టాడు.
Ankit Siwach
తాను మోడలింగ్ కి వచ్చిన కొత్తల్లోనే తనకు కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురయ్యాయి అని అంకిత్ అన్నారు. ఇండస్ట్రీలో అందరూ మంచివారే అని భావించేవాడిని. అలా అనుకోవడమే నాకు బలహీనతగా మారింది. నాకు సంబంధం లేని పనులు చేయమనేవారు. వేధించేవారు. ఒకానొక సమయంలో మోడలింగ్, ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోదామని అనుకున్నా.
Ankit Siwach
ఒంటిమీద బట్టలు లేకుండా న్యూడ్ గా ఫోటోలు పంపమనేవారు. నైట్ పార్టీలకు రావాలని పిలిచేవారు. కాంప్రమైజ్ కాకుంటే ఇండస్ట్రీలో నిలబడడం కష్టం అని బెదిరించేవారు అంటూ అంకిత్ వాపోయాడు. వాళ్ళ ప్రవర్తన చూసి రాబందులు పీక్కు తింటున్నాయి అనిపించేది.
Ankit Siwach
కానీ అధికారంలో ఉన్నవారి స్వభావం అంతే అని సైలెంట్ అయిపోయేవాడిని. ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనల నుంచి తప్పించుకోవడం కష్టం. ఏదో ఒక సమయంలో ఫేస్ చేయాల్సిందే అని భావించే వాడిని. నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి అని అంకిత్ పేర్కొన్నాడు.
Ankit Siwach
ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగిన సెలెబ్రిటీలని గుర్తు చేసుకుంటూ ముందడుగు వేశానని అంకిత్ తెలిపాడు. మహిళలకే కాదు.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పురుషులకు కూడా ఎదురవుతోందని అంకిత్ తెలిపాడు.